టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్
నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు
కథ: హరి ఏలేటి
మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్
సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: నరేష్ కుమరన్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
విడుదల తేది: జులై 21, 2022
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5
గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే.
విశ్లేషణ:
పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు.
ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో.
ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ..
ఎవరెలా చేశారంటే?
నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు.
ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది.
-సంజు (సాక్షి వెబ్‌డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment