‘పరంపర’కు ప్లాటినమ్ అవార్డ్ | Parampara Got Platinum Award at International Film Award | Sakshi
Sakshi News home page

‘పరంపర’కు ప్లాటినమ్ అవార్డ్

Published Thu, Sep 25 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

‘పరంపర’కు ప్లాటినమ్ అవార్డ్

‘పరంపర’కు ప్లాటినమ్ అవార్డ్

 ఆర్ష సంప్రదాయానికి పూర్వవైభవం తేవాలనే లక్ష్యంతో స్వీయదర్శకత్వంలో మధు మహంకాళి రూపొందించిన చిత్రం ‘పరంపర’. నరేశ్, ఆమని జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. కాగా, ఇండోనేసియాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అక్కడ ఈ చిత్రానికి ‘ప్లాటినమ్ అవార్డు’ లభించడం విశేషం. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను, చితికి పోతున్న బంధాలను, బాంధవ్యాలను తిరిగి స్వాగతించడమే ప్రధానాంశంగా రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉందని మధు మహంకాళి పేర్కొన్నారు. రావి కొండలరావు, సంతోష్, మనీషా, మాస్టర్ సాయితేజ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసన్నజైన్, సంగీతం: అర్జున్, కూర్పు: పరేష్ కాందార్, పాటలు: రాణిపులోమజాదేవి, నిర్మాణం: ధృతి మీడియా ప్రై.లిమిటెడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement