మళ్లీ సమ్మోహనం | Nagarjuna's 'Meelo Evaru Koteeswarudu Season 2 | Sakshi
Sakshi News home page

మళ్లీ సమ్మోహనం

Dec 6 2014 10:55 PM | Updated on Jul 15 2019 9:21 PM

మళ్లీ సమ్మోహనం - Sakshi

మళ్లీ సమ్మోహనం

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి సమ్మోహన పరిచేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ‘మా’ టీవీ చరిత్రలోనే అద్భుతమైన రేటింగ్స్ సాధించిన

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి సమ్మోహన పరిచేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ‘మా’ టీవీ చరిత్రలోనే అద్భుతమైన రేటింగ్స్ సాధించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సిరీస్ ఈ సోమవారం నుంచే మొదలు కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ వారానికి అయిదు రోజులు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మా టీవీ చైర్మన్ ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ -‘‘నమ్మలేని విధంగా జీవితాన్ని మార్చేసే షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. విజ్ఞానాన్ని అందించడం ద్వారా సామాజికంగా మంచి మార్పుని తీసుకొచ్చే సమర్థత ‘మా’ టీవీకి ఉందనడానికి నిదర్శనం లాంటి షో ఇది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement