కోటీశ్వరుడు మళ్లీ రెడీ! | Meelo Evaru Koteeswarudu (MEK) Season 2 to commence soon | Sakshi
Sakshi News home page

కోటీశ్వరుడు మళ్లీ రెడీ!

Oct 8 2014 11:00 PM | Updated on Jul 21 2019 4:48 PM

కోటీశ్వరుడు మళ్లీ రెడీ! - Sakshi

కోటీశ్వరుడు మళ్లీ రెడీ!

తెలుగు టీవీ చరిత్రలో సరికొత్త సంచలనాలకు వేదికగా నిలిచిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో రెండో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ‘మా’ టీవీలో తొలి సీజన్ విజయవంతంగా ప్రసారమైన సంగతి

 తెలుగు టీవీ చరిత్రలో సరికొత్త సంచలనాలకు వేదికగా నిలిచిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో రెండో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ‘మా’ టీవీలో తొలి సీజన్ విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా వ్యవహరించిన కథానాయకుడు నాగార్జున మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సన్నద్ధమవుతున్నారు. ‘‘ఈ షోలో పాల్గొనడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు (అక్టోబర్ 9) రాత్రి 7 గంటలకు ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ఎంపికైన వారు హాట్ సీట్‌కు చేరుకోవడంతో పాటు, కోటి రూపాయల నగదు గెలుచుకునే సువర్ణావకాశాన్ని పొందుతారు. తొలి సీజన్ బుల్లితెరపై ఎన్నో రికార్డులు నమోదు చేసింది. విజ్ఞానాన్ని పెంపొందించే ఈ కార్యక్రమం ద్వారా హృదయాన్ని కలచివేసే ఎన్నో జీవితగాథలు వెలుగులోకొచ్చి ఎందరికో స్ఫూర్తినిస్తోంది’’ అని ‘మా’ టీవీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు   http://mek.maatv.com లో చూడవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement