ఫిబ్రవరి నుంచే బుల్లితెరపై మెగాస్టార్ | Mega Star TV appearance in February | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి నుంచే బుల్లితెరపై మెగాస్టార్

Published Thu, Jan 19 2017 4:21 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఫిబ్రవరి నుంచే బుల్లితెరపై మెగాస్టార్ - Sakshi

ఫిబ్రవరి నుంచే బుల్లితెరపై మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 సినిమాతో రికార్డ్ వేట కొనసాగిస్తున్న చిరు ఇప్పుడు బుల్లితెర మీద దృష్టి పెట్టాడు. తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాధరణ కలిగిన షోగా పేరు తెచ్చుకున్న మీలో ఎవరు కోటీశ్వరుడుకు మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది.

గతంలో నాగర్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించగా రికార్డ్ టీఆర్పీలను సాధించింది. ఇప్పుడు చిరంజీవి ప్రశ్నలు సందించడానికి రెడీ అవుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే సీరీస్ ఎన్ని రోజులు కొనసాగుతుందన్న విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement