హాట్ సీటు మీద మెగాస్టార్ డౌటే..
హాట్ సీటు మీద మెగాస్టార్ డౌటే..
Published Wed, Jul 30 2014 4:01 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
సిల్వర్ స్క్రీన్ కు మెగాస్టార్ చిరంజీవి దూరమై సుమారు 7 సంవత్సరాలు కావోస్తోంది. 150వ చిత్రంపై ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు. అయితే బుల్లితెరపై ఓ ఎపిసోడ్ లో మెగాస్టార్ కనిపిస్తున్నారనే వార్త అభిమానులకు కొంత ఊరట కలిగించింది. అయితే బుల్లితెరకు కూడా మెగాస్టార్ దూరమవుతున్నారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివారాల్లోకి వెళితే...తెలుగు టెలివిజన్ రేటింగ్ చరిత్రలో సంచలనాలు క్రియేట్ చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని నాగార్జున ప్రజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత చిరంజీవి జన్మదినం ఆగస్టు 22 తేదిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కనిపించనున్నరంటూ వార్తలు వెలువడ్డాయి. కాని అదే సమయానికి సోని టెలివిజన్ లో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎనిమిదో ఎడిషన్ ఆగస్టు 11వ తేది నుంచి ప్రారంభకానుంది.
ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాంతీయ భాషల్లో, ప్రాంతీయ చానెళ్లలో ప్రసారం కాకూడదనే నిబంధన ఉంది. దాంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 11 తేది నుంచి తాత్కాలికంగా ఆపివేయాల్సి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బుల్లితెరపై మెగాస్టార్ కనిపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగాస్టార్ ను ఎలాగైనా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గోనేలా ఆగస్టు 3 తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Advertisement
Advertisement