బుల్లి తెరపై మెగాస్టార్..? | Chiranjeevi in Meelo Evaru Koteeswarudu | Sakshi
Sakshi News home page

బుల్లి తెరపై మెగాస్టార్..?

Published Thu, Sep 8 2016 8:09 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

బుల్లి తెరపై మెగాస్టార్..? - Sakshi

బుల్లి తెరపై మెగాస్టార్..?

పదేళ్ల పాటు తెరకు దూరమైన మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150 సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు చిరు. అదే సమయంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా భారీగా ఫ్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించిన మెగాస్టార్ ఇప్పుడు మరో రంగంలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడట. తెలుగు బుల్లితెర టిఆర్పిలలో సరికొత్త రికార్డ్లు సృష్టించిన ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించేందుకు మెగాస్టార్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది.

ఉత్తరాదిలో ఘనవిజయం సాధించిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో తెలుగులోను రూపొందిచారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి ఇన్నాళ్లు కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న నాలుగో సీజన్లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా అలరించనున్నాడట. ఈ విషయంపై మెగా క్యాంప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement