Meelo Evaru Koteeswarudu
-
ఫాన్స్ కి నిద్ర కరువు మరో కొత్త షోకి హోస్టుగా ఎన్టీఆర్!
-
KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్‌పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి.. జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే.. పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?! ఆ చాన్స్‌తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో! ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది.. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది.. ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది.. ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ.. 2000 సంవత్సరం మార్చి.. Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్‌లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్‌ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్‌కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్‌లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్‌కు టాప్ 20 ప్రోగ్రామ్స్‌లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు. కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్‌గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్‌లో అసలు పాయింట్‌కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్‌గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ గా మారిపోయింది. సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్‌ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్‌కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు. ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్‌కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్‌కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్‌ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు. ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్‌లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు. ఆన్ ఎయిర్ 250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్‌కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్‌లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్‌కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు. 2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్‌ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి. కరోడ్‌పతి వర్సెస్ సినిమా మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది. ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్‌పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్‌పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్‌పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ. కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్‌లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు. హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్‌లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్‌కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్‌గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్‌తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది. డింగు టకా.. గొళ్లెం పెట్టు తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది. ‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్‌లో బ్రహ్మానందం హోస్ట్‌గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్‌పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. దగ్గుతో మోసం అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా ఉన్న చాల్స్ ఇన్‌గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్‌గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది. డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్‌ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్‌గ్రామ్‌ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం. బైటికిరాని ఆ ఫుటేజ్‌లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు. ఈ భాషల్లోనూ.. ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్‌గా భోజ్‌పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్‌గా ప్రసారమవుతోంది. మూలం.. బ్రిటన్‌లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు. -తోట భావనారాయణ -
త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్లు!
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సరసన జూనియర్ ఎన్టీఆర్ చేరబోతున్నారు. అయితే ఇది సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం కాదు. బుల్లితెర మీద హోస్ట్‌గా అలరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ షో బ్లాక్‌బస్టర్ అయింది. తాజాగా మరో షోలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అదే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం అయిదో సీజన్ త్వరలో రానుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొదటి మూడు నాగార్జున హోస్ట్ చేయగా నాలుగో సీజన్‌కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అయితే ఈసారి షోకు జూనియర్ హోస్ట్ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక నాలుగు సీజన్లు స్టార్ మాలో ప్రసారం కాగా.. కొత్త సీజన్ మాత్రం జెమిని ఛానల్లో టెలికాస్ట్ కానుంది. కాగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను కాస్తా కొత్తగా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అని పేరు మార్చి తీసుకొస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఏప్రిల్ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఇందుకు ఇప్పటి నుంచే కార్యక్రమానికి కావాల్సిన పబ్లిసిటిని తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో షో ప్రోమోను రూపొందించే పనిలో యూనిట్ బిజీగా ఉంది. ఈ మేరకు గురువారం జూనియర్ ఎన్టీఆర్‌తో షోకు సంబంధించిన ఓ యాడ్‌ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. దీనిని టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో షూట్ చేస్తున్నారు. స్టార్ సంస్థ ఇచ్చిన ఐడియాను కన్సెప్ట్గా మార్చి తన స్టయిల్లో త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరిగిన ఈ ప్రోమోను మార్చి మొదట్లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ప్రోమో, షోకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా చిరు, నాగ్ ఇద్దరూ హోస్టింగ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు అలాంటి ఓ సరికొత్త రియాలిటీ షోకి ఆయనే హోస్టింగ్ చెయ్యబోతుండడం విశేషం.. ఎమ్ఈకే కోసం ఎన్టీఆర్ మొత్తం 60 ఎపిసోడ్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు తమ హీరోను బుల్లితెరపై కనులారా చూసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదవండి: ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్: జూనియర్ ఎన్టీఆర్ మోసగాళ్లు ట్రైలర్.. ఇంత డబ్బు ఎక్కడ దాచిపెట్టాలి! -
‘ఈ కేసును వాదించి సన్నాసినయ్యా’
కమెడియన్‌గా ఫుల్‌ఫాంలో ఉన్న పృథ్వీ రాజ్ అడపాదడపా లీడ్ రోల్స్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన పృథ్వీ త్వరలో మరో సినిమాతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మై డియర్ మార్తండం సినిమాలో లాయర్‌గా అలరించనున్నాడు. హరీష్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను సయ్యద్ నిజాముద్ధీన్ నిర్మిస్తున్నారు. -
మై డియర్ మార్తండం టీజర్
-
ఆటోలో మెగాస్టార్!
⇒ మీలో ఎవరు కోటీశ్వరుడులో సత్తాచాటిన ఆటోడ్రైవర్ ⇒ కానిస్టేబుల్‌గానూ ఎంపిక ⇒ రూ.3.60లక్షలు సొంతం చేసుకున్న మేడ్చల్ యువకుడు మేడ్చల్: మెున్నటివరకు అతనొక సాధారణ యువకుడు. రెక్కాడితే గానీ డొక్కాడని. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా చదువు ఆగిపోవడంతో తండ్రిలాగే ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. అయితే తాను ఆందరిలా జీవించకూడదని ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు.అందుకు తగినట్లుగా కృషి చేశాడు. ఓ వైపు ఆటో నడుపుతూనే ఇంటర్మీడియట్ పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం కోసం సాధన చేశాడు కొంత కాలం ఇంటికి దూరంగా నగరంలో ఉంటూ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అతడికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రూపంలో జాక్‌ఫాట్ తగిలింది. ఈ కార్యక్రమం నాల్గవ సెషన్లో పాల్గొన్న సతీష్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకున్నాడు. అతడే ఆధారం మేడ్చల్ మండలం పూడూర్ గ్రావూనికి చెందిన తాళ్ళపల్లి సత్యనారాయణ, శారద దంపతులకు కుమారుడు సతీష్‌గౌడ్(26), కుమార్తె సౌజన్య ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ చిన్నతనం నుంచే బతుకుపోరాటంలో రాటుదేలాడు. పేపర్ బాయ్‌గా, చిట్ ఫండ్స్‌లో కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తూ 10వ తరగతి పూర్తి చేశాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాడు. నగరంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పొషిస్తూనే ఇంటర్ పూర్తి చేశాడు. అంతలో చెల్లెలు సౌజన్య పెళ్లి చేయడం, అనారోగ్యంతో తండ్రి మరణంతో కుటుంబ భారం అతడిపైనే పడింది. కలిసొచ్చిన కోటీశ్వరుడు.... పోలీస్ ఉద్యోగం సాధించాలనే తపనతో కఠోర శ్రమ చేసి అన్ని పరీక్షల్లో అర్హత సాధించి శిక్షణ కోసం ఎదురు చూస్తున్న సతీష్‌కు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా అదృష్టం తలుపుతట్టింది. చిరంజీవి నేతృత్వంలో ప్రారంభంకానున్న నాలుగో సెషన్లో పాల్గొనేందుకు ఎస్ఎంఎస్ ద్వారా వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం పంపాడు. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆడిషన్స్‌లో మంచి మార్కులతో అర్హత సాధించాడు. కార్యక్రమంలో ఇద్దరి తర్వాత హాట్ సీట్‌కు చేరుకున్నాడు. రూ.3.60లక్షలు సొంతం హాట్ సీట్‌కు చేరుకున్న సతీష్ పలు ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పి రూ.1.60 లక్షలు గెలుచుకున్నాడు. పేద కుటుంబానికి చెందిన సతీష్‌ను ప్రొత్సహించేందుకు గాను చిరంజీవి స్వయంగా రూ.2 లక్షలు అందజేశారు. సతీష్ ఆటోలో ఆటో జానీ హాట్ సీట్‌కు చేరుకున్న సతీష్ చిరంజీవిని తమ ఆటోలో ఎక్కాలని కోరడంతో అందుకు అంగీకరించిన మెగాస్టార్ తాను కూడా ఆటో ఎక్కి చాలా రోజులైందని చెబుతూ సతీష్ ఆటో ఎక్కాడు. మెగాస్టార్ చిరంజీవి తన ఆటోలో ఎక్కడం సంతోషంగా ఉందని సతీష్ పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అతను చిరంజీవికి ఆటో డ్రైవర్ యూనిఫామ్( చొక్కా)ను బహుమతిగా అందజేశారు. ఆనందంగా ఉంది : సతీష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న నాకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. చిరంజీవి నా ఆటోలో ఎక్కడం ఎప్పటికి మరిచిపోలేను. కార్యక్రమం ద్వారా గెలుచుకున్న డబ్బుతో అప్పులు తీరుస్తా శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించడం ఆనందంగా ఉంది. పోలీస్ ఉద్యోగం చేతపట్టి కుటుంబాన్ని మరింత బాగా చూసుకుంటా. -
నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి!
‘‘సుమారు పదేళ్లు చిత్ర పరిశ్రమకీ, వినోదానికీ దూరంగా ఉన్న మాట వాస్తవమే. రీ–ఎంట్రీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? గతంలో చూపిన ప్రేమాభిమానాలు చూపిస్తారా? అనే మీమాంస నాలో ఉండేది. ‘ఖైదీ నంబర్ 150’ విజయంతో నా అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘స్టార్‌మా’ కొత్త లోగోను ఆవిష్కరించారాయన. ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని అలరించిన ‘మాటీవీ’ ఇక నుండి ‘స్టార్‌మా’గా అలరించనుంది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ఛానల్ లోగో మారనుంది. ఈ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గతంలో సినిమా ఒక్కటే ప్రేక్షకులకు వినోదం. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లూ సినిమాలకు సమాంతరంగా వినోదం అందిస్తున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ వచ్చింది. ఈ షో మరో లెవల్‌కి వెళ్లడానికి నా ఇమేజ్ దోహదపడుతుంది. అలాగే ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతో పాటు విభిన్న వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది’’ అన్నారు. ఈ షోలో సినీ ప్రముఖులు ఎవరైనా పాల్గొంటున్నారా? అని చిరంజీవిని అడగ్గా... ‘‘నాగార్జున, వెంకటేశ్‌లు వస్తున్నారు. ఈరోజు నాగార్జున ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా రాధికా శరత్‌కుమార్, సుమలత వస్తారు’’ అని చెప్పారు. మరి, షోకి బాలకృష్ణను కూడా ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా... ‘‘తప్పకుండా! నా స్నేహితుడు వస్తే సంతోషమే కదా. నిర్వాహకులకు బాలయ్యను ఆహ్వానించమని చెబుతా’’ అన్నారు చిరంజీవి. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో స్టార్ ఇండియా సౌత్ సీఈఓ కెవిన్ వాజ్, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి నుంచే బుల్లితెరపై మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 సినిమాతో రికార్డ్ వేట కొనసాగిస్తున్న చిరు ఇప్పుడు బుల్లితెర మీద దృష్టి పెట్టాడు. తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాధరణ కలిగిన షోగా పేరు తెచ్చుకున్న మీలో ఎవరు కోటీశ్వరుడుకు మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గతంలో నాగర్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించగా రికార్డ్ టీఆర్పీలను సాధించింది. ఇప్పుడు చిరంజీవి ప్రశ్నలు సందించడానికి రెడీ అవుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే సీరీస్ ఎన్ని రోజులు కొనసాగుతుందన్న విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. -
'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ రివ్యూ
టైటిల్ : మీలో ఎవరు కోటీశ్వరుడు జానర్ : సెటైరికల్ కామెడీ తారాగణం : పృథ్వీ, సలోని, నవీన్ చంద్ర, శృతిసోథి, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, రఘుబాబు సంగీతం : డిజె వసంత్ దర్శకత్వం : ఇ. సత్తిబాబు నిర్మాత : కె కె రాధామోహన్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇ సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సెటైరికల్ కామెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు. తొలిసారిగా కామెడీ స్టార్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? కథ : ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్‌గా తాగేసి.. కారును డివైడర్‌కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్‌తో ప్రేమలో పడుతుంది ప్రియా. ముందు కాస్త బెట్టు చేసినా ఫైనల్‌గా ప్రశాంత్ కూడా ప్రేమలో పడతాడు. తమ ప్రేమకు ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా.., మల్టీ మిలియనీర్ అయిన ప్రియా త్రండి మాత్రం ఏబీఆర్(మురళీ శర్మ) అంగీకరించడు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్‌ని అవమానిస్తాడు. ప్రశాంత్ మాత్రం డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్‌లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు. తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు. జీవితంలో ఒక్క హిట్ కూడా ఇవ్వని దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) డైరెక్టర్‌గా, 30 ఏళ్లుగా జూనియర్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయిన వీరబాబు( పృథ్వీ) హీరోగా సలోని హీరోయిన్గా తమలపాకు పేరుతో సినిమా ప్లాన్ చేస్తాడు. చివరకు రోల్డ్ గోల్డ్ రమేష్ తెరకెక్కించిన తమలపాకు సినిమా రిలీజ్ అయ్యిందా..? అనుకున్నట్టుగా ఏబీఆర్ నష్టపోయాడా..? ప్రశాంత్, ప్రియా ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రెండు విభిన్న కథలను ఓకె కథలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇ సత్తిబాబు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండు కథలను కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది. ఇప్పటికే తనకు కామెడీ సినిమాలు తెరకెక్కించటంలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న సత్తిబాబు, ఈ సినిమాతో పేరడీ కామెడీని కూడా బాగానే డీల్ చేశాడు. సినీ రంగం మీదే సెటైరికల్‌గా తెరకెక్కించిన కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. డిసె వసంత్ సంగీతం బాగుంది. ఎక్కువగా పాత సినిమా పాటలనే వాడుకున్నా.. నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ పృథ్వీ క్యారెక్టర్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఓవరాల్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. కడుపుబ్బా నవ్వించే సెటైరికల్ కామెడీ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఆ రోజులు గుర్తొచ్చాయి!
‘‘అందరూ ఈ సినిమాలో నేను హీరో అనుకుంటున్నారు. కానీ, నేను హీరో కాదు. కీలక పాత్ర చేశానంతే’’ అన్నారు పృథ్వి. నవీన్ చంద్ర, శ్రుతీ సోధీ జంటగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన సినిమా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ 16న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి పృథ్వి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో సలోని నాకు జోడీగా నటించారు. మా మధ్య ఓ పాట తప్ప ప్రత్యేకంగా కెమిస్ట్రీ ఏం లేదు. కానీ, మా కామెడీ కొత్తగా ఉంటుంది. పాటలో గణేశ్ మాస్టర్ మంచి స్టెప్పులు వేయించారు. సత్తిబాబు దర్శకత్వంలో నటిస్తుంటే ఈవీవీగారితో పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి. నిర్మాత రాధామోహన్‌గారు మంచి ఉద్దేశంతో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. మా సొంతూరు తాడేపల్లిగూడెంలో మా వీధి అంతా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నా వాల్‌పోస్టర్లే. ఈ స్థాయికి చేరుకోవడం హ్యాపీ. కానీ, దీని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఇండస్ట్రీలో ఎవరూ శాశ్వతం కాదు. ఇప్పుడు ‘కాటమరాయుడు’, ‘మిస్టర్’, ‘విన్నర్’, ‘ద్వారక’, ‘వైశాఖం’ సినిమాల్లో నటిస్తున్నా’’ అన్నారు. -
మహేశ్‌తో సినిమా నా డ్రీమ్!
‘‘మహేశ్‌బాబుతో సినిమా నా డ్రీమ్. ఆయన ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. అయితే.. అందుకు సరైన దర్శకుడు, కథ కుదరాలి’’ అన్నారు నిర్మాత కేకే రాధామోహన్. పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెల 25న విడుదలవుతోంది. రాధామోహన్ మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే ప్రేమకథా చిత్రమిది. నవీన్‌చంద్ర, పృథ్వీ పాత్రలు నువ్వా! నేనా! అన్నట్టుంటాయి. ‘బెంగాల్ టైగర్’ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ఈ సినిమా నిర్మించడానికి కథే కారణం. దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. అతిథి పాత్రలో నటించి, నేను నిర్మించిన సినిమాలు హిట్ కాలేదు. నటించనవి హిట్టయ్యాయి. అందుకే, ఇందులో నటించలేదు’’ అన్నారు. -
మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి అదే సమయంలో బుల్లి తెర మీద కూడా అడుగెపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు ఘనవిజయం సాధించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు చిరు. గత మూడు సీజన్లలో నాగార్జున హోస్ట్ చేయగా నాలుగో సీజన్ ను చిరు నిర్వహిస్తున్నారు. దీంతో మరోసారి ఈ షోకు భారీ క్రేజ్ ఏర్పడింది. క్రేజ్ కు తగ్గట్టుగానే మెగాస్టార్ భారీ మొత్తాన్ని చార్జ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి ప్రకటనా లేకపోయినా మీడియా సర్కిల్స్ లో మాత్రం మెగాస్టార్ రెమ్యూనరేషన్ కు సంబందించి భారీ ప్రచారం జరుగుతోంది. ఈ షో కోసం గంటన్నర పాటు ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్ కు పది లక్షల రూపాయిలను రెమ్యూనరేషన్ గా అందుకోనున్నాడట. డిసెంబర్ 2నుంచి ప్రసారం కానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. -
మీలో ఎవరు కోటీశ్వరుడు మెగా ప్రోమో
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న చిరు, అదే సమయంలో బుల్లితెర అరంగేట్రానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్‌కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. గత మూడు సీజన్లలో వ్యాఖ్యతగా స్టార్ హీరో నాగార్జున వ్యవహరించగా రాబోయే సీజన్లో మాత్రం ఆ బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నాడు. త్వరలో మా టివీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబందించి ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎక్కడ పూర్తిగా చిరు లుక్స్ రివీల్ చేయకుండా రూపొందించిన ఈ ప్రోమో మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. హీరోగా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న చిరు బుల్లితెర మీద ఏమేరకు అలరిస్తాడో చూడాలి. -
కోటీశ్వరుడు ఎవరు?
నవీన్‌చంద్ర హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాత. శ్రుతీ సోధి కథానాయిక. కేకే రాధామోహన్ మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్లో వస్తోన్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఓ పాటను ఈ నెలలో అరకులో చిత్రీకరించనున్నాం’’అని తెలిపారు. ‘‘గతంలో నా దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలు ఉంటాయి’’ అని సత్తిబాబు తెలిపారు. పృధ్వీ, సలోని, జయప్రకాష్ రెడ్డి, పోసాని, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: బాల్‌రెడ్డి పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎంఎస్. కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్. -
'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ స్టిల్స్
-
అందాల రాక్షసి హీరోతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'
యంగ్ హీరో నవీన్ చంద్రతో మీలో ఎవరు కోటీశ్వరుడు రూపొందిస్తున్నారు. అదేంటి.. ఈ మధ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు, చిరంజీవి హోస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి.. ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా..? అదేం లేందడి. నవీన్ చంద్రతో రూపొందించేది. టీవీ షో కాదు. ప్రస్తుతం ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమాలో విలన్‌గా నటిస్తున్న నవీన్ చంద్ర, ఆ సినిమా తరువాత సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సలోని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కమెడియన్ పృథ్వి కీలక పాత్రలో నటించనున్నాడు. -
బుల్లి తెరపై మెగాస్టార్..?
పదేళ్ల పాటు తెరకు దూరమైన మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150 సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు చిరు. అదే సమయంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా భారీగా ఫ్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించిన మెగాస్టార్ ఇప్పుడు మరో రంగంలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడట. తెలుగు బుల్లితెర టిఆర్పిలలో సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించేందుకు మెగాస్టార్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఉత్తరాదిలో ఘనవిజయం సాధించిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో తెలుగులోను రూపొందిచారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి ఇన్నాళ్లు కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న నాలుగో సీజన్లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా అలరించనున్నాడట. ఈ విషయంపై మెగా క్యాంప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. -
మీలో ఎవరు కోటీ శ్వరుడులో 'సీఐ'
చేవెళ్ల: చేవెళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జే.ఉపేందర్ మాటీవీ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే క్విజ్ కాంపిటేషన్‌లో క్వాలిఫై అయి రూ.6లక్షల 45 వేల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. దీంతో జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి సీఐ ఉపేందర్ని శుక్రవారం వికారాబాద్‌లో జరిగిన సమావేశంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ నుంచి ఎవరు పాల్గొనలేదని, ఆ పనిచేసి ఉపేందర్ చరిత్ర సృష్టించారని ఆ కార్యక్రమాన్ని టీవీలో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. -
అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
తొలి సీజన్ ముగిసినప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఇక నుంచి సాయంత్రాలు ఎలా గడపాలనే సందిగ్ధత నెలకొందని వ్యాఖ్యానించిన ప్రేక్షకులూ ఉన్నారు. మరి ఆ లోటును తీర్చడానికే అన్నట్టుగా మొదలైంది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు- సెకండ్ ఎడిషన్’. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ రియాలిటీ షో రెండో దశలో కూడా అంతే జోష్‌తో నడుస్తోంది. సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్న ఈ షోకి సెలబ్రిటీల తాకిడి కూడా ఉండటంతో మంచి వీక్షకాదరణ దక్కుతోంది. నాగార్జున తనదైన శైలిలో హోస్ట్‌పాత్రను పోషిస్తూ అనేకమందిని ఈ కార్యక్రమానికి అభిమానులుగా మార్చేస్తున్నారు. రెండో ఎడిషన్‌లో కూడా స్టార్ల ఎంట్రీకేమీ లోటు లేదు. నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, సమంత వంటి సెలబ్రిటీలతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రెండో ఎడిషన్ కలర్ఫుల్గా కనిపిస్తోంది. -
మళ్లీ సమ్మోహనం
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి సమ్మోహన పరిచేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ‘మా’ టీవీ చరిత్రలోనే అద్భుతమైన రేటింగ్స్ సాధించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సిరీస్ ఈ సోమవారం నుంచే మొదలు కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ వారానికి అయిదు రోజులు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మా టీవీ చైర్మన్ ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ -‘‘నమ్మలేని విధంగా జీవితాన్ని మార్చేసే షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. విజ్ఞానాన్ని అందించడం ద్వారా సామాజికంగా మంచి మార్పుని తీసుకొచ్చే సమర్థత ‘మా’ టీవీకి ఉందనడానికి నిదర్శనం లాంటి షో ఇది’’ అని చెప్పారు. -
కోటీశ్వరుడు మళ్లీ రెడీ!
తెలుగు టీవీ చరిత్రలో సరికొత్త సంచలనాలకు వేదికగా నిలిచిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో రెండో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ‘మా’ టీవీలో తొలి సీజన్ విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా వ్యవహరించిన కథానాయకుడు నాగార్జున మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సన్నద్ధమవుతున్నారు. ‘‘ఈ షోలో పాల్గొనడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు (అక్టోబర్ 9) రాత్రి 7 గంటలకు ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ఎంపికైన వారు హాట్ సీట్‌కు చేరుకోవడంతో పాటు, కోటి రూపాయల నగదు గెలుచుకునే సువర్ణావకాశాన్ని పొందుతారు. తొలి సీజన్ బుల్లితెరపై ఎన్నో రికార్డులు నమోదు చేసింది. విజ్ఞానాన్ని పెంపొందించే ఈ కార్యక్రమం ద్వారా హృదయాన్ని కలచివేసే ఎన్నో జీవితగాథలు వెలుగులోకొచ్చి ఎందరికో స్ఫూర్తినిస్తోంది’’ అని ‘మా’ టీవీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు http://mek.maatv.com లో చూడవచ్చు. -
మీలో ఎవరు కోటీశ్వరుడు.. బై మహేష్ బాబు!!
'మీలోఎవరు కోటీశ్వరుడు'... తెలుగు టెలివిజన్ పరిశ్రమలోనే అత్యంత ప్రేక్షకాదరణ సాధించిన షో. మొదటి విడతలో ఏ ఒక్కరినీ కోటీశ్వరులను మాత్రం చేయలేకపోయిన ఈ షోను నాగార్జునకు బదులు మహేష్ బాబు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇది ఇప్పటకే జరిగింది కూడా. అయితే ఇది నిజంగా మాత్రం కాదండోయ్.. ఆగడు సినిమాలోనట. వేడి వేడి తాజా కబుర్లన్నింటినీ తన సినిమా చూసే ప్రేక్షకులు సరదాగా నవ్వుకోడానికి అద్భుతంగా పండించే అలవాటున్న దర్శకుడు శ్రీను వైట్ల ఆగడు చిత్రంలో ఈ ప్రయోగం చేశాడని సమాచారం. ఇంతకుముందు దూకుడులో కూడా ఇలాంటి ప్రయోగాలే చేసి సక్సెస్ అయ్యాడు. నాగార్జునకు బదులు మహేష్ బాబు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' లాంటి షో నిర్వహిస్తాడని, అది కూడా ఏదో సరదా సన్నివేశంలా కాకుండా.. సినిమాకు చాలా ఉపయోగపడే అత్యంత కీలక సన్నివేశంలోనని సినిమా వర్గలు చెబుతున్నాయి. 'దూకుడు' సినిమాలో నాగార్జున నిర్వహించే రియాల్టీ షో కోసం పెన్ను కెమెరాను చూస్తూ బ్రహ్మానందం చెప్పే డైలాగును ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక 'ఆగడు'లో ఈ కోటీశ్వరుడు షో ఇంకెంత సందడి చేస్తుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అది తెలియాలంటే మాత్రం మరొక్క 15 రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే, ఆగడు చిత్రం సెప్టెంబర్ 19వ తేదీన విడుదల అవుతుందని స్వయంగా మహేష్ బాబే ఆ చిత్ర ఆడియో రిలీజ్ సందర్భంగా వేదికపై ప్రకటించారు. -
ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెబుతారా?
ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొంత బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కథా చర్చలతోపాటు, ఇతర అంశాలపై దృష్టిపెట్టిన చిరంజీవి తన అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. అయితే వెండితెర మీద కంటే ముందుగా అక్కినేని నాగార్జున ప్రారంభించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి పచ్చ జెండా ఊపారు. ఇప్పటికే ఎందరో నటీనటులను కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా నాగార్జున అభిమానులకు దగ్గరకు చేర్చిన సంగతి తెలిసిందే. కోటీశ్వరుడు కార్యక్రమం 40 ఎపిసోడ్ లో పాల్గొనేందుకు మెగాస్టార్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. చిరంజీవితో 'కోటీశ్వరుడు' కార్యక్రమం గురువారం ఆగస్టు 7 తేదిన రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కార్యక్రమం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. కోటీశ్వరుడు కార్యక్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలకు చిరంజీవి ఎలా సమాధానాలిస్తారోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ప్రశ్నలు, చిరంజీవి సమాధానాలు అభిమానుల్లో ఏ రేంజ్ లో సంతోషాన్ని నింపుతాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే అనేది కొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది. -
కోటీశ్వరుడు’కు అతిథిగా చిరంజీవి
బుల్లితెర వీక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న షో - ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ నాగార్జున తొలిసారిగా టీవీ రంగానికి వచ్చి, ఈ పాపులర్ ఫార్మట్ షోకు అతిథేయిగా వ్యవహరించడం జూన్ 9న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కొత్త అందం తెచ్చింది. విపరీతంగా వీక్షకాదరణ సాధించి, టి.ఆర్.పి.లు తెచ్చుకున్న ఈ కార్యక్రమం తొలి సీజన్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. గురువారం రాత్రి 9 గంటలకు ‘మా’ టి.వి.లో ప్రసారం కానున్న 40వ ఎపిసోడ్‌తో ప్రస్తుతానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వీక్షకులకు టాటా... వీడుకోలు చెప్పనుంది. ఈ చివరి భాగానికి చిరంజీవి విశిష్ట అతిథిగా రావడం విశేషం. సామాజిక మార్పు తేవాలన్న దృక్పథంతో చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ‘మా’ టీవీ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ఎంతోమంది సామాన్యుల కలల్ని ప్రతిఫలిస్తూ, జీవితాలను మార్చేందుకు తోడ్పడిన ఈ షోలో పాల్గొనేందుకు దాదాపు 11 లక్షల మంది దాకా ఆసక్తి చూపించారు. బిగ్ సినర్జీ సంస్థ ఈ 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఏమైనా, నాగార్జున, చిరంజీవి కలసి కనిపించే రేపటి ఎపిసోడ్ వీక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేయడం ఖాయం. అని వేరే చెప్పాలా? -
7న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గ్రాండ్ ఫైనల్
చెన్నై: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా అత్యంత ప్రజాదరణ పొందిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ షోకు త్వరలో ఫుల్స్టాప్ పడనుంది. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫైనల్ ఈ నెల 7న ప్రసారం కానుంది. ఇది 40వ ఎపిసోడ్. అంతటితో ఈ కార్యక్రమం ముగియనుంది. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా అమితాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోర్‌పతి' టీవీ షోకు తెలుగులో వర్సెన్లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం రూపొందించారు. బుల్లితెరపై నాగ్ ఆకట్టుకున్నారు. అభిమానుల నుంచి ఈ షోకు మంచి స్పందన వచ్చింది. ఈ షో తనకు ఎంతో నచ్చిందని, ఓ మధురానుభూతిగా నిలిచిపోతుందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ షో లక్షలాదిమంది హృదయాలను గెలుచుకుందని, వ్యాఖ్యాతగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని చెప్పారు. పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు. -
కుర్రవాడిలా తయారైన చిరంజీవి!
మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మళ్లీ కుర్రాడిలా తయారయ్యారు. తనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన సినిమా రంగం నుంచి రాజకీయ రంగానికి వెళ్లిన తరువాతీ ఆయన కాస్త లావయ్యారు. కొంచం పెద్దవాడిలా కనిపించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన - ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం - రాజ్యసభకు వెళ్లడం - కేంద్ర మంత్రి పదవి - చివరకు సార్వత్రిక ఎన్నికలు ...వీటన్నిటితో నిన్నమొన్నటి వరకు చిరంజీవి బిజీబిజీగా గడిపారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయనకు రిలీఫ్ దొరికింది. రాజకీయ ఒత్తిడి తగ్గింది. ఈ నేపధ్యంలో చిరంజీవి కాస్త సన్నబడ్డారు. క్రాఫ్ స్టైల్ మార్చారు. మళ్లీ యువకుడిలా మారిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఆయన ఇలా ఎందుకు మారిపోయారో, ఎందుకు కనిపిస్తున్నారో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. చిరు సిల్వర్ స్క్రీన్కు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తోంది. రాజకీయ రంగంలో కాస్త వెసులుబాటు దొరకడంతో ఆయన చూపు మళ్లీ రంగుల రంగంవైపు మళ్లింది. ఇప్పుడు తన సినీ జీవితంలో ప్రాముఖ్యత కలిగిన, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే సినిమాలో నటించడానికి అన్ని రకాలుగా సంసిద్ధులవుతున్నారు. తన 150వ చిత్రంలో నటించడానికి ఉవ్వీళ్లూరుతున్నారు. అందుకే ఆయనలో మళ్లీ ఈ యవ్వనపు చాయలు తొంగి చూస్తున్నాయి. మనసు హుషారెక్కుతోంది. ఇంత కాలం విరామం తరువాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే ముందు చిరంజీవి రేపు బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు. చిరునవ్వులు చిందించే ఆ చిరుని, ఆయన బాడీలో, స్టైల్లో వచ్చిన మార్పులను రేపు ప్రసారమయ్యే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో హీరో నాగార్జునతోపాటు రేపు మాటీవిలో చూడవచ్చు. ఇక చిరు 150వ సినిమా విశేషాలు ఆయన పుట్టిన రోజు ఈ నెల 22న వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున ఆ చిత్రం గురించి అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం కోసం అనేక కథలను విన్నారు. చర్చించారు. చిరంజీవి పుట్టిన నాటికి ఈ సినిమా స్క్రిప్టు సిద్ధమవుతుందని ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తొలుత గీతా ఆర్ట్ బ్యానర్‌పైనే నిర్మించే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి చిరు తనయుడు, యువహీరో రామచరణ్ తేజ నిర్మాత. అంతే కాకుండా ఆ చిత్రంలో ఆయన కూడా నటిస్తారు. తన తండ్రితో కలసి నటించాలని చెర్రీ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. తాను ఆ మూవీలో నటించబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక ఆ సినిమా కోసం చిరు అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. -
హాట్ సీటు మీద మెగాస్టార్ డౌటే..
సిల్వర్ స్క్రీన్ కు మెగాస్టార్ చిరంజీవి దూరమై సుమారు 7 సంవత్సరాలు కావోస్తోంది. 150వ చిత్రంపై ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు. అయితే బుల్లితెరపై ఓ ఎపిసోడ్ లో మెగాస్టార్ కనిపిస్తున్నారనే వార్త అభిమానులకు కొంత ఊరట కలిగించింది. అయితే బుల్లితెరకు కూడా మెగాస్టార్ దూరమవుతున్నారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళితే...తెలుగు టెలివిజన్ రేటింగ్ చరిత్రలో సంచలనాలు క్రియేట్ చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని నాగార్జున ప్రజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత చిరంజీవి జన్మదినం ఆగస్టు 22 తేదిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కనిపించనున్నరంటూ వార్తలు వెలువడ్డాయి. కాని అదే సమయానికి సోని టెలివిజన్ లో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎనిమిదో ఎడిషన్ ఆగస్టు 11వ తేది నుంచి ప్రారంభకానుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాంతీయ భాషల్లో, ప్రాంతీయ చానెళ్లలో ప్రసారం కాకూడదనే నిబంధన ఉంది. దాంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 11 తేది నుంచి తాత్కాలికంగా ఆపివేయాల్సి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బుల్లితెరపై మెగాస్టార్ కనిపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగాస్టార్ ను ఎలాగైనా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గోనేలా ఆగస్టు 3 తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
హాట్ సీటుపై చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు. యాక్టర్ నుంచి పొలిటిషియన్‌గా మారిన త్వరలో చిరంజీవి హాట్ సీటుపై కూర్చోనున్నారు. సూపర్ స్టార్ నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్‌పతి కి తెలుగు వెర్షన్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు. ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 3వ తేదీన ప్రసారం కానుంది. ఇటీవలి ఆ షో చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక తమ అభిమాన హీరోలు ఇద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయటం నాగ్, చిరుల అభిమానులకు పండుగే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి విద్యాబాలన్, శ్రేయ, లక్ష్మి మంచు, అల్లరి నరేష్, యాంకర్స్ ఝాన్సీ, సుమ తదితరులు గెస్ట్లుగా విచ్చేశారు. ఇక చిరంజీవి ప్రస్తుతం తన 150 సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలు వెల్లడించనున్నట్లు సమాచారం. -
కోటీశ్వరుడి విజయ విహారం
‘‘మీ అభిమాన హీరో ఎవరు?’’.... అని నాగార్జున అడగ్గానే... ‘ఇంకెవరూ మీరే..’ అని టకీమని చెప్పారు విద్యాబాలన్. నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోలో విద్యాబాలన్ అతిథిగా పాల్గొన్న విషయం ఈ షో వీక్షించినవారికి తెలిసే ఉంటుంది. తనదైన శైలిలో నాగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరుకి ప్రశంసలు లభిస్తున్నాయి. అడపా దడపా సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనడం అదనపు ఆకర్షణ అవుతోంది. గత నెల 9న ప్రారంభమైన ఈ షో తెలుగు చానల్స్ అన్నిటిలోనూ అత్యధిక రేటింగ్ సాధించి, నంబర్ వన్ షోగా నిలిచిందని ‘మా’ టీవీ ప్రతినిధి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ను కూడా కలుపుకుని 1.22 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. గత వారం తెలుగు బుల్లి తెరపై ఐదు టాప్ ప్రోగ్రామ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఉందని తెలిపారు. -
అది నాకు ఓ పెద్ద సవాల్: నాగార్జున
చెన్నై: మాటీవీ నిర్వహించే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించడం తనకు ఓ పెద్ద సవాల్ అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. కౌన్నేగా కరోర్‌పతి తరహాలో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమం మాటీవిలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో యాంకర్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున శైలికి మంచి స్పందన వస్తోంది. తన ఈ తొలి టివిషోకు వచ్చే ప్రజాస్పందనతో తాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు నాగార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గేమ్‌లో పాల్గొనేవారికి ఓ మంచి స్నేహితుడిగా ఉత్కంఠమైన క్షణాలు, తీసిజ్ఞాపకాలతోపాటు సాధ్యమైనంత డబ్బు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక యాంకర్‌గా వారిలో ఉత్కంఠను తొలగించడం తనకు ఓ సవాల్ అన్నారు. ఈ షోని ఎక్కువ మంది చూడటం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తను నటించిన 'బాబీ జాసూస్' చిత్రం ప్రమోటింగ్‌లో బిజీగా ఉండి కూడా ఇటీవల ఈ షోలో పాల్గొన్నారు. విద్యాబాలన్ పాల్గొన్న ఎపిసోడ్ రేపు సోమవారం ప్రసారం కానుంది. -
ఇన్ని సమస్యలుంటాయా అనిపిస్తోంది : నాగార్జున
స్టార్ హోదా నుంచి టీవీ షోలలో స్టార్ లాంటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు హోస్ట్‌గా కొత్త వేషంలోకి హీరో నాగార్జున సులభంగానే పరకాయ ప్రవేశం చేశారు. ఈ నెల ప్రథమార్ధం నుంచి ‘మా’ టి.వి.లో ప్రసారమవుతున్న ఈ గేమ్ షో తొలివారంలో మంచి టి.ఆర్.పి.లు సాధించింది. సామాన్యులు సైతం సంపన్నులయ్యేందుకు అవకాశమిచ్చే ఈ షో గురించి నాగ్ తో జరిపిన సంభాషణ. బుల్లితెరపై మీ తొలి షో ఇది. ఎలా ఉంది మీ అనుభవం? సినిమా ప్రపంచానికి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఈ షో నాకు పరిచయం చేసింది. నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఈ షో ఉపకరించింది. స్టార్‌డమ్‌కి అతీతమైనది ఇది. ‘అన్నమయ్య’, ‘మనం’ చిత్రాల ఘనవిజయం ఎంత ఆత్మసంతృప్తినిచ్చిందో, ఈ ‘షో’ విజయం కూడా అంతే ఆత్మసంతృప్తినిచ్చింది. ఈ షో ద్వారా సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎలా ఉంది? వాళ్ల సొంత మనిషిలా మారిపోయి, సమస్యలను వింటున్నాను. వాళ్ల సమస్యలను నా సమస్యలతో పోల్చుకుంటున్నాను కూడా. ఒక సినిమా పరాజయం పాలైతే తెగ బాధపడిపోతుంటాం. కొంతమందైతే నెలల తరబడి బయటకు రారు. రేపెలా గడుస్తుందోనని ఈ రోజు రాత్రి కంటి మీద కునుకు లేకుండా గడిపేవారి సమస్యల ముందు సినిమా ఫ్లాప్ అనేది చిన్న సమస్య అనిపిస్తోంది. పోటీలో పాలుపంచుకునేవారి సమస్యలు విన్న తర్వాత ‘వీళ్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే బాగుంటుంది’ అనిపిస్తోందా? కొంతమంది జీవితం మొత్తం సమస్యలే. వాళ్లు ఎక్కువ డబ్బు గెల్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు, ‘సమాధానం తెలిస్తే బాగుంటుంది’ అనే టెన్షన్ నాకు మొదలవుతుంది. ఇన్నేళ్లూ కష్టాలు పడ్డారు కదా.. కనీసం ఇక్కడైనా వాళ్ల కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగని, ప్రశ్నలు ముందే లీక్ చేయలేను.. సమాధానాలు కూడా బయటపెట్టలేను. ఒక్కోసారైతే నాకు తెలియకుండా క్లూ ఇచ్చేస్తానేమో అనిపిస్తోంది. కానీ, అది చేయకుండా జాగ్రత్తపడతాను. రకరకాల వయసుల వాళ్ళను కలుసుకోవడం, వారి కష్టనష్టాలు వినడం వల్ల అందరి మనస్తత్వాలూ తెలుసుకునే వీలు కలుగుతోంది. సుబ్బలక్ష్మి గారనే పెద్ద వయసు ఆవిడైతే చాలా బాగా ఆడారు. చక్కగా జోక్‌లేసుకుంటూ సరదాగా సాగిందా ఎపిసోడ్. అందరితోనూ కనెక్ట్ కాగలుతున్నాను. ఈ షోలో పాల్గొన్న హెచ్ఐవీ పేషెంట్ భవాని జీవితం విన్నప్పుడు మీరు ఫీలైన వైనం స్పష్టంగా బుల్లితెర మీద కనిపించింది? భవానీ లైఫ్ విన్నప్పుడు నిజంగానే బాధ అనిపించింది. కానీ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రం మెచ్చుకోదగ్గవి. తను 80వేల రూపాయలు గెల్చుకోవాలనే లక్ష్యంతో వచ్చింది. 40వేలు గెల్చుకుంది. కానీ, ఇక్కణ్ణుంచి ఊరు తిరిగి వెళ్లేసరికి తన ఇంటి చుట్టుపక్కలవాళ్లు, ఇంతకొంతమంది స్వచ్ఛందంగా ‘మీ అబ్బాయిలకు ఫీజు కట్టు’ అని డబ్బులిచ్చారట. ఆ డబ్బంతా కలిపితే 20వేలయ్యాయని, భవాని ఫోన్ చేసి చెబితే, చాలా ఆనందం అనిపించింది. ఈ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత మనలో తెలియకుండా మార్పొస్తుందని అమితాబ్ మీతో అన్నారు కదా.. మరి, ఇప్పటివరకు చిత్రీకరించిన ఎపిసోడ్స్ ద్వారా మీలో ఏమైనా మార్పును గ్రహించారా? వెంటనే పూర్తిగా మార్పు రావడం జరగదు కానీ, పాల్గొంటున్నవారి మాటలు విన్నాక నా ఆలోచనా విధానంలో కొంత మార్పు వచ్చింది. ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకునే నేర్పు, అందరి సమస్యలూ వినే ఓర్పు వచ్చింది. ఎంతసేపూ మన సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ, ఈ షో ద్వారా ఇతరుల సమస్యలను తెలుసుకోవడం, ఆలోచించడం మొదలైంది. ‘ఇలా కూడా బతికేస్తున్నారా.. ఇన్ని సమస్యలుంటాయా’ అనిపిస్తోంది. పేదరికం అనుభవిస్తున్నవారి జీవితాల గురించి విన్న తరువాత అవి మిమ్మల్ని ఇంటివరకూ వెంటాడుతున్నాయా? నేను ఇంటికెళ్లేసరికి మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే, ‘ఎలా జరిగింది’ అని అడిగి తెలుసుకుంటారు. అమల ఒక్కతే ఉంటే, ఒకవేళ నేను డల్‌గా కనిపిస్తే, ‘ఇవాళ చాలా సమస్యలు విని ఉంటాను’ అని ఫిక్స్ అయిపోతుంది. తను అడిగి తెలుసుకుంటుంది. ఈ షో చేయడం ద్వారా నా కుటుంబంలోనే ఓ మార్పు కనిపిస్తోంది. నాగచైతన్యని, అఖిల్‌ని కూర్చోబెట్టి, ‘వాళ్ల నాన్న జీతం నాలుగు వేలట.. ఆ అబ్బాయి చాలా కష్టపడి చదువుకుంటున్నాడట’ అని చెబుతుంటాను. అదే నేను కావాలని వాళ్లకి ఏవేవో నీతులు చెబితే, ‘లెక్చర్ ఇస్తున్నాడు’ అనుకుంటారు. కానీ, స్వయంగా నేను విన్నవి చెప్పడంతో, వాళ్లు కూడా ‘ఇంతే సంపాదిస్తారా డాడీ... లైఫ్ ఇలా ఉంటుందా’ అంటున్నారు. సో.. ఈ షో మా కుటుంబానికి కూడా ఓ ఆదర్శమే. తల్లిదండ్రులు చెబితే పిల్లలు పెద్దగా వినరు. అదే, ఇలాంటి షోస్ చూస్తే, కొంతైనా స్ఫూర్తి పొందుతారు. మీరే కనుక ఈ పోటీలో పాల్గొంటే.. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేవారా? లేదు. చాలా ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. అది అవగాహన లేక. ఉదయం నిద్ర లేచి పేపర్ చదవడం, ఖాళీ దొరికితే టీవీలు చూడటం.. అంతవరకే. బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉండటంవల్లే చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు. ఈ షో చేయడం ద్వారా మన భారతీయ చరిత్ర గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నవి మర్చిపోతాం. అవన్నీ రీ కలక్ట్ చేసుకున్నట్లుగా ఉంది. ఫస్ట్ సీజన్ తర్వాత రెండోది కూడా కంటిన్యూ చేయాలనే ఆసక్తి ఉందా? ఇప్పటికైతే ఆ ఆసక్తి ఉంది. ఈ షో చేసే అవకాశం నాకు కాకుండా, మరో హీరోకు వచ్చి ఉంటే, కచ్చితంగా బాధపడేవాణ్ణి. ఈ ఫస్ట్ సీజన్ 45 ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత కచ్చితంగా ఏదో మిస్సయిన ఫీలింగ్ కలగక మానదు. Follow @sakshinews -
ఇంకా రెండు రోజులే!
నాగార్జున తొలిసారిగా చేస్తున్న బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. మా టీవీలో జూన్ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనే వారి ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. రోజుకో ప్రశ్న చొప్పున మా టీవీలో ఐదు రోజులుగా ప్రశ్నలు వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో రెండు ప్రశ్నలతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మే 1 రాత్రి 7 గంటల్లోపు ఈ ప్రశ్నలకు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాధానాలు పంపాలని, కోటి రూపాయలు బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని మా టీవీ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.