
మీలో ఎవరు కోటీ శ్వరుడులో 'సీఐ'
చేవెళ్ల: చేవెళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జే.ఉపేందర్ మాటీవీ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే క్విజ్ కాంపిటేషన్‌లో క్వాలిఫై అయి రూ.6లక్షల 45 వేల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. దీంతో జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి సీఐ ఉపేందర్‌ని శుక్రవారం వికారాబాద్‌లో జరిగిన సమావేశంలో అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ నుంచి ఎవరు పాల్గొనలేదని, ఆ పనిచేసి ఉపేందర్ చరిత్ర సృష్టించారని ఆ కార్యక్రమాన్ని టీవీలో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఆమె ఈ సందర్భంగా అన్నారు.