
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం స్టేషన్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్‌ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మృతుడు.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడంతో పాటు, సూసైడ్ నోట్ రాశారనే అనుమానాలు ఉండటంతో ఆయన సెల్ ఫోన్ తమకు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర పోలీస్ అధికారులతో ఎస్ఐ మూర్తి బంధువులు వాగ్వివాదానికి దిగారు. మూర్తి.. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తుండగా, ఇటీవల ఆయన విధుల నుంచి తొలగించారు. ఎస్‌ఐ సత్యనారాయణమూర్తి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కే.గంగవరం గ్రామం. ఆయనకు ఇద్దరు పిల్లలు. అకారణంగా విధుల్లోంచి తొలగించి, తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంపై ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఐ మూర్తి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండగా, ఎస్‌ఐ ఆత్మహత్య ఘటనతో పోలీసు వర్గాల్లో కలవరం రేగింది. బందోబస్తు డ్యూటీ నుంచి వచ్చి స్టేషన్‌లోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేయాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. మండల మెజిస్ట్రేట్ ముందు ఫోన్ ఓపెన్ చేయాలని బంధువుల, స్నేహితులు పట్టుబడుతున్నారు. అధికారుల ఒత్తిడి వల్లే చనిపోయాడంటూ ఎస్‌ఐ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: యువజంట పరువు హత్య.. హంతకులకు మరణశిక్ష
Comments
Please login to add a commentAdd a comment