మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? | Chiranjeevi Remuneration for MEK | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Published Sun, Oct 16 2016 11:19 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి అదే సమయంలో బుల్లి తెర మీద కూడా అడుగెపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు ఘనవిజయం సాధించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు చిరు. గత మూడు సీజన్లలో నాగార్జున హోస్ట్ చేయగా నాలుగో సీజన్ ను చిరు నిర్వహిస్తున్నారు. దీంతో మరోసారి ఈ షోకు భారీ క్రేజ్ ఏర్పడింది.

క్రేజ్ కు తగ్గట్టుగానే మెగాస్టార్ భారీ మొత్తాన్ని చార్జ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి ప్రకటనా లేకపోయినా మీడియా సర్కిల్స్ లో మాత్రం మెగాస్టార్ రెమ్యూనరేషన్ కు సంబందించి భారీ ప్రచారం జరుగుతోంది. ఈ షో కోసం గంటన్నర పాటు ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్ కు పది లక్షల రూపాయిలను రెమ్యూనరేషన్ గా అందుకోనున్నాడట. డిసెంబర్ 2నుంచి ప్రసారం కానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement