
గతేడాది 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మంచి నెగెటివ్ పాత్రలో అలరించింది. పుష్ప సెకండ్ పార్ట్‌లో కూడా తన క్యారెక్టర్ కొనసాగుతుందని, అది కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. తాజాగా 'దర్జా' మూవీతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది ఈ బ్యూటీఫుల్ యాంకర్. ఇదివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో అనసూయ యాక్టింగ్ అదరగొట్టింది. చూస్తుంటే అందులో ఫుల్ లెన్త్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Anchor Anasuya Key Role In Chiranjeevi Acharya Movie: యాంకర్ అనసూయ భరద్వాజ్ కామెడీ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్లతోపాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. గతేడాది 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మంచి నెగెటివ్ పాత్రలో అలరించింది.
పుష్ప సెకండ్ పార్ట్‌లో కూడా తన క్యారెక్టర్ కొనసాగుతుందని, అది కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. తాజాగా 'దర్జా' మూవీతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది ఈ బ్యూటీఫుల్ యాంకర్. ఇదివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో అనసూయ యాక్టింగ్ అదరగొట్టింది. చూస్తుంటే అందులో ఫుల్ లెన్త్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాకుండా అనసూయ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్, ఆచార్య మూవీస్‌లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న 'ఆచార్య' సినిమాలో కథను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్.
ఇందులో అనసూయ మేకోవర్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందట. ఈ పాత్ర కోసం అనసూయ ఏకంగా రూ. 25 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మరీ ఈ పాత్రతో అనసూయకు ఏ స్థాయిలో పేరు వస్తుందో వేచి చూడాలి.