Anchor Anasuya Reveals On Why She Is Not Part Of God Father Promotions - Sakshi
Sakshi News home page

Anchor Anasuya : 'నన్ను నమ్మండి.. అందుకే ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నా'

Published Thu, Oct 6 2022 12:35 PM | Last Updated on Thu, Oct 6 2022 3:06 PM

Anchor Anasuya Reveals On Why She Is Not Part Of God Father Promotions - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్‌ఫాదర్‌. మ‌ల‌యాళ సూపర్‌ హిట్‌ లూసిఫ‌ర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా బరిలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూళు చేస్తోంది.  పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో యాంకర్‌ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించింది.

ఈ క్రమంలోనే ఆమె నటనను ప్రశంసిస్తూ ఓ నెటిజన్‌.. గాడ్‌ఫాదర్‌ మూవీలో మీ రోల్‌ నాకెంతో నచ్చింది. ఇంత మంచి రోల్‌ చేసినప్పటికీ మీరెందుకు ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు అని ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన అనసూయ.. మీరు ఇది నమ్మాలి. ఒకే సమయంలో చాలా షూటింగుల్లో పాల్గొంటున్నాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడం కోసమే నేనెంతో కష్టపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది.

కాగా అనసూయ రియాక్షన్‌పై సోషల్‌ మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే షూటింగ్స్‌లో బిజీగా ఉందేమో అని కొందరంటే, కనీసం ఒక్క ట్వీట్‌ కూడా చేయడానికి ఆమెకు టైం లేదా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement