అందాల రాక్షసి హీరోతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' | Naveen Chandra Next movie Meelo evaru koteeswarudu | Sakshi
Sakshi News home page

అందాల రాక్షసి హీరోతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'

Published Wed, Sep 14 2016 2:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

అందాల రాక్షసి హీరోతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'

అందాల రాక్షసి హీరోతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'

యంగ్ హీరో నవీన్ చంద్రతో మీలో ఎవరు కోటీశ్వరుడు రూపొందిస్తున్నారు. అదేంటి.. ఈ మధ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు, చిరంజీవి హోస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి.. ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా..? అదేం లేందడి. నవీన్ చంద్రతో రూపొందించేది. టీవీ షో కాదు. ప్రస్తుతం ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఈ టైటిల్ను ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమాలో విలన్గా నటిస్తున్న నవీన్ చంద్ర, ఆ సినిమా తరువాత సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సలోని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కమెడియన్ పృథ్వి కీలక పాత్రలో నటించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement