
కమెడియన్‌గా ఫుల్‌ఫాంలో ఉన్న పృథ్వీ రాజ్ అడపాదడపా లీడ్ రోల్స్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన పృథ్వీ త్వరలో మరో సినిమాతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మై డియర్ మార్తండం సినిమాలో లాయర్‌గా అలరించనున్నాడు. హరీష్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను సయ్యద్ నిజాముద్ధీన్ నిర్మిస్తున్నారు.