మహేశ్‌తో సినిమా నా డ్రీమ్! | My Dream with mahesh movie says Radha Mohan | Sakshi
Sakshi News home page

మహేశ్‌తో సినిమా నా డ్రీమ్!

Published Mon, Nov 7 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

మహేశ్‌తో సినిమా నా డ్రీమ్!

మహేశ్‌తో సినిమా నా డ్రీమ్!

 ‘‘మహేశ్‌బాబుతో సినిమా నా డ్రీమ్. ఆయన ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. అయితే.. అందుకు సరైన దర్శకుడు, కథ కుదరాలి’’ అన్నారు నిర్మాత కేకే రాధామోహన్. పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెల 25న విడుదలవుతోంది. రాధామోహన్ మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే ప్రేమకథా చిత్రమిది. నవీన్‌చంద్ర, పృథ్వీ పాత్రలు నువ్వా! నేనా! అన్నట్టుంటాయి.  ‘బెంగాల్ టైగర్’ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ఈ సినిమా నిర్మించడానికి కథే కారణం. దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. అతిథి పాత్రలో నటించి, నేను నిర్మించిన సినిమాలు హిట్ కాలేదు. నటించనవి హిట్టయ్యాయి. అందుకే, ఇందులో నటించలేదు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement