Radha mohan
-
పద్మశ్రీ రాధామోహన్ ఇకలేరు
భువనేశ్వర్: పద్మశ్రీ ప్రొఫెసర్ రాధా మోహన్ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దివంగత ప్రొఫెసర్ నేపథ్యం నయాగడ్‌లో 1943వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీన జన్మించిన ఆయన అర్థశాస్త్రం ఆనర్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణులై 1965వ సంవత్సరంలో స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం నుంచి అప్లైడ్ ఎకనమిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుడిగా పని చేశారు. 2001వ సంవత్సరంలో పూరీ ఎస్సీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో విరామం పొందారు. కీలక బాధ్యతలు రాష్ట్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, విద్య, యువజన సేవలు, గ్రామీణ అభివృద్ధి శాఖల్లో కీలక పదవుల్లో ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక బోర్డు, రాష్ట్ర వాటర్ షెడ్ మిషన్ సలహా కమిటీ, విద్య టాస్క్‌ఫోర్స్, వన్య ప్రాణుల సలహా కమిటీ, ఎన్ఎస్ఎస్ సలహా కమిటీ, సంయుక్త అటవీ నిర్వహణ స్టీరింగ్ కమిటీ, భారత ప్రభుత్వ ఎన్ఎస్ఎస్ ఎవాల్యూషన్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌గా ప్రతిష్టాత్మక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ప్రజాసేవకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రతిష్టాత్మక ఉత్కళ సేవా సమ్మాన్ పౌరసత్కార పురస్కారం ప్రదానం చేసింది. కుమార్తెతో కలిసి పద్మశ్రీ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు కేంద్రప్రభుత్వం గత ఏడాది ఆయనతో పాటు కుమార్తె సబరమతికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆహార అరణ్యం ఆవిష్కర్తలుగా తండ్రీకూతుళ్లు విశేష గుర్తింపు పొందారు. సంభవ్ సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక వ్యక్తులు, రైతులకు సేంద్రియ సాగులో మెలకువలు తెలియజేసి వ్యవసాయ రంగంలో కొత్త మలుపులు ఆవిష్కరించిన తండ్రీకూతుళ్లను పద్మశ్రీ పురస్కారం వరించింది. గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ఆర్థికవేత్త పర్యావరణవేత్తగా మారి సేంద్రియ సాగులో విభిన్న రీతుల ఆవిష్కరణలో కీలక పాత్రధారిగా ఆయన గుర్తింపు సాధించారు. పర్యావరణ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఐక్య రాజ్య పర్యావరణ కార్యక్రమం యూఎన్ఈపీ కింద గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ఆయనకు ప్రదానం చేయడం విశేషం. ఆయన ఆవిష్కరించిన సంభవ్ సంస్థ సేంద్రియ సాగులో దేశ వ్యాప్తంగా రైతాంగానికి రిసోర్స్ సెంటర్‌గా వెలుగొందుతోంది. -
మహేశ్‌తో సినిమా నా డ్రీమ్!
‘‘మహేశ్‌బాబుతో సినిమా నా డ్రీమ్. ఆయన ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. అయితే.. అందుకు సరైన దర్శకుడు, కథ కుదరాలి’’ అన్నారు నిర్మాత కేకే రాధామోహన్. పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెల 25న విడుదలవుతోంది. రాధామోహన్ మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే ప్రేమకథా చిత్రమిది. నవీన్‌చంద్ర, పృథ్వీ పాత్రలు నువ్వా! నేనా! అన్నట్టుంటాయి. ‘బెంగాల్ టైగర్’ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ఈ సినిమా నిర్మించడానికి కథే కారణం. దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. అతిథి పాత్రలో నటించి, నేను నిర్మించిన సినిమాలు హిట్ కాలేదు. నటించనవి హిట్టయ్యాయి. అందుకే, ఇందులో నటించలేదు’’ అన్నారు. -
నవంబర్ 20న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు శిల్పా శిరోద్కర్ (నటి), రాధా మోహన్ (డైరక్టర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువు బృహస్పతి. దీనివల్ల విద్య, వినయం, వాక్చాతుర్యం, అందరితోటీ మన్ననలందుకుంటారు. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసిస్తారు. సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు బాగా రాణిస్తారు. వీరి పుట్టిన తేదీ 20. ఇది చంద్రసంఖ్య కావడం వల్ల వీరు ఈ సంవత్సరం ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. అయితే ఇతరులకు రుణాలు, హామీలు ఇవ్వడం మంచిది కాదు. చంద్రప్రభావం వల్ల వీరి ఆలోచనలకు గుర్తింపుతోబాటు మంచి సలహాదారుగా, మార్గదర్శకుడిగా పేరొస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. లక్కీ నంబర్స్: 1,2,3,5, 6,8, లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను సన్మానించడం, వేదపాఠశాలలకు, మిషనరీలకు, మదరసాలకు సాయం చేయడం, వెన్నెలలో గడపడం - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
'నివేదిక ఇస్తే ఆలోచిస్తాం'
కరువు మండలాలకు సాయంపై కేంద్రమంత్రి రాధామోహన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తే ఆర్థిక సహాయంపై ఆలోచిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలో ఇరు రాష్ట్రాల బీజేపీ కిసాన్ మోర్చా ప్రతినిధులు బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కరువు నిధులు విడుదల చేయడం, నకిలీ విత్తనాల అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూములు అప్పగిస్తే విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేసినట్లు భేటీ అనంతరం దత్తాత్రేయ విలేకరులకు చెప్పారు. కరువు మండలాలను గుర్తించి నివేదిక పంపాలని, రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక నిధులను ఖర్చుచేసిన వివరాలు అందజేస్తే అదనపు నిధులు ఇస్తామని రాధామోహన్ చెప్పారన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ అధికధరకు విత్తనాలు విక్రయిస్తున్న విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పేటెంట్ చట్టాల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో వాణిజ్య శాఖ, ధరల పెంపుపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని రాధామోహన్ సింగ్ చెప్పారన్నారు.