నవంబర్ 20న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 20, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 20న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Thu, Nov 19 2015 10:32 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

నవంబర్  20న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 20న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
శిల్పా శిరోద్కర్ (నటి), రాధా మోహన్ (డైరక్టర్)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువు బృహస్పతి. దీనివల్ల విద్య, వినయం, వాక్చాతుర్యం, అందరితోటీ మన్ననలందుకుంటారు. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసిస్తారు. సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు బాగా రాణిస్తారు. వీరి పుట్టిన తేదీ 20. ఇది చంద్రసంఖ్య కావడం వల్ల వీరు ఈ సంవత్సరం ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.

అయితే ఇతరులకు రుణాలు, హామీలు ఇవ్వడం మంచిది కాదు. చంద్రప్రభావం వల్ల వీరి ఆలోచనలకు గుర్తింపుతోబాటు మంచి సలహాదారుగా, మార్గదర్శకుడిగా పేరొస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. లక్కీ నంబర్స్: 1,2,3,5, 6,8, లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను సన్మానించడం, వేదపాఠశాలలకు, మిషనరీలకు, మదరసాలకు సాయం చేయడం, వెన్నెలలో గడపడం
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement