అది నాకు ఓ పెద్ద సవాల్: నాగార్జున | Nagarjuna overjoyed with response to his TV debut | Sakshi
Sakshi News home page

అది నాకు ఓ పెద్ద సవాల్: నాగార్జున

Published Sun, Jun 29 2014 4:08 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అది నాకు ఓ పెద్ద సవాల్: నాగార్జున - Sakshi

అది నాకు ఓ పెద్ద సవాల్: నాగార్జున

చెన్నై: మాటీవీ నిర్వహించే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించడం తనకు ఓ పెద్ద సవాల్ అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. కౌన్నేగా కరోర్పతి తరహాలో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమం మాటీవిలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో యాంకర్గా వ్యవహరిస్తున్న నాగార్జున శైలికి మంచి స్పందన వస్తోంది.

తన ఈ తొలి టివిషోకు వచ్చే ప్రజాస్పందనతో తాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు నాగార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గేమ్లో పాల్గొనేవారికి ఓ మంచి స్నేహితుడిగా ఉత్కంఠమైన క్షణాలు, తీసిజ్ఞాపకాలతోపాటు సాధ్యమైనంత డబ్బు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక యాంకర్గా వారిలో ఉత్కంఠను తొలగించడం తనకు ఓ సవాల్ అన్నారు. ఈ షోని ఎక్కువ మంది  చూడటం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

 ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తను నటించిన 'బాబీ జాసూస్' చిత్రం ప్రమోటింగ్లో బిజీగా ఉండి కూడా ఇటీవల ఈ షోలో పాల్గొన్నారు. విద్యాబాలన్ పాల్గొన్న ఎపిసోడ్ రేపు సోమవారం ప్రసారం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement