7న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గ్రాండ్ ఫైనల్ | Curtains down on Nagarjuna's TV show Aug 7 | Sakshi
Sakshi News home page

7న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గ్రాండ్ ఫైనల్

Published Sat, Aug 2 2014 5:48 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

7న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గ్రాండ్ ఫైనల్ - Sakshi

7న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గ్రాండ్ ఫైనల్

చెన్నై: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా అత్యంత ప్రజాదరణ పొందిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ షోకు త్వరలో ఫుల్స్టాప్ పడనుంది. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫైనల్ ఈ నెల 7న ప్రసారం కానుంది. ఇది 40వ ఎపిసోడ్. అంతటితో ఈ కార్యక్రమం ముగియనుంది.

హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా అమితాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోర్పతి' టీవీ షోకు తెలుగులో వర్సెన్లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం రూపొందించారు. బుల్లితెరపై నాగ్ ఆకట్టుకున్నారు. అభిమానుల నుంచి ఈ షోకు మంచి స్పందన వచ్చింది. ఈ షో తనకు ఎంతో నచ్చిందని, ఓ మధురానుభూతిగా నిలిచిపోతుందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ షో లక్షలాదిమంది హృదయాలను గెలుచుకుందని, వ్యాఖ్యాతగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని చెప్పారు. పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement