హాట్ సీటుపై చిరంజీవి | Chiranjeevi to feature in Telugu version of KBC | Sakshi
Sakshi News home page

హాట్ సీటుపై చిరంజీవి

Published Tue, Jul 22 2014 12:34 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

హాట్ సీటుపై చిరంజీవి - Sakshi

హాట్ సీటుపై చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు. యాక్టర్ నుంచి పొలిటిషియన్గా మారిన త్వరలో చిరంజీవి హాట్ సీటుపై ..

మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు. యాక్టర్ నుంచి పొలిటిషియన్గా మారిన త్వరలో చిరంజీవి హాట్ సీటుపై కూర్చోనున్నారు.  సూపర్ స్టార్ నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'  రియాల్టీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్పతి కి తెలుగు వెర్షన్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో  వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

తాజాగా ఈ కార్యక్రమానికి చిరంజీవి స్పెషల్ గెస్ట్గా రానున్నారు. ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 3వ తేదీన ప్రసారం కానుంది. ఇటీవలి ఆ షో చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక తమ అభిమాన హీరోలు ఇద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయటం  నాగ్, చిరుల అభిమానులకు పండుగే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి విద్యాబాలన్, శ్రేయ, లక్ష్మి మంచు, అల్లరి నరేష్, యాంకర్స్ ఝాన్సీ, సుమ తదితరులు గెస్ట్లుగా విచ్చేశారు.  ఇక చిరంజీవి ప్రస్తుతం తన 150 సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement