Kaun Banega Crorepati
-
రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!
Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్‌పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.రూ.1 కోటి విలువైన ప్రశ్నరూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్‌లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్‌బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్‌కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్‌ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్‌బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్‌బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుని వెళ్లిపోయింది. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న.. 6.4 లక్షలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. దాదాపు ప్రతి ఎపిసోడ్లో ప్రతి కంటెస్టెంట్‌కు ఇలాంటి ఓ ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా జరిగిన కేబీసీ 16వ సీజన్ 57వ ఎపిసోడ్లో (అక్టోబర్ 29న టెలికాస్ట్ అయ్యింది) మరోసారి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది.Today's Question in KBC for 6,40,000 😮 pic.twitter.com/QBopW2AoWQ— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 29, 2024రూ. 6. 4 లక్షలు విలువ చేసే ఈ ప్రశ్న టెస్ట్ క్రికెట్‌కు సంబంధించింది. 2022లో టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 500కు పైగా పరుగులు స్కోర్ చేసిన తొలి జట్టు ఏది..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇంగ్లండ్. 2022 డిసెంబర్ 1న పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి రోజే 506 పరుగులు (4 వికెట్ల నష్టానికి) చేసింది. టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టు ఇంగ్లండే.ఈ ప్రశ్నను ఎదుర్కొన్న కంటెస్టెంట్‌కు క్రికెట్ పరిజ్ఞానం బాగా ఉన్నట్లుంది. అందుకే అతను పూర్తి వివరాలతో సహా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్ 500కు పైగా స్కోర్ చేసిన మ్యాచ్‌లో తొలి రోజే నలుగురు బ్యాటర్లు (జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్) సెంచరీలు చేశారని వివరణ ఇచ్చాడు. -
ఆ సాంగ్ షూటింగ్లో కరెంట్ షాక్ తగిలింది: అమితాబ్
కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరులు) షోలో అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు తన గురించి కొత్త విషయాలు చెప్తూనే ఉంటాడు. సినిమా సంగతులను కంటెస్టెంట్లతో పంచుకుంటాడు. అలా తాజా ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.స్టేడియంలో షూటింగ్యారన్ సినిమాలో సారా జమానా అనే హిట్ సాంగ్ ఉంది. దాన్ని స్టేడియంలో షూట్ చేస్తే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను. సరిగ్గా అదే సమయంలో కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం కొత్తగా ఓపెన్ చేశారు. 12 వేల నుంచి 15 వేల కూర్చోగలిగే ఆ స్టేడియంలోకి ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది దాకా వచ్చారు.రాత్రిళ్లు షూట్ చేద్దామని..పరిస్థితి చేయిదాటడంతో షూటింగ్ ఆపేసి ముంబై వెళ్లిపోయాం. అయితే ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షూట్ చేద్దామన్నాను. అలా కొద్దిరోజులకే గుట్టుచప్పుడు కాకుండా కోల్‌కతాకి వచ్చే స్టేడియంలో నైట్ షూట్ చేశాం. సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదని డైరెక్టర్ క్యాండిల్స్ పెట్టాడు.కరెంట్ షాక్‌తో డ్యాన్స్నాకేమో ఎలక్ట్రిక్ జాకెట్ తొడిగించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. నా జాకెట్‌కు లైట్స్ రావాలంటే ప్లగ్ బోర్డు దగ్గర స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్విచ్ ఆన్ చేయగానే నాకు కరెంట్ షాక్ తగిలి ఆటోమేటిక్‌గా డ్యాన్స్ చేశాను అని బిగ్‌బీ నవ్వుతూ చెప్పాడు.చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో భూకంపం.. ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు! -
జనరల్ నాలెడ్జ్‌కు కేరాఫ్ అడ్రస్
ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్ సర్‌తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్.మయాంక్‌ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్లను అడుగుతుంటాడు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్ పోటీలు ఉన్నప్పుడే జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.న్యూస్‌పేపర్ రోజూ చదవడం మరచిపోవద్దు.‘జననరల్ నాలెడ్జ్‌కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్ నాలెడ్జ్‌లో దిట్ట’ అనిపించుకోండి. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్‌గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
అమితాబ్ కోటి రూపాయల ప్రశ్న.. కంటెస్టెంట్ ఏం చేశాడంటే?
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కల్కి సినిమాతో అభిమానులను మెప్పించిన ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చాడు. ఆదివాసి తెగకు చెందిన కంటెస్టెంట్ బంటి వడివా కోటీ రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటో మనం ఓ లుక్కేద్దాం.తాజా ఎపిసోడ్లో మొదటి ఆదివాసీ కంటెస్టెంట్ బంటి వడివా రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొదటి కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రిస్క్ తీసుకోకుండా నిష్క్రమించాడు. దీంతో 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమితాబ్ కూడా ప్రశంసించారు.గతంలో తాను ముంబైకి వచ్చినప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.260 మాత్రమే ఉన్నాయని బంటి వడివా తెలిపారు. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్లో 2024 పారిస్ ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, అమన్ షెరావత్ కూడా అతిథులుగా పాల్గొన్నారు.కోటీ రూపాయల ప్రశ్న..ప్రశ్న: ది స్టాగ్ అనే ఆర్ట్ వర్క్‌కు బెంగాలీ శిల్పి చింతామోని కర్ను వరించిన పతకమేది?ఆప్షన్స్: ఎ. పైథాగరస్ బహుమతి బి. నోబెల్ బహుమతి సి. ఒలింపిక్ పతకం డి. ఆస్కార్ పతకంఅయితే 1948లో ఒలింపిక్ గేమ్స్‌లో కళల పోటీలు కూడా ఉన్నాయని అమితాబ్ వెల్లడించారు. అందువల్లే చింతామోని కర్ తన కళాకృతికి ఒలింపిక్ రజత పతకాన్ని గెలుచుకున్నాడని తెలిపారు. కాగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో సోనీలివ్‌లో ప్రసారమవుతోంది. -
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్‌కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్‌కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
KBC 15: ముగిసిన కేబీసీ 15వ సీజన్.. అమితాబ్ ఎమోషనల్
కొన్ని రియాల్టీ షోల ద్వారా హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీలకు పేరొస్తుంది. మరికొన్ని రియాల్టీ షోలకు మాత్రం హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీ ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి రియాల్టీ షోలలో`కౌన్ బనేగా కరోడ్‌పతి` ఒకటి. ఈ షో పేరు చెప్పగానే అందిరికి గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఈ షో సక్సెస్‌లో అబితాబ్ కీలక పాత్ర పోషించాడు. ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించి షో కాదు.. ఎన్నో అనుభూతులను కూడా పంచుతుంటుంది. హాట్సీట్లో కూర్చొని అబితాబ్ చెప్పే విషయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 15వ సీజన్‌ని కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న చివరి ఎపిసోడ్ ప్రసారమవ్వగా.. షోకి వచ్చిన ప్రేక్షకులతో పాటు అబితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారు. (చదవండి: Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ) `లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్) అమితాబ్‌తో పాటు షోకి వెళ్లిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ‘మేం దేవుడిని చూడలేదు కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నాం’అంటూ ఓ ప్రేక్షకురాలు చెప్పడంతో వేదిక అంతా చప్పట్లతో మారుమ్రోగింది. కాగా, చివరి ఎపిసోడ్‌కి విద్యాబాలన్, షీలా దేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్ విచ్చేసి సందడి చేశారు. ఇదే చివరి ఎపిసోడ్. ఇకపై ఇక్కడకు రాలేము అనే మాటలు చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను’అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
అభిమానికి వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేసిన రష్మిక!
పుష్ప సినిమాతో రష్మిక మందన్నా నేషనల్ క్రష్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అందుకే రష్మికకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో ప్రమోద్ భాస్కర్ కూడా ఒకరు. రష్మికకు అతను వీరాభిమాని. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతుంటాడు. అమె సినిమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటాడు. అంతేకాదు ఎక్స్(ట్విటర్)వేదికగా రష్మికకు ప్రపోజ్ కూడా చేశాడు. రష్మిక కూడా ప్రమోద్ ట్వీట్స్‌కి ఫన్నీ రిప్లైలు ఇచ్చింది. తాజాగా అతనితో వీడియో కాల్ మాట్లాడి సర్ప్రైజ్ చేసింది. ఇదంతా బిగ్‌బీ అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘ కౌన్ బనేగా క్రోర్‌పతి’షో వేదికగా జరిగింది. బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి రియాల్టీ షోలో తాజాగా ప్రమోద్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను అమితాబ్‌తో పంచుకున్నాడు. రష్మిక అంటే చాలా ఇష్టమని, తన సినిమాలన్నీ చూశానని.. ఆమెకు ప్రపోజ్ కూడా చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బీ రష్మికకు వీడియో కాల్ చేసి..ప్రమోద్‌తో మాట్లాడించాడు. తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్ ప్రైజ్ అయ్యారు. ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా..రష్మిక తప్పకుండా మీట్ అవుదామని చెప్పింది. తన అభిమాని కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో పాల్గొనడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అమితాబ్ రష్మికపై ప్రశంసల జల్లు కురిపించాడు. రష్మిక నటించిన ప్రతి సినిమాను చూస్తున్నానని.. యానిమల్‌లో ఆమె నటన చాలా బాగుందని ప్రశంసించాడు. అబితాబ్ తన నటనను మెచ్చుకోవడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. I feel like am literally living my dream moments right now still not able to believe that one day I will be on TV and will get a chance to talk with My Crush since 2016 @iamRashmika Ji Mam,I wish I will meet her in person one day. 1/2#JaiHoKBC pic.twitter.com/lLoiUdYQJ8 — Pramod Bhaske 🇮🇳 (@AlwaysPramod9) December 9, 2023 -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
కోటి రూపాయలు గెలిచింది.. కానీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు!
బాలీవుడ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 14న కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ ప్రారంభమైంది. ఈ సారి కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది ఈ షోలో పాల్గొని చివరిదాకా నిలిచి కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే ఈ షోలో మొదట కోటీ రూపాయలు గెలుచుకున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలేంటి? అన్న సందేహం వస్తోంది కదా. అయితే అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?) రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 15వ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ షో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా మహిళ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలిచింది. 2010లో కేబీసీ -4 సీజన్లో అమితబ్‌ను మెప్పించిన మహిళ రహత్ తస్లీమ్ రూ.కోటి రూపాయలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌కు చెందిన 37 ఏళ్ల రహత్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రాహత్ పాల్గొన్న సమయంలో రూ. 3.20 లక్షల ప్రశ్న నుంచి రూ. 50 లక్షల ప్రశ్న వరకు ఎలాంటి లైఫ్ లైన్లు వినియోగించుకోలేదు. ఆ తర్వాత నీపై ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందని బిగ్ బి ప్రశ్నించగా.. అది నా ఆత్మవిశ్వాసం నుంచే పుట్టింది.. నాకు అన్నీ తెలుసు.. అని సమాధానిచ్చినట్లు రాహత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే కేబీసీలో పాల్గొనేందుకు మేసేజ్ చేయడానికి తన మొబైల్ ఫోన్లో కేవలం రూ. 3 మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది. ఆ డబ్బులతోనే మేసేజ్ పంపినట్లు పేర్కొంది. ఆ తర్వాత తాను ఎంపికవ్వడంతో ముంబయిలో ఆడిషన్ కోసం పిలిచారని వెల్లడించింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరికీ బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారని వివరించింది. (ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) అయితే ఆడిషన్స్ ముగిశాక.. ఇంటికి తిరిగి వెళ్లిన వెంటనే నేను చేసిన మొదటి పని బ్యాంక్ ఖాతా తెరిచి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడమే అని ఆ రోజులను రాహత్ గుర్తుచేసుకుంది. కాగా.. ప్రస్తుతం రాహత్ ఇప్పుడు గిరిదిహ్‌లోని పెద్ద మాల్లో దుస్తుల షోరూమ్ నిర్వహిస్తోంది. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న ఆమె.. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ లేని స్థితి నుంచి ఏకంగా బిజినెస్ చేసే స్థాయికి చేరుకోవడమంటే గొప్ప విషయమే. కౌన్ బనేగా కరోడ్‌పతి వల్ల ఓ సామాన్యురాలు సైతం బిజినెస్ వుమెన్‌గా అవతరించింది. -
కౌన్ బనేగా కరోడ్‌పతి మళ్లీ వచ్చేస్తుంది.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి పేరుంది. తాజాగా సోనీ టీవీ తన ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. కౌన్ బనేగా కరోడ్‌పతి ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి అయ్యాయి. 2000 నుంచి ఈ షో ప్రారంభమైంది. ఆగష్టు 14 నుంచి సీజన్-15 ప్రారంభం కానుంది. ఈ షో కోసం హోస్ట్‌గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని షోలను ఆయనే విజయవంతంగా నడిపారు. అందుకు సంబంధించి అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. 2000లో ప్రారంభం అయిన మొదటి సీజన్ అత్యంత ప్రశంసలు పొందింది. షో మొదటి సీజన్లో ప్రైజ్ మనీ రూ.1 కోటి ఉండగా 2005లో వచ్చిన రెండో సీజన్లో ప్రైజ్ మనీ రెండింతలు పెరిగి రూ.2 కోట్లకు చేరింది. అలా మూడో సీజన్ వరకు అలాగే ఉంది. 2010లో సీజన్ 4 ప్రైజ్ మనీని మళ్లీ రూ.1 కోటికి తగ్గించారు. కానీ 2013లో వచ్చిన ఏడో సీజన్ నుంచి ప్రైజ్ మనీని ఒక్కసారిగా రూ.7 కోట్లకు పెంచారు. ఈసారి ఎంత ప్రైజ్ మనీ అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ రెమ్యునరేషన్ షో ప్రారంభ సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షలు వసూలు చేశారు. మొదటి సీజన్ హిట్ కాగానే అమితాబ్ తన ఫీజును కోటి రూపాయలకు పెంచేశారు.పలు మీడియా కథనాల ప్రకారం ఆయన 6,7 సీజన్లలో రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ 8వ సీజనలో అది కాస్త రూ.2 కోట్లకు చేరింది. ఎనిమిదవ సీజన్లో రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే వంటి తారలు కూడా ఆ స్టేజీపైన మెరిశారు. ఆ తర్వాత 9వ సీజన్లో అమితాబ్ బచ్చన్ రూ.2.6 కోట్లు తీసుకున్నారు. ఆ సీజన్లో హాట్ సీట్లో క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్ అతిథులుగా కనిపించారు. 10వ సీజన్లో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 కోట్లు వసూలు చేశారు. ఆ సంవత్సరం ప్రత్యేక పోటీదారులలో ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఉన్నారు. 11, 12, 13వ సీజన్లలో మెగాస్టార్ అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 3.5 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 13వ సీజన్‌కు క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌లతో సహా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ సీజన్ కోసం రూ. 4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని బాలీవుడ్ మీడియా తెలుపుతుంది. -
అమితాబ్ బచ్చన్‌కు గాయం.. విపరీతమైన రక్తస్రావం.. కుట్లు
ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్‌పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్ చేశారు. -
వారంటే మా నాన్నకు చాలా గౌరవం: అమితాబ్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన తండ్రి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పట్లో మా నాన్న అభిమానులకు స్వయంగా లేఖలు రాసేవారని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా తానే స్వయంగా పోస్ట్ చేసేవారని తెలిపారు. పోస్ట్మెన్లను తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ గౌరవించేవారని వివరించారు. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోలో పోస్టల్ ఉద్యోగి జ్యోతిర్మయితో మాట్లాడే సందర్భంలో అమితాబ్ తన తండ్రి రాసిన లేఖలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఒక పోటీదారుడు.. హరివంశ్ రాయ్ బచ్చన్ రాసినా కొన్ని లేఖలు తమ వద్ద ఉన్నాయని అమితాబ్‌తో చెప్పగా.. వాటిని తనకు అందజేయమని అమితాబ్ బచ్చన్ కోరారు. (చదవండి: వారి వల్లే మెంటల్లీ బరువు తగ్గిపోయింది: నాగార్జున) అనంతరం తండ్రి గురించి మాట్లాడుతూ..‘మా నాన్న తన అభిమానులకు, స్నేహితులకు చాలా ఉత్తరాలు రాస్తుండేవారు. ప్రతిరోజు 50 నుంచి 100 ఉత్తరాలు రాసేవాడు, ప్రతి ఒక్కరి ఉత్తరానికి తనంతట తానుగా సమాధానం చెప్పేవాడు. చిన్న చిన్న పోస్ట్‌కార్డ్‌లపై రాసి, వాటిని తానే స్వయంగా పోస్ట్‌లో ఇచ్చేవాడు. మళ్లీ పోస్టాఫీస్‌కి ఎందుకు వెళ్తున్నావని నేను ఆయనను అడిగితే, 'కార్డు పంపించాడో లేదో చూడబోతున్నాను" అని సమాధానం చెప్పేవారని అమితాబ్ వివరించారు. “ప్రేక్షకులలో ఎవరైనా మా నాన్నగారు స్వయంగా వ్రాసిన ఉత్తరం ఉందని తనతో చెప్పాలని కోరుకుంటున్నట్లు అమితాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారి నుంచి ఉత్తరాలు సేకరించి.. వాటిని ప్రేక్షకుల నుంచి తీసుకునే ముందు మరో కాపీని వారికి కచ్చితంగా ఇస్తానన్నారు. నూ కూడా 'పోస్ట్మెన్లను చాలా గౌరవిస్తానని' అమితాబ్ అన్నారు. “మా యుగంలో పోస్ట్‌మ్యాన్ మా హీరో.. ఎందుకంటే అతను మాత్రమే మా కమ్యూనికేషన్‌కు మూలంగా ఉండేవారు. మా ఇళ్లకు ఉత్తరాలు తెచ్చేవారని అందుకే మేము వారిని చాలా గౌరవిస్తామని అమితాబ్ తెలిపారు. -
హాట్సీట్లో రైల్వే ఉద్యోగి.. 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి..
భువనేశ్వర్: విశేష ప్రేక్షక ఆదరణ పొందుతున్న కౌన్ బేనాగా కరోడ్‌పతి రియాల్టీ షో కార్యక్రమంలో తూర్పుకోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం సిబ్బంది కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆయన ఖుర్దారోడ్ మండలంలో చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్ సీట్లో కూర్చుని, 12 ప్రశ్నల వరకు చురుగ్గా సమాధానం చెప్పి, రూ.12 లక్షల 50 వేలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత జగన్నాథుని ప్రసాదం అమితాబ్ బచ్చన్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణదాస్ గెలుపు పట్ల తోటి సిబ్బంది ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. చదవండి: (పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..) -
కేబీసీలో ఆసక్తికర సంఘటన, షర్ట్ విప్పి రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ప్రస్తుతం ఈ షో 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హాట్ సీట్‌కు ఎంటర్ అయ్యేందుకు ఫాస్టేస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్లో గెలుపొందిన ఓ వ్యక్తి షర్డ్ విప్పి స్టేజ్‌పై హంగామా చేశాడు. అతన్ని చూసి బిగ్‌బి ఆశ్చర్యపోయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు ఈ వీడియోలో అమితాబ్ విజయ్ గుప్తా అనే కంటెస్టెంట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్లో గెలిచినట్లు అనౌన్స్ చేశారు. అది విన్న ఆ వ్యక్తి సంతోషం పట్టలేక స్టేజ్‌పై రచ్చ రచ్చ చేశాడు. దీంతో స్టేజ్‌పైకి వస్తూనే షర్ట్ విప్పి స్టేజ్ చూట్టు తిరిగాడు. అంతేకాదు తన భార్య దగ్గరికి వెళ్లి ఆనందంతో హగ్ చేసుకున్నాడు. దాదాపు 45 ఏళ్లపైనే ఉండే ఈ వ్యక్తి ఒక్కసారిగా కుర్రాడిలా మారిపోయాడు. ఆయనను అలా చూసి షో హోస్ట్ బిగ్‌బితో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అతను మాత్రం చప్పట్లు కొట్టడం ఆపకండి అని ఆడియన్స్‌కు చెప్పుతూ స్టేజ్ అంతా పరుగెడుతూ నానా హంగామా చేశాడు. చదవండి: అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఇక కాసేపటికి హోస్ట్ అమితాబ్ సర్ కనీసం షర్ట్ అయినా వేసుకోండని అతడిని కోరారు. ఆ తర్వాత ‘కనీసం ఆయనను షర్ట్ వేసుకోనివ్వండి.. లేదంటే ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉంది’ అని బిగ్‌బి చమత్కరించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆయనను అలా చూసిన నెటిజన్లు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని గుర్తు చేసుకుంటున్నారు. 2000లో కప్ గెలిచిన అనంతరం సౌరవ్ గంగూలి తన జెర్సీని ఇప్పేసి స్టేడియం మొత్తం పరిగెడుతూ ఇలాగే చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. Vijay Gupta ji ne jeet mein shirt utaar ke machayi dhamaal, lekin kya apne gyan se hotseat par woh karenge kamaal? Dekhiye #KaunBanegaCrorepati, aaj raat 9 baje, sirf Sony par.#KBC2022@SrBachchan pic.twitter.com/FpP2J7M8Is — sonytv (@SonyTV) August 25, 2022 -
కౌన్ బనేగా కరోడ్‌పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!
కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) అభిమానులకు గుడ్‌న్యూస్. కేబీసీ 14వ సీజన్లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?) కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు) -
బిగ్‌బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో
John Abraham Cries In front Of Amitabh Bachchan: బాలీవుడ్ హీరో, కండల వీరుడు జాన్ అబ్రహం రియాలిటీ షో వేదికపై ఒక్కసారిగా కన్నీటి పర్యంతరమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు అతిగా జాన్ అబ్రహం వచ్చాడు. ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోన్న ఈ షో ది. ‘సత్యమేవ జయతే 2’ హీరోహీరోయిన్ అయిన జాన్ అబ్రహాం, దివ్యా ఖోస్లా కుమార్ సందడి చేశారు. చదవండి: Priyanak Chopra-Nick Jonas: తమ విడాకుల రూమార్లపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను సోనీ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇందులో జాన్ అబ్రహాం తనదైన శైలిలో హాట్ సీట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన సిక్స్ ప్యాక్‌ను ప్రదర్శించాడు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా కేకలతో హోరెత్తించారు. ఆ వెంటనే బిగ్‌బి అంతా అమ్మాయిలే కేకలేస్తున్నారంటూ చమత్కిరించారు. హాట్ సీట్‌పై కూర్చున్న జాన అబ్రహం ‘ధూమ్’ సినిమా తర్వాత ఓసారి తాను అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. చదవండి: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్? ‘‘నేను బైక్‌పై మీ ఇంటికి అభిషేక్‌ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సహించవద్దంటూ మీరు నాకు చెప్పారు.. గుర్తుందా!’’ అంటూ చెప్పాడు. అయితే అభిషేక్ కిందకురాగానే ‘వావ్.. బైక్ చాలా బాగుంది’ అంటూ మీరు మాట మార్చేశారని జాన్ అనడంతో బిగ్‌బి గట్టిగా నవ్వేశారు. ఇక ఏమైందో తన వ్యక్తిగత విషయం చెబుతూ జాన్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రోమో ఎండింగ్లో జాన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. మరి, అతడి దు:ఖానికి కారణమేంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తాజా ఎపిసోడ్లో సోనూసూద్, కపిల్ శర్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా తన తల్లి సరోజ్ సూద్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు సోనూసూద్. ‘మా అమ్మగారికి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ నాకు ఉత్తరాలు రాసేవారు అమ్మ. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం.. అయినా ఉత్తరాలెందుకు? అని మా అమ్మ గారిని ఓ సందర్భంలో అడిగాను. ‘నేను నిన్ను విడిచి వెళ్లిపోయినప్పుడు ఈ ఉత్తరాలు నీ దగ్గర ఉంటాయి. ఫోన్ రికార్డ్స్ చెరిగిపోతాయి’అన్నారు. మా అమ్మ రాసిన లేఖలు(దాదాపు 25)నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ నాతో లేరు. కానీ ఆ ఉత్తరాలు చదువుతుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. నేను కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’ అన్నారు సోనూసూద్. అలాగే సరోజ్ రాసిన ఓ లేఖను షోలో చదివి వినిపించారాయన. -
KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్‌పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి.. జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే.. పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?! ఆ చాన్స్‌తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో! ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది.. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది.. ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది.. ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ.. 2000 సంవత్సరం మార్చి.. Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్‌లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్‌ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్‌కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్‌లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్‌కు టాప్ 20 ప్రోగ్రామ్స్‌లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు. కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్‌గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్‌లో అసలు పాయింట్‌కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్‌గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ గా మారిపోయింది. సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్‌ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్‌కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు. ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్‌కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్‌కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్‌ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు. ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్‌లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు. ఆన్ ఎయిర్ 250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్‌కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్‌లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్‌కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు. 2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్‌ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి. కరోడ్‌పతి వర్సెస్ సినిమా మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది. ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్‌పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్‌పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్‌పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ. కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్‌లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు. హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్‌లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్‌కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్‌గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్‌తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది. డింగు టకా.. గొళ్లెం పెట్టు తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది. ‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్‌లో బ్రహ్మానందం హోస్ట్‌గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్‌పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. దగ్గుతో మోసం అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా ఉన్న చాల్స్ ఇన్‌గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్‌గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది. డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్‌ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్‌గ్రామ్‌ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం. బైటికిరాని ఆ ఫుటేజ్‌లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు. ఈ భాషల్లోనూ.. ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్‌గా భోజ్‌పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్‌గా ప్రసారమవుతోంది. మూలం.. బ్రిటన్‌లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు. -తోట భావనారాయణ -
నాన్న సెక్యూరిటీ గార్డ్.. కొడుకు రూ. కోటి గెలిచాడు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్విళ్లురుతుంటారు. కొందరు ఏళ్లుగా ప్రయత్నిస్తుంటారు. అదృష్టం వరించి.. సెలక్ట్ అయిన వారు ఎంతో కొంత సొమ్ముతో షో నుంచి వెనుదిరుగుతారు. కొందరు ప్రతిభావంతులు మాత్రం కోటి రూపాయలు సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలిచిన రెండవ వ్యక్తిగా నిలిచాడు సాహిల్ ఆదిత్య(19). సెక్యూరిటీ గార్డు కుమారుడైన సాహిల్.. ప్రస్తుత కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు.. (చదవండి: కేబీసీ 13: రూ. 7 కోట్ల ప్రశ్న, గెలుస్తాడా, లేదా?!) మధ్యప్రదేశ్ ఛతర్పూర్ మున్సిపాలిటీకి చెందిన సాహిల్ ఆదిత్య అహిర్వార్ తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా సాహిల్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. కాలేజీకి బంక్ కొట్టడం.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం చేసేవాడు. చదువు మీద అసలు ఆసక్తి కనపర్చేవాడు కాదు. కానీ గత రెండేళ్లలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. సమయం వృధా చేయకుండా దాని కోసం కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో కేబీసీ 13వ సీజన్లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు సాహిల్. ఎస్ఎమ్ఎస్లు పంపాడు. అదృష్టం బాగుండటంతో సెలక్ట్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్న వరకు సరైన సమాధానం చెప్పాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. ఇక సాహిల్ తండ్రి గురించి, తన గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తండ్రి పదవ తరగతి వరకు చదువుకున్నాడని... ప్రస్తుతం నోయిడాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు అని తెలిపాడు సాహిల్. (చదవండి: కోటి రూపాయలను తలదన్నే కథ) ‘‘గత రెండేళ్లు నా జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. అంతకు ముందు నాకు చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజీకి బంక్ కొట్టి.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు తిరిగేవాడిని. కానీ ఈ రెండేళ్లు నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాయి. ప్రస్తుతం నేను ర్యాంక్ హోల్డర్ని. రానున్న రోజుల్లో తప్పక ఐఏఎస్ అవుతాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు సాహిల్. చదవండి: 900 కోట్ల రూపాయల అప్పు.. చీకటి రోజులవి: అమితాబ్ -
కేబీసీ 13: రూ. 7 కోట్ల ప్రశ్న, గెలుస్తాడా, లేదా?!
Kaun Banega Crorepati Latest Promo: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన టీవీ షోల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఒకటి. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం 13వ సీజన్‌ను జరపుకుంటోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఆశ్చర్యకరంగా కోట్లు గెలుచుకుంటున్నారు. ఈ షో రూ. కోటి సొంతం చేసుకున్న తొలి కంటెస్టెంట్‌గా హిమానీ బుందేలా నిలిచిన సంగతి తెలిసిందే. కళ్లు సరిగా కనిపించకపోయినా ఆమె విజేతగా నిలిచి ఎందురికో స్ఫూర్తినిచ్చారు. ఈ నేపథ్యంలో మరో కంటెస్టెంట్ కూడా కోటీశ్వరుడు అయినట్లు నేడు(మంగళవారం) విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. చదవండి: షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పా దంపతులు అయితే సదరు కంటెస్టెంట్ రూ. కోటితో ఆగిపోకుండా రూ. 7 కోట్ల ప్రశ్నకి చేరుకున్నాడు. అక్టోబరు 20, 21 తేదీల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేశారు. ఇందులో హాట్సీట్లో ఉన్న అమితాబ్ రూ.కోటి ప్రశ్న అడగ్గా సదరు కంటెస్టెంట్ ఆప్షన్ డిని ఎంపిచేసుకున్నాడు. అది సరైన సమాధానమా, కాదా? అనే ఉత్కంఠకు తెరదించుతూ అమితాబ్ ‘ఏక్ కరోడ్’ అని ఖరారు చేశారు. దాంతో షోలో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఆ తర్వాత ఆట ఇంకా పూర్తవలేదు అంటూ రూ. 7 కోట్ల ప్రశ్నని సంధించారు అమితాబ్. మరి ఆ కంటెస్టెంట్ రూ. 7 కోట్లు గెలుస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగిన అమితాబ్ View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!
కౌన్ బనేగా కరోడ్‌పతి 5వ సీజన్ విజేత సుశీల్ కుమార్ గుర్తున్నాడా? ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే కేబీసీ 13వ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. 2011లో కేబీసీ విజేతగా నిలిచిన ఈ బిహారీ కామన్‌మేన్ నిజ జీవితంలో మాత్రం విఫల వ్యక్తిగా మిగిలాడు. రియాలిటీ క్విజ్ షోలో మొట్ట మొదటిసారిగా గెలిచిన 5 కోట్ల రూపాయలను ఇష్టారీతిని ఖర్చు చేసి చివరకు దివాళా తీశాడు. తన విఫలగాథను పేస్బుక్ పేజీలో గతేడాది ఏకరవు పెట్టాడు. 2011లో కేబీసీ 5వ సీజన్లో విజేతగా నిలిచి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల చెక్ అందుకున్నాడు సుశీల్ కుమార్. కానీ ఆ తర్వాత అతడి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ‘2015-16 నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడిన సమయం. ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఆ టైమ్‌లో నేను లోకల్ సెలబ్రిటీ అయిపోయాను. బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నెలకు 10 నుంచి 15 కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. క్షణం తీరిక లేకపోవడంతో చదువులకు దూరమయ్యాను. లోకల్ సెలబ్రిటీ హోదా రావడంతో మీడియా కూడా నా వెంట పడేది. జర్నలిస్టులు నా ఇంటర్వ్యూలు తీసుకునే వారు. నా గురించి గొప్పగా రాసేవారు. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఏదేదో చెప్పేసేవాడిని. కాని కొన్నిరోజుల తర్వాత చూస్తే నా పరిస్థితి మొత్తం తలకిందులైంద’ని సుశీల్ రాసుకొచ్చాడు. ఎంతో మంది మోసం చేశారు కేబీసీలో ఐదు కోట్లు సంపాదించడంతో స్వచ్చంద సంస్థలు సుశీల్ కుమార్ వెంట పడ్డాయి. ముందు వెనుక చూడకుండా అతడు దానధర్మాలు చేసి మొత్తం ఊడ్చిపెట్టడంతో భార్యతో విభేదాలు తలెత్తాయి. ‘కేబీసీలో గెలిచాక మహా దాతగా మారిపోయాను. రహస్యంగా దానాలు చేయడం వ్యసనంగా మారిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని చాలా మంది నన్ను మోసం చేశారు. దానాలు చేసిన తర్వాతే ఈ విషయం నాకు బోధపడింది. ముందు వెనుక చూడకుండా దానాలు చేయొద్దని నా భార్య పోరు పెట్టేది. దీంతో నా భార్యతో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నెమ్మదిగా మద్యానికి, పొగ తాగడానికి అలవాటుపడ్డాను. నేను ఢిల్లీలో వారం రోజులు ఉన్నప్పుడు పలు రకాల వ్యక్తులతో కలిసి మద్యం, ధూమపానం చేసేవాడిని. అక్కడ వారి మాటలు నాకు బాగా నచ్చేవి. దీంతో మీడియాను తేలిగ్గా తీసుకోవడం ప్రారంభించాన’ని సుశీల్ కుమార్ వెల్లడించాడు. దావానలంలా దివాళా వార్త.. తాను దివాళా తీశానన్న వార్త బయటకు రావడంతో జనం తనను పట్టించుకోవడం మానేశారని, కార్యక్రమాలకు పిలవడం మానేశారని సుశీల్ చెప్పాడు. ‘నేను ఎలా దివాళా తీశాననే విషయం గురించి సినిమాటిక్‌గా చెబుతా. ఒకసారి ఇంగ్లీషు న్యూస్‌పేపర్ జర్నలిస్ట్ ఒకరు నాకు ఫోన్ చేసి విసిగించడంతో.. నా డబ్బు మొత్తం అయిపోయిందని, నా దగ్గర కేవలం రెండు ఆవులు మాత్రమే ఉన్నాయని.. పాలు అమ్ముకుని బతుకుతున్నానని చెప్పాను. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో నా వెంట పడటం మానేశార’ని చెప్పుకొచ్చాడు. సినిమా కల.. ముంబై వల భార్యతో విభేతాలు తలెత్తడంతో దర్శకుడు కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ముంబైకి మకాం మార్చాడు సుశీల్ కుమార్. ‘ముంబైలో నాకు సన్నిహితులైన గీత రచయితలతో రోజుల తరబడి మంతనాలు జరిపాను. రూమ్‌లో ఉంటూ రోజంతా సినిమాలు చూసేవాడిని. పుస్తకాలు చదివాను. ఇలా ఆరు నెలల కాలం గడిపేశాను. అప్పుడే రోజుకో ప్యాకెట్ సిగరెట్లు కాల్చేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత మూడు స్క్రిప్ట్‌లు రాశాను. ఒక ప్రొడక్షన్ హౌస్ నా స్క్రిప్ట్‌లకు 20 వేల రూపాయలు కూడా ఇచ్చింది. కొంత కాలం తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి. దాంతో ముంబై నుంచి మా ఊరికి తిరిగి వచ్చి టీచర్‌గా ఉద్యోగం సంపాదించాన’ని తెలిపాడు. ఇప్పుడంతా హ్యాపీ! ‘ముంబైలో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపిన తర్వాత నాకు విషయం బోధపడింది. ఫిల్మ్ మేకర్ కావడానికి ముంబై రాలేదని.. సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చానని అర్థమయింది. మనసుకు నచ్చిందే చేయాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. వెంటనే మా ఊరికి తిరిగి వచ్చి టీచర్ ఉద్యోగానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మొత్తానికి జాబ్ సాధించాను. మందు, సిగరెట్ మానేశాను. పర్యావరణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి రోజు నాకు పండగలా గడుస్తోంది. తిండికి లోటు లేకుండా సంపాదిస్తే చాలు అనుకుంటున్నాను. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి నా వంతు సాయం చేస్తూనే ఉంటాన’ని సుశీల్ కుమార్ ముగించాడు. సో.. సొమ్ములు సంపాదించడమే కాదు.. సవ్యంగా ఖర్చు పెట్టడం తెలియాలని సుశీల్ లైఫ్ స్టోరీ కళ్లకు కడుతోంది! -
కేబీసీలో దీపికా, ఫరా సందడి: మాంచి మ్యూజికల్ ట్రీట్
సాక్షి, ముంబై: హిందీలో పాపులర్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ హవా మామూలుగా లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో ప్రస్తుత సీజన్లో కూడా అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతోంది. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్-13లో రానున్న ఎపిసోడ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, న్యత్య దర్శకురాలు ఫరా ఖాన్ సందడి చేయనున్నారు. ముఖ్యంగా రానున్న గణేష్ చతుర్థి సందర్భంగా (శుక్రవారం, సెప్టెంబరు 10) ప్రసారం కానున్న ఎపిసోడ్లో దీపికా, ఫరా ఖాన్ ఈ షోలో హంగామా చేయనున్నారు. తనదైన శైలిలో ఫరా పంచ్‌లు విసురుతోంటే దీపిగా పగలబడి నవ్వుతూ అభిమానులకు కనువిందు చేసింది. ఈ సందర్భంగా అమితాబ్ హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చదవండి : బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్యక్రమంలో మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, విన్నర్ పవన్ దీప్ రాజన్, అరుణితా కంజిలాల్ తమ మ్యూజికల్ ట్రీట్‌తో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. అలాగే పవన్ దీప్ కూడా దీన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రానున్న ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చదవండి : కోటి రూపాయలను తలదన్నే కథ View this post on Instagram A post shared by Pawandeep Rajan (@pawandeeprajan) -
కోటి రూపాయలను తలదన్నే కథ
ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల టీచర్ హిమానీ బుందేలాకు ‘కెబిసి 13’ సీజన్లో కోటి రూపాయలు వచ్చాయి. ఈ సీజన్‌కు తొలి విజేత ఆమే. చూపు లేకపోయినా ఆమె కోటి గెలిచింది. అది కాదు సంగతి. 15 ఏళ్ల వయసులో పూర్తిగా చూపు కోల్పోయినా జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకోవడంలో హిమానీ ‘దృష్టికోణం’ ఎంతో ముఖ్యమైనది. ‘నాకు దృష్టి లేదు నిజమే. దృష్టి కోణం ఉంది’ అని అంటున్న హిమాని మనకు ప్రసాదిస్తున్న దృష్టికోణం ఏమిటి? ఆగస్టు 30, 31 తేదీల్లో ప్రసారమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 13 ఎపిసోడ్స్ మీరు చూశారా? ఆ ఎపిసోడ్స్‌లో విశేషం ఏమిటంటే హిమానీ బుందేలా కోటి రూపాయల ప్రైజ్ గెలిచింది. ఆ తర్వాత 7 కోట్ల ప్రశ్న వరకూ వెళ్లింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం డౌట్‌గా ఉండేసరికి గేమ్‌ను క్విట్ చేసి కోటి రూపాయలతో ఇల్లు చేరింది. క్లుప్తంగా ఆ రెండు ఎపిసోడ్ల సారాంశం ఇది. కాని ఇది చెప్పడానికి ఈ కథనం రాయడం లేదు. హిమానీ బుందేలాను పరిచయం చేయడానికి రాస్తున్నాము. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13’లో కోటి రూపాయలను గెలిచిన తొలి విజేత, ఇప్పటి వరకూ అన్ని సీజన్లలో కోటి రూపాయలు గెలిచిన తొలి అంధ విజేత కూడా హిమానీ బుందేలానే. కాని ఈ విజయం ఆమెకు అదాటున రాలేదు. ఇప్పుడు ఆమె జీవిస్తున్న జీవితం కూడా అదాటున రాలేదు. చాలామంది ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆమె నవ్వు నుంచి రాలిపడే నక్షత్రాల్లాంటివి మన నవ్వులో ఎందుకు లేవు అని తరచి చూసుకోవాల్సి ఉంది. అమితాబ్‌తో హిమాని, గాయకుడు జుబిన్‌తో హిమానీ ఐదుగురిలో ఒక్క అమ్మాయి హిమానీ బుందేలాది ఆగ్రా. ఐదుగురు సంతానంలో ఆమె పెద్దది. తండ్రి విజయ్‌సింహ్ ప్రయివేటు ఉద్యోగి. తల్లి సరోజ్ గృహిణి. పిల్లలను చదివించుకోవడమే ఆ తల్లిదండ్రులకు పెద్ద విషయం. ఈ సంగతి గ్రహించిన హిమానీ తొమ్మిది, పది తరగతులు చదివేప్పటి నుంచే ఇంట్లో ట్యూషన్లు మొదలెట్టింది. ఆమె పాఠాలు చెప్పే తీరు హుషారుగా ఉండేది. అందుకని పిల్లలు ఆమె దగ్గర ట్యూషన్ కోసం పరిగెత్తే వారు. అయితే హిమానీకి ముందు నుంచి కంటి సమస్య ఉంది. రెటినా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అందుకని ఆమెను ఆడొద్దని, పరిగెత్త వద్దని, గట్టి దెబ్బ తగిలి ఒళ్లు అదిరేలా చూసుకోవద్దని చెప్పేవారు. దాంతో హిమానీ భయం భయంగా ఉండేది. కాని భయపడుతున్నట్టే జరిగింది. టెన్త్ క్లాస్‌లో ఉండగా ఆమె సైకిల్ మీద వెళుతూ ప్రమాదానికి లోనయ్యి రోడ్డు మీద పడిపోయింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆమెకు కంటి చూపు తగ్గ సాగింది. డాక్టర్లు పరీక్షించి రెటీనా పూర్తిగా కదిలిపోయిందని చెప్పారు. సర్జరీలు చేయాలన్నారు. ఇది 2012లో. మూడు సర్జరీలు అయ్యాయి. చూపు కొద్దిగా వచ్చింది. ఇంకా బాగా వస్తుందేమోనని నాలుగో సర్జరీ చేశారు. కాని ఫెయిల్ అయ్యింది. చూపు పూర్తిగా పోయింది. 15 ఏళ్ల ఉత్సాహపూరితమైన అమ్మాయి హిమానీ. ఇప్పుడు పూర్తిగా అంధురాలిగా మారింది. ఏం చేయాలి? ఆరు నెలలు హిమానీ నవ్వు మర్చిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు తీవ్రమైన బెంగలో పడిపోయారు. ఇక హిమానీ జీవితంలో ఏదీ చేయలేదని నిరాశలో కూరుకుపోయారు. కాని హిమానీ మెల్లమెల్లగా తన శక్తుల్ని కూడగట్టుకుంది. ట్యూషన్లు తిరిగి మొదలెట్టింది. ఒకప్పుడు ఈ ‘అక్క’ చూసి పాఠాలు చెప్పేది. ఇప్పుడు ఎలా చెబుతుంది? అయినా సరే పిల్లలు ఆమె దగ్గరకు వచ్చేవారు. పిల్లల చేతే పాఠాలు చదివించి వారికి ఆ పాఠాలు విడమర్చేది. ఎక్కడా ఏ కన్ఫ్యూజనూ ఉండేది కాదు. ఆమె మేథమెటిక్స్‌లో దిట్ట. ఆ లెక్కలు కూడా నోటి మాటగా వివరించేది. కనపడకపోయినా నోట్స్ మీద రాసి చూపించేది. ట్యూషన్లు తిరిగి మొదలయ్యాయి. చదువు కూడా కొనసాగించాలనుకుంటే అంధ విద్యార్థి కనుక ఇంటర్ సీటు ఇవ్వడానికి ఏ కాలేజీ ముందుకు రాలేదు. లక్నోలోని ‘డాక్టర్ శకుంతల మిశ్రా రిహాబిలిటేషన్ యూనివర్సిటీ’లో దివ్యాంగ విద్యార్థులను మామూలు విద్యార్థులతో కలిపి చదివిస్తారని తెలిసి అక్కడకు వెళ్లి అడ్మిషన్ తీసుకుంది. ‘అంత వరకూ జీవితంలో చూపు కోల్పోతాననే భయం ఉండేది. చూపు కోల్పోయాక ఇక భయం దేనికి. జీవితాన్ని హాయిగా జీవించాలి అనుకున్నాను. లోపాన్ని, వెలితిని పక్కకు పెట్టి సంతోషంగా జీవించాలనే దృష్టికోణం నాకు అలవడింది’ అంటుంది హిమానీ. డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి కేంద్రీయ విద్యాలయలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంది. ‘మా ఇంట్లో నాదే తొలి ప్రభుత్వ ఉద్యోగం’ అంటుందామె. కౌన్ బనేగా కరోడ్‌పతిలో... హిమానీకి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొనాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకునేది. ప్రిపేర్ అయ్యేది. కాని ఈ సీజన్లో మాత్రం ఆమెకు చాన్స్ వచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న అమితాబ్ ఎవరి దగ్గరకూ రాకపోయినా ఆమెను చేయి పట్టుకుని నడిపించి హాట్సీట్లో కూచోబెట్టాడు. మంచినీళ్లు ఆఫర్ చేశాడు. అంతే కాదు కోటి రూపాయలు వస్తే ఎంతో సంతోషించాడు. ఆ ఎపిసోడ్‌లోనే హిమానీ తనకు గాయకుడు జుబిన్ నోటియాల్ ఇష్టమని చెప్తే జుబిన్ ముంబై నుంచి ప్రత్యేకంగా ఆగ్రా వచ్చి ఆమెను ఇంట్లో కలిసి గొప్ప సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇవాళ ఆమె స్ఫూర్తి హిమానీ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా మారింది. కంటి ఎదుట పూర్తిగా చీకటే ఉన్నా ఆమె ఆత్మవిశ్వాసంతో నవ్వుతో అనుకున్నది సాధించడం అందరూ మెచ్చుకుంటున్నారు. ‘నా బహుమతి మొత్తం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్ ఏర్పాటుకు వెచ్చిస్తాను’ అని హిమానీ చెప్పింది. జీవితంలో కోటి రూపాయలు సంపాదించే అవకాశం చాలామందికి రావచ్చు. కాని జీవితం అంధకారమై భవిష్యత్తు ఒక ప్రశ్నగా మారినప్పుడు దానికి సమాధానం చెప్పగలగడం అనేక కోటిరూపాయలను తలదన్నడంతో సమానం అవుతుంది. హిమానీ నిజంగా ఈ కాలపు ఒక గొప్ప సమాధానం.