బాలివుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati)లో హర్షవర్ధన్ నవాతే తొలి కోటీశ్వరుడిగా చరిత్ర సృష్టించి 25 ఏళ్లు అయింది. 2000లో తన విజయం ఆయన జీవితాన్ని మార్చడమే కాకుండా దేశం వ్యాప్తంగా అనేక మందికి కేబీసీ వేదిక అయ్యేందుకు తోడ్పడింది. ప్రస్తుతం హర్షవర్ధన్ కార్పొరేట్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ప్రభావవంతమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
కెరీర్ ప్రయాణం ఇలా..
కేబీసీలో అద్భుత విజయం తర్వాత హర్షవర్ధన్ జీవితం నాటకీయ మలుపు తిరిగింది. మొదట్లో ఐఏఎస్(IAS) కావాలనుకున్న ఆయన కేబీసీలో విజేతగా నిలిచిన తర్వాత తన దృష్టిని కార్పొరేట్ రంగం వైపు మళ్లించారు. మహీంద్రా గ్రూప్‌తో సహా ప్రఖ్యాత సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటీ హెడ్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. అంకితభావం, వ్యూహాత్మక దార్శనికత ఆయనకు పరిశ్రమలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా..
డిసెంబర్ 2024లో హర్షవర్ధన్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సామాజిక అభివృద్ధి విభాగమైన జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ విభాగంలోని ఇతర కమ్యూనిటీలకు సాధికారత కల్పించేందుకు, దేశం అంతటా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి సంస్థ విధానాలను పాటిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
వ్యక్తిగత జీవితం
హర్షవర్ధన్ భార్య సారిక, ఇద్దరు కుమారులతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బిజీ ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నప్పటికీ తాను సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ అప్పటి కేబీసీ విజయంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ‘ఆ విజయం నా జీవితంలో మరవలేనిది. నేనీ స్థానంలో ఉన్నానంటే ఆ కార్యక్రమం వల్లే’అని చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రజల నుంచి తనకు లభిస్తున్న గుర్తింపు, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. క్విజ్ షో కంటెస్టెంట్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా హర్షవర్ధన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment