Quiz
-
కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?
బాలివుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati)లో హర్షవర్ధన్ నవాతే తొలి కోటీశ్వరుడిగా చరిత్ర సృష్టించి 25 ఏళ్లు అయింది. 2000లో తన విజయం ఆయన జీవితాన్ని మార్చడమే కాకుండా దేశం వ్యాప్తంగా అనేక మందికి కేబీసీ వేదిక అయ్యేందుకు తోడ్పడింది. ప్రస్తుతం హర్షవర్ధన్ కార్పొరేట్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ప్రభావవంతమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.కెరీర్ ప్రయాణం ఇలా..కేబీసీలో అద్భుత విజయం తర్వాత హర్షవర్ధన్ జీవితం నాటకీయ మలుపు తిరిగింది. మొదట్లో ఐఏఎస్(IAS) కావాలనుకున్న ఆయన కేబీసీలో విజేతగా నిలిచిన తర్వాత తన దృష్టిని కార్పొరేట్ రంగం వైపు మళ్లించారు. మహీంద్రా గ్రూప్‌తో సహా ప్రఖ్యాత సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటీ హెడ్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. అంకితభావం, వ్యూహాత్మక దార్శనికత ఆయనకు పరిశ్రమలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా..డిసెంబర్ 2024లో హర్షవర్ధన్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సామాజిక అభివృద్ధి విభాగమైన జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ విభాగంలోని ఇతర కమ్యూనిటీలకు సాధికారత కల్పించేందుకు, దేశం అంతటా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి సంస్థ విధానాలను పాటిస్తానని హామీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial)ఇదీ చదవండి: నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీవ్యక్తిగత జీవితంహర్షవర్ధన్ భార్య సారిక, ఇద్దరు కుమారులతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బిజీ ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నప్పటికీ తాను సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ అప్పటి కేబీసీ విజయంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ‘ఆ విజయం నా జీవితంలో మరవలేనిది. నేనీ స్థానంలో ఉన్నానంటే ఆ కార్యక్రమం వల్లే’అని చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రజల నుంచి తనకు లభిస్తున్న గుర్తింపు, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. క్విజ్ షో కంటెస్టెంట్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా హర్షవర్ధన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది. -
ఆర్బీఐ క్విజ్.. రూ.10 లక్షలు బహుమతి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కళాశాల విద్యార్థులకు ‘ఆర్బీఐ90క్విజ్’ పేరుతో ఈ పోటీలు ప్రారంభించింది.విద్యార్థులలో రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు దశల్లో ఉంటాయి. మొదట ఆన్లైన్లో దశతో ప్రారంభమై స్టేట్, జోనల్, ఫైనల్ దశల్లో పోటీలు జరుగుతాయి. జనరల్ అవేర్నెస్పై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. క్విజ్ సెప్టెంబర్‌లో జరుగుతుంది.ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. స్టేట్ లెవెల్లో మొదటి బహుమతి రూ.2లక్షలు, రెండో ప్రైజ్ రూ.1.5 లక్షలు, మూడో బహుమతి రూ.1లక్ష ఉంటుంది. అదే జోనల్ స్థాయిలో వరుసగా రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున బహుమతులు ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే ఫైనల్ రౌండ్లో విజేతలకు మొదటి బహుమతి రూ.10 లక్షలు, రెండో ప్రైజ్ రూ.8లక్షలు, మూడో బహుమతి కింద రూ.6 లక్షలు అందజేస్తారు. -
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్‌ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్‌లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
స్వాతంత్య్ర దినోత్సవం: క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు నగదు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: భారత్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తుంది.విద్యార్థులు క్విజ్, జనరల్ ఎస్సే, Art/ Drawing లలో పాల్గొనవచ్చును. ☛ క్విజ్ పోటీ : http://special.sakshi.com/independence_day_quiz/ ఈ లింక్ ద్వారా క్విజ్ పోటీలో పాల్గొనాలి. ఈ క్వీజ్‌లో పాల్గొనే అవకాశం.. ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ☛ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'టెక్నాలజీ' ఎలా అభివృద్ధి చెందింది? అనే అంశం పై ఒక జనరల్ ఎస్సేను, అలాగే Independenceకి సంబంధించిన Art/ Drawing ని 9010050984 నెంబర్‌కు వాట్సప్ (లేదా) sakshieduinfo@gmail.comకి పంపండి. ఈ పోటీలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి పూర్తి ఉచితంగా రాయవచ్చును. మీరు జనరల్ ఎస్సే, Art/ Drawingని పంపాల్సిన చివరి తేదీ ఆగస్టు 15, 2023. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వబడును. అలాగే పోటీలో పాల్గొన్న అందరికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. విజేతల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.comలో ప్రచురిస్తాము. ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే మీ తెలివికి పదును పెట్టండి.. నగదు బహుమతి పొందండి. ఆల్ ది బెస్ట్.. -
క్విజ్ క్వశ్చన్స్! గెహ్లాట్,పైలట్ చేతులు కలిపినట్టేనా? టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి
క్విజ్ క్వశ్చన్స్! రాజస్తాన్‌లో గెహ్లాట్,పైలట్ చేతులు కలిపినట్టేనా? టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? 2024లో కాంగ్రెస్... -
సాక్షి 15 ఏళ్ల పండగ: ఆన్లైన్ క్విజ్ విజేతల వివరాలు ఇవే!
సాక్షి దినపత్రిక 15ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట ప్రవేశించిన శుభతరుణంలో పాఠకుల కోసం ఒక క్విజ్ నిర్వహించింది. ఆరు రోజుల పాటు ఆరు ప్రశ్నలను ఆన్లైన్లో అడిగింది. వందలాది మంది పోటీ పడ్డ ఈ క్విజ్‌లో అన్ని ప్రశ్నలకు పది మంది మాత్రం సరైన సమాధానాలు చెప్పి విజేతలుగా నిలిచారు. క్విజ్‌లో గెలుపొందిన వారి వివరాలు 1. పి. నిర్మలా స్వరూప రాణి, వృత్తి: గృహిణి, చిరునామా: లక్ష్మణ రావు పల్లి వీధి, ఆత్మకూరు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్, ఆంధ్రప్రదేశ్ 544322. 2. టి. రాంబ్రహ్మా చారి, వృత్తి: ప్రైవేటు ఉద్యోగి, చిరునామా: పిల్లిచిన్నకృష్ణ తోట, ఖమ్మం, తెలంగాణ 507003. 3. పంట నరసింహులు, వృత్తి : జిరాక్స్ వ్యాపారం, చిరునామా : నూకినేనిపల్లె గ్రామం, నందలూరు, వై.యస్.ఆర్ కడప,ఆంధ్రప్రదేశ్ 516151 4. మిన్నంరెడ్డి అంకిత, చిరునామా :పీలేరు గ్రామం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్ 517214 5. కె సతీష్ బాబు, చిరునామా : ఇందిరానగర్ గ్రామం, వై.యస్.ఆర్ కడప,ఆంధ్రప్రదేశ్ 516004 6. దేరంగుల దేవి, వృత్తి :గృహిణి, చిరునామా: పులివెందుల గ్రామం, వై.యస్.ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్ 516390 7. బాలనాగు సంతోష్ కుమార్, వృత్తి ప్రైవేట్ ఉద్యోగం, చిరునామా : న్యూ నాగోల్,రోడ్ నెంబరు-6, అలకాపురి, హైదరాబాద్-500035 8. M.రాధ, వృత్తి: గృహిణి, చిరునామా :2-887, ప్రశాంతి నగర్-2, పీలేరు పోస్ట్, చిత్తూరు రోడ్, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్-517214 9. గుడి ఉమా మహేశ్వరి, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, చిరునామా: చింతల్,భగత్‌సింగ్ నగర్,రంగారెడ్డి జిల్లా,హైదరాబాద్-500054 10. వర చిట్టిరాజు, వృత్తి: డ్రైవర్, చిరునామా: రాజీవ్ కాలనీ, కొవ్వూరు, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్-534350 -
అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువికా–2022 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువ పెంచుకోవడం కోసం రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించి దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్‌లలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేయండిలా.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతిదశలో జాగ్రత్తగా వివరాలు నమోదుచేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.యువికా–2022 కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్విజ్ సూచనలు చదివి ఈ–మెయిల్ క్రియేట్ చేసిన 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. క్విజ్ అప్లోడ్ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్‌లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదుచేయాలి. అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుదిజాబితా అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతుంది. రాష్ట్రానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున అవకాశం కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు వీరే.... ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్‌లలో సభ్యుడై ఉండాలి. -
కేబీసీలో.. కేటీఆర్? విషయం ఏమిటంటే?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికరంగా వార్తల్లో నిలిచారు. సాధారణంగా కోవిడ్ బాధితులు, ఇతర సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ అభినందనలు అందుకునే కేటీఆర్ పాపులర్ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి -13లో అనూహ్యంగా చోటు సంపాదించుకున్నారు. అయితే ఆయన పార్టిసిపెంట్‌గా అనుకుంటే మాత్రం.. మీరు పొరబడినట్టే.. విభిన్న అంశాలపై స్పందించే ఆయన ట్వీట్ కేబీసీలో ఒక ప్రశ్నగా రావడం విశేషంగా నిలిచింది. ఇపుడు ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో కేటీఆర్ ట్వీట్‌ను కేబీసీ షో నిర్వాహకులు పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ హాజరైన ఎపిసోడ్లో కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్‌ని ప్రశ్నగా సంధించారు హాట్ సీట్లో ఉన్న అమితాబ్. దీనిపై స్వయంగా కేటీఆర్ కూడా ఒకింత ఆశ్చర్యాన్ని, మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదో సరదాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ట్విటర్లో షేర్ చేసి.. వీటిని సరిగ్గా పలికే వారున్నారా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని వెనుక కచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుందని చమత్కరిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్‌ని ట్యాగ్ చేశారు. ఆ ట్వీటే కేబీసీలో ప్రశ్నగా మారింది. కేటీఆర్ ఈ ట్వీట్‌ను ఎవరికి ట్యాగ్ చేశారంటూ కేబీసీలో అమితాబ్ ప్రశ్నించారు. సమాధానాల్లోని నాలుగు ఆప్షన్స్‌గా కపిల్ సిబల్, సుబ్రమణ్యస్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ పేర్లను ఇచ్చారు. దీనిపై సౌరవ్ గంగూలీ, చాలా స్మార్ట్‌గా ఆలోచించి శశిథరూర్ అని చెప్పారు. ఇంగ్లీష్‌పై పట్టు అంటే రాజకీయ వర్గాల్లో ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది పేరు శశి థరూర్. Rs.40000 worth question 👇🏾 pic.twitter.com/GlT0T5UjNz — krishanKTRS (@krishanKTRS) September 3, 2021 Would you like to answer this question asked in KBC today @KTRTRS garu ? pic.twitter.com/QPmZPVnqvD — krishanKTRS (@krishanKTRS) September 3, 2021 Ain’t this hilarious @ShashiTharoor ! Just a tongue-in-cheek comment apparently made it to KBC 😁 Hope Dada and Sehwag got it right https://t.co/y6VsC9lFEg — KTR (@KTRTRS) September 3, 2021 I suspect @ShashiTharoor Ji Pakka has a role to play in this 👇 https://t.co/zO024Pq0Oa — KTR (@KTRTRS) May 20, 2021 -
అమెజాన్ క్విజ్: రూ.10వేలు గెలుచుకోండి!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి (మార్చి 22) క్విజ్ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పిన వారు రూ.10వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన విజేతలను రేపు ప్రకటిస్తారు. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. అమెజాన్ డైలీ క్విజ్; అదృష్టం హాయ్ చెబితే.. -
అమెజాన్ డైలీ క్విజ్; అదృష్టం హాయ్ చెబితే..
అమెజాన్‌లోకి వెళితే... విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న బేతాళుడి గొంతు నుంచి ‘ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయావో’ లాంటి గట్టి వార్నింగ్ వినిపించదు. తల వెయ్యివక్కలు అయ్యే ప్రసక్తే లేదు. కానీ... కనిపించే ప్రశ్నలకు కచ్చితంగా కచ్చితమైన సమాధానం చెప్పాలనే గట్టి పట్టుదల మాత్రం పెరుగుతుంది. వెయ్యిదారులు వెదికి అయినా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపిస్తుంది. పదండీ... ఒకసారి అమెజాన్ డైలీ క్విజ్‌లోకి వెళ్లొద్దాం... అడిగేవారికి చెప్పేవారు లోకువ కాదు ఇప్పుడు.. చెప్పాలంటే లోకజ్ఞానులు, బహుమతి అందుకునే విజేతలు. బాలీవుడ్ నుంచి సీఫుడ్ వరకు, జానీవాకర్ నుంచి జాన్అబ్రహం వరకు.. రకరకాల ప్రశ్నలకు జవాబులు చెబితే సమాధానం చెప్పిన సంతృప్తి మాత్రమే కాదు అదృష్టం హాయ్ చెబితే మంచి మంచి బహుమతులు కూడా ఆన్లైన్ క్విజ్‌లలో సొంతం చేసుకోవచ్చు. కాస్త సరదా కోసమో, ప్రచార వ్యూహంలో భాగంగానో అమెరికన్ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ‘డైలీ క్విజ్’ ప్రారంభించింది. ఇది ఎంత క్లిక్ అయిందంటే రకరకాల సైట్లతో పాటు కొన్ని పత్రికలు కూడా ‘అమెజాన్ క్విజ్ ఆన్సర్లు ఇవే’ అంటూ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నాయి. ఎలా వెళ్లాలి? స్టెప్ 1 గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి అమెజాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. స్టెప్ 2 హోమ్‌పేజీలోకి వచ్చిన తరువాత: అమెజాన్ యాప్–ఆఫర్స్–క్లిక్ ఆన్ అమెజాన్ క్విజ్ 8ఎయం టు 12 పీఎం. స్టెప్ 3 అమెజాన్ క్విజ్ బ్యానర్లో ‘స్టార్ట్’ బటన్ నొక్కడంతో క్విజ్ మొదలవుతుంది. స్టెప్ 4 ఇక్కడ కనిపించే అయిదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానం ఇస్తే ‘అమెజాన్ క్విజ్ విన్నర్స్ లక్కీ డ్రా’కు ఎంపిక అవుతారు. స్టెప్ 5 ప్రకటన తేదీలో విజేతల జాబితా ఇవ్వబడుతుంది. ఐఫోన్, సోనీ పోర్టబుల్ పార్టీ సిస్టం, ఫాజిల్ స్మార్ట్‌వాచ్, శాంసంగ్ గెలాక్సీ నోట్... కొన్నిసార్లు ఇలా ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. గత నెలల విజేతల పేర్ల జాబితా కూడా చూడవచ్చు. ‘అమెజాన్ క్విజ్‌లో మీరు ఎందుకు గెలవలేకపోయారు?’లాంటి వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఎక్కుగానే కనిపిస్తాయి. అయితే మొదట్లో గిఫ్ట్ కోసమే అమెజాన్ క్విజ్‌లోకి ప్రవేశించినా ఆ తరువాత మాత్రం అదొక ముఖ్య విషయం కాని పరిస్థితి వస్తుంది. డైలీ పజిల్ సాల్వ్ చేయడంలాగే ఇదొక దినచర్యగా మారుతుంది చాలామందికి. అమెజాన్ మాత్రమే కాదు ఇండియన్ ఇ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలు కూడా ఆన్లైన్ ‘క్విజ్’ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. మరోవైపు క్విజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (క్యూఎఫ్ఐ)లాంటి సంస్థలు కాలానికి తగ్గట్టు జూమ్, డిస్కార్డ్ (ఇన్స్టంట్ మెసేజింగ్ అండ్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్)లలో క్విజ్ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ‘మనకేం తెలుస్తుందిలే...అనుకొని ఒకప్పుడు క్విజ్ అనే మాట వినబడగానే దూరంగా జరిగేవారు. కాని ఆన్లైన్ స్పేస్‌లో మాత్రం దీనికి అనూహ్యమైన ఆదరణ ఉంది. లైవ్ క్విజ్‌లలో జవాబు ఇవ్వడానికి ఏ ఆధారం ఉండదు. ఆన్లైన్లో మాత్రం గూగుల్‌లాంటి వాటిపై ఆధారపడే వెసులుబాటు ఉంటుంది’ అంటున్నారు క్యూఎఫ్ఐ సెక్రెటరీ జయకాంతన్. సరే, ఏదో ఒకటి. మొత్తానికైతే దూరంగా ఉండే వాళ్లు సైతం క్విజ్ కాంటెస్ట్‌ల వైపు ఆకర్షితులు కావడం శుభసూచన. ఆన్లైన్ క్విజ్‌తో ప్రయోజనాలు 1 మైండ్ ఫిట్‌గా ఉంటుంది 2 ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తాం. 3 టైమ్మెనేజ్మెంట్ తెలుస్తుంది 4 జ్ఞాపకశక్తికి ఎక్సర్‌సైజ్‌లా ఉపకరిస్తుంది. 5 క్వశ్చన్ బ్యాంకు తయారుచేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది. చదవండి: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్! టిక్‌టాక్ తో ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు -
కనుక్కోండి చూద్దాం
2020లో కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని లాక్ చేసింది కరోనా. థియేటర్లు లాక్ అవ్వడంతో ఓటీటీలో సినిమాలు విడుదలయ్యాయి. ఈ కరోనా లాక్డౌన్లో విడుదలైన ఆ చిత్రాల్లో కొన్నింటి గురించి క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1481339603.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1491339603.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమెజాన్ క్విజ్: ఈ 25వేలు మీ సొంతం!
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజు క్విజ్ నిర్వహిస్తుంది. ఎవరైతే ఈ క్విజ్‌లో పాల్గొని సరైన సమాధానాలు చెబుతారో వారికీ బహుమతులను కూడా అందిస్తుంది. నేడు కూడా ఒక క్విజ్ తన యాప్ లో ఉంచింది. ఈ క్విజ్ లో పాల్గొన్న వారిలో ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వారు 25వేల రూపాయలను అమెజాన్ పే బ్యాలన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, ఈ క్విజ్ ప్రతి రోజు ఉదయం 8 నుండి 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. నేడు జరిగిన క్విజ్ విన్నర్ వచ్చేసి యూసఫ్ ట్రావడి(Yousuf Travadi) 25వేల రూపాయల బహుమతిని గెలుచుకున్నారు. ఇలా ప్రతి రోజు నిర్వహించే క్విజ్ లో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. దీని కోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో క్విజ్ తో పాటు ఇతర ఉత్పతులకు చెందిన విలువైన బహుమతులను గెలుచుకోవచ్చు.(చదవండి: 12వేలకే ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ టీవీ) అమెజాన్ క్విజ్ ప్లే ఎలా? స్టెప్ 1: మొదట మీరు అమెజాన్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2: మీకు అమెజాన్ ఖాతా ఉంటె సైన్ ఇన్ చేయండి.(లేకపోతె కొత్త ఖాతాను రిజిస్టర్ చేయండి) స్టెప్ 3: అమెజాన్ క్విజ్‌కు ఎలా వెళ్ళాలి? హోమ్‌పేజీకి వెళ్లి అమెజాన్ యాప్> ఆఫర్లు> అమెజాన్ క్విజ్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉండే ఆప్షన్ క్లిక్ క్లిక్ చేయండి. స్టెప్ 4: అమెజాన్ క్విజ్ పేజీకి వెళ్ళడానికి మరొక మార్గం మెను> ప్రోగ్రామ్‌లు మరియు ఫీచర్స్> ఫన్జోన్పై క్లిక్ చేయండి. స్టెప్ 5: ఇప్పుడు అమెజాన్ క్విజ్ బ్యానర్ క్లిక్ చేసి, “స్టార్ట్” బటన్ నొక్కడం ద్వారా మీరు క్విజ్ లో పాల్గొంటారు. స్టెప్ 6: బహుమతులు గెలుచుకోవడానికి మీరు డైలీ అమెజాన్ క్విజ్‌లో ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలి. స్టెప్ 7: నేటి అమెజాన్ క్విజ్ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చిన తరువాత, మీరు అమెజాన్ క్విజ్ విజేతల లక్కీ డ్రాకు అర్హులు అవుతారు. స్టెప్ 8: అమెజాన్ క్విజ్ లక్కీ డ్రా విజేతలను విజేతల జాబితా ప్రకటనలో చెప్పిన తేదీ నాడు ప్రకటిస్తారు. -
మహమ్మారి గురించి మీకేం తెలుసు!?
న్యూఢిల్లీ: గత 9 నెలలుగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటివరకు 9,88,576 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 75 లక్షల మంది వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిలో 63,402 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమవారు ప్రాణాలతో తిరిగిరావాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక కంటికి కనిపించని కరోనా వైరస్ దెబ్బతో ఇదీ అదీ అని కాకుండా అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈక్రమంలో చైనాలోని వుహాన్ నగరంలో ఓ ల్యాబ్ నుంచి పుట్టుకొచ్చినట్టు భావిస్తున్న కోవిడ్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలపై మీకో క్విజ్! (చదవండి: త్వరలో రష్యా ప్రజలకు కరోనా టీకా) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1421317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1431317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1441317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1451317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మీకు సైబర్ సేఫ్టీ తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మీరు ఎలాంటి పాస్వర్డ్స్ వాడుతున్నారు? ఆన్లైన్లో మీరు ఎంతమేరకు సురక్షితంగా ఉన్నారు? మీరు వ్యవహరించే తీరుతో మీకు ఎంతమేరకు భద్రత ఉంది? తదితర అంశాలపై విద్యార్థులు, మహిళల కోసం ‘విమెన్‌సేఫ్టీ వింగ్’ప్రత్యేక క్విజ్ చేపట్టింది. ఆన్లైన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సురక్షిత సైబర్ వాతావరణం కోసం, వేధింపుల నివారణ కోసం మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో ‘సైబ్హర్’(సైబర్ సేఫ్టీ ఫర్ హర్) అవగాహన ప్రాజెక్టులో భాగంగా గురువారం విద్యార్థులు, మహిళల కోసం క్విజ్ నిర్వహించారు. ఇందులో పాల్గొనే వారు ముందుగా సైబ్హర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తరువాత మీకో ఐడీ ఇస్తారు. తరువాత 15 అంశాల ప్రశ్నావళికి జవాబులివ్వాలి. వీటికి విజయవంతంగా సమాధానం చెప్పిన వెంటనే మీకు ఆన్లైన్లో విజ్ఞానం ఉంది? ఏయే అంశాల్లో మీరు మెరుగుపడాలో అని వాటిని చూపిస్తుంది. వెంటనే మిమ్మల్ని అభినందిస్తూ డిజిటల్ సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇందు లో ఐడీ క్రియేట్ చేసుకున్నాక.. ఈ నెల మొత్తం ఆన్లైన్లో నిర్వహించే ప్రతీ పోటీలోనూ పాల్గొనవచ్చు. ఇందులో భాగంగా గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు, టీచర్లు, ఎన్జీవోలు, విద్యావేత్తలకు ఈ క్విజ్ పోటీ రిక్వెస్టులు పంపారు. తొలిరోజు సాయంత్రానికి దాదాపు 6వేలమందికిపైగా ఈ సర్టిఫికెట్ కోర్సులో పాల్గొనడం విశేషం. -
ఈ అవకాశాన్ని పొందండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించే క్విజ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ క్విజ్‌లోని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పద్మ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ‘వివిధ రంగాల్లో కృషి చేసే వ్యక్తులకు ఏటా ఇచ్చే పద్మ అవార్డ్స్ పదానోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించే క్విజ్ ఇది’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. అందులో పాల్గొని అవకాశాన్ని పొందాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది దాదాపు 140 పద్మ అవార్డులను ఇవ్వనున్నారు. mygov.in వెబ్సైట్లో హిందీలో 20 ప్రశ్నలతో పొందుపరిచిన లింక్‌ను తన ట్వీట్‌కు ప్రధాని మోదీ జత చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ క్లిక్ చేసి క్విజ్‌లో పాల్గొవచ్చు. (చదవండి: రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుపైనా పరిమితి?) Every year, several grassroots level achievers are honoured with Padma Awards. Their life journeys inspire many. Here is a unique quiz competition, the Padma Quiz which gives you an opportunity to witness the Padma Awards ceremony at Rashtrapati Bhavan.https://t.co/J2XksCDyF0 pic.twitter.com/5XCa7Hkq43 — PMO India (@PMOIndia) March 9, 2020 -
క్విజ్ యాప్‌లపై ఫేస్బుక్ నిషేధం
శాన్ఫ్రాన్సిస్కో: యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే దిశగా సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్ఫామ్లో యూజర్ల వ్యక్తిత్వంపై క్విజ్‌లను నిర్వహించే యాప్‌లను నిషేధిస్తున్నామని తెలిపింది. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా సేకరించేలా ఉన్న యాప్‌లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వీటితోపాటు పలు అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ల(ఏపీఐ)ను తొలగిస్తున్నామనీ, కంపెనీ విధానాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని ఫేస్బుక్ పేర్కొంది. కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి 8.7 కోట్ల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సమాచారాన్ని వాడుకున్నట్లు తేలడంతో ఫేస్బుక్ పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది. -
ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మీడియా మాజీ అధిపతి ఇంద్రాణి ముఖర్జియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ మేరకు ఇంద్రాణి ముఖర్జియాను రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి స్పెషల్ జడ్జి సునీల్ రాణా అప్పగించారు. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్లు షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో నడిచిన ఐఎన్ఎక్స్ మీడియా(ప్రస్తుతం 9ఎక్స్ మీడియా)కి విదేశీ పెట్టుబడుల ప్రొమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ కోసం 2007 సంవత్సరంలో కార్తీ చిదంబరం రూ.3.5 కోట్లు అక్రమంగా వసూలు చేశాడని, ఆ డబ్బులను తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని సీబీఐ 2017 మేలో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కార్తి చిదంబరం తోసిపుచ్చారు. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను 2015, ఆగస్టు 25న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంది. -
మీలోని పరిణతి ఎంత?
సెల్ఫ్ చెక్ కొందరు చాలా సాఫ్ట్‌గా ఉంటూ గౌరవం పొందుతుంటే, మరికొందరు దానికి వ్యతిరేకంగా ఉంటారు. కొందరు సత్కారాలు అందుకుంటుంటే మరికొందరు ఛీత్కారాలు పొందుతుంటారు. మంచైనా చెడైనా మన నడవడికమీదే ఆధారపడి ఉంటుంది. కొందరు హుందాగా ప్రవర్తిస్తారు. మరికొందరు అలా ఉండరు. ఇది ఏ జండర్లోనైనా ఒకటే. అది మీ పరిణతిని సూచిస్తుంది. మీలోని పరిణతి ఎంతో తెలుసుకోవడానికి ఈ క్విజ్ పూర్తిచేయండి. 1. సమయానుకూలమైన దుస్తులు ధరిస్తారు. గొప్పలు పోరు. ఎ. కాదు బి. అవును 2. ఎవరినుంచైనా సహాయం పొందాక కృతజ్ఞతలు తెలుపకుండా ఉండరు. ఎ. కాదు బి. అవును 3. అందరికీ తగిన గౌరవం ఇస్తారు. మాటలతో ఎవరినీ బాధ పెట్టరు. మీతో మాట్లాడటానికి అందరూ ఇష్టపడతారు. ఎ. కాదు బి. అవును 4. ఎక్కువమంది కూడిన చోట ఎవరైనా జోకులు వేస్తే పెద్దగా నవ్వరు, హుందాగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 5. ఎవరినీ అవమానాలకు గురిచేయరు. మృదుస్వభావంతో ఉంటారు. ఎ. కాదు బి. అవును 6. మీ విజయాన్ని ఎవరైనా అభినందిస్తుంటే, దాన్ని రిసీవ్ చేసుకుంటారే కాని బడాయికి పోరు. ఎ. కాదు బి. అవును 7. ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడరు. అలా మాట్లాడేవారంటే మీకిష్టం ఉండదు. ఎ. అవును బి. కాదు 8. అనవసరంగా కోపం తెచ్చుకోరు. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఎ. కాదు బి. అవును 9. దయాగుణం మీలో ఎక్కువ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు. ఎ. కాదు బి. అవును 10. ఎవరికీ ఎక్కువ చనువివ్వరు. కొత్తవారి స్వభావాన్ని గమనించే వరకు వారితో సాధారణ వ్యవహారాల వరకే పరిమితమ వుతారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే మీలో పరిణతి ఎక్కువే. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ లిమిటేషన్స్ దాటే ప్రయత్నం చేయరు. స్నేహభావం వల్ల కొత్తకొత్తవారు పరిచయమవుతుంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కంటే ఎక్కువగా వస్తే మీలో పరిణతి అంతగా లేదని చెప్పవచ్చు. మనకు గౌరవం లభించాలంటే అది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మీలో పరిణతి మెరుగు పరుచుకునేందుకు ‘బి’లనే సూచనలుగా భావించి జెంటిల్‌గా ఎలా ఉండవచ్చో తెలుసుకోండి. -
క్విజ్ పోటీల్లో పెనుకొండ విద్యార్థుల ప్రతిభ
గుంతకల్లు టౌన్ : శ్రీ కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం డీఆర్సీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జనరల్ నాలెడ్జ్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇంతియాజ్, నరేంద్రలు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మహబూబ్‌బాషా, వీరాంజినేయులు ద్వితీయ స్థానం, కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మల్లికార్జున, ధనుంజయలు తృతీయ స్థానంలో నిలిచినట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేశ్వర్ వెల్లడించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కాలేజీ వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదాచార్యులు, డీఆర్సీ కన్వీనర్ రఫీ అహ్మద్, అధ్యాపకులు గోపినాయక్, ఇక్భాల్ తదితరులు పాల్గొన్నారు. -
క్విజ్ పోటీ విజేతలకు అభినందనలు
నారాయణగూడెం(మునగాల): గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మండలం పెదకాపర్తి గాంధీ గుడి సభ్యులు ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో మండలంలోని నారాయణగూడెం విద్యార్థినులు ప్రథమ బహుమతి సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసుకుల రామారావు సోమవారం అభినందించారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు డి.లెనినా, డి.స్టాలినా, బి.శిరీషాలు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. గతంలో కూడ వీరు జిల్లాస్థాయిలో పలు పోటీల్లో తమ ప్రతిభను చాటుకొని పాఠశాలకు గుర్తింపు తీసుకవచ్చారని కొనియాడారు. భవిష్యత్‌లో వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని మరిన్ని బహుమతులు గెలుచుకోవాలని రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డి.శ్రీనివాస్. పీవీ నారాయణ, డి.నాగేశ్వరరావు, ఎం.వెంకటేశ్వర్లు, ఈ.కిరణ్, ఎస్.జయలక్ష్మి, బి.మంగమ్మ పాల్గొన్నారు. -
ఇస్రో క్విజ్ పోటీలకు విశేష స్పందన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇస్రో ఆధ్వర్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలకు విశేష స్పందన లభించించినట్లు నిర్వాహకులు ఎంవీ రఘుకుమార్, రాఘవేంద్రరావు తెలిపారు. అక్టోబర్ ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించే వరల్డ్ స్పేస్ వీక్‌ను పురస్కరించుకొని సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో ఆదివారం స్పేస్ టెక్నాలజీ, ఆస్ట్రానీమ, సౌర వ్యవస్థపై 50 ప్రశ్నలతో కూడిన క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లావ్యాప్తంగా 70 పాఠశాలల నుంచి 204 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి 25 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆక్టోబర్ ఏడో తేదీన ఇస్రో స్పేస్ ఎక్సిబిషన్ ప్రారంభ వేడుకల్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మిగతా విద్యార్థులందరికీ పార్టిసిఫేషన్ సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. 7, 8 తేదీల్లో స్పేస్ ఎక్సిబిషన్ ఇస్రో ఆధ్వర్యంలో ఆక్టోబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో స్పేస్ ఎక్సిబిషన్ నిర్వహిస్తామని ఎంవీ రఘుకుమార్, రాఘవేంద్రరావు తెలిపారు. ఈ ఎక్సిబిషన్లో రాకెట్ మోడల్స్, అంతరిక్ష నౌకలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తామన్నారు.ఆక్టోబర్ ఆరో తేదీ ఉదయం 7 గంటలకు ఇస్రో ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు స్పేస్ వాక్ నిర్వహిస్తామన్నారు. -
రాష్ట్రస్థాయి క్విజ్‌లో ‘తేజ’కు ప్రథమ స్థానం
కోదాడ: ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సంస్థ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించిన వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. వీరు త్వరలో డిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పైనల్లో రాష్ట్రం తరుపున పాల్గొననున్నారు. పాఠశాలకు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి (7వ తరగతి), పవన్ (8వ తరగతి) విద్యార్థుల టీం 150 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. మొత్తం 108 టీంలు పాల్గొన్న ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్ర«థమ స్థానం సాధించడం పట్ల పాఠశాల నిర్వాహకులు రమాసోమిరెడ్డి, జానకిరామయ్య హర్షం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు వరుసగా ప్రథమ స్థానం సాధిస్తున్నారని వారు తెలిపారు. -
14న భౌతిక శాస్త్ర క్విజ్ పోటీలు
సూర్యాపేట : విజ్ఞాన భారతి – అన్వేషిక జాతీయ స్థాయి భౌతిక శాస్త్ర ప్రయోగ నైపుణ్య క్విజ్ పోటీలు ఈనెల 14న సూర్యాపేటలో నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ శాస్త్రవేత్త జితేందర్‌సింగ్, జిల్లా సైన్స్ అధికారి గోళ్లమూడి రమేష్‌బాబు తెలిపారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి వర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించే ఈ క్విజ్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా నిర్వహించే ఈ పోటీ ద్వారా విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు నిర్వహించడంలో మెళకువలను పెంపొదిస్తామని తెలిపారు. పేర్ల నమోదుకు ఈనెల 10వ తేదీ లోగా జిల్లా కన్వీనర్ సెల్ 9848431030 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విజ్ఞాన భారతి రాష్ట్ర కార్యదర్శి జీఎల్ఎన్ మూర్తి, కె.గురుమూర్తి, ఎస్.కె.జాఫర్, వెంకటేశ్వర్లు, వెంకన్న, రాజేందర్, శ్రీరామ్ పాల్గొన్నారు. -
కంప్యూటర్ పిచ్చి... వదిలించేదెలా?!
కిడ్స్ మైండ్ సెట్ మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. ఈ మధ్య మేం ఏదైనా కాదన్నా, కోపంతో ఓ మాట అన్నా ఉక్రోషం వచ్చేస్తోంది వాడికి. ఓ మూలకు పోయి నిలబడుతున్నాడు. పైకి ఏడవడం లేదు కానీ దుఃఖపడుతున్నాడని అర్థమవుతోంది. అలాంటప్పుడు మాట్లాడిస్తే నత్తి వచ్చేస్తోంది. ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. ఈ మధ్యనే అలా అవుతోంది. ఎందుకు? ఇదేమైనా మానసిక సమస్యా? - రాజ్యలక్ష్మి, నంద్యాల బాబుకు ఈ మధ్య స్ట్రెస్ ఏమైనా ఎక్కువైందా? ఒకవేళ స్కూల్లో చదువు వల్ల కానీ, ఫ్రెండ్స్ టీజ్ చేయడం వల్ల కానీ తనకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమో గమనించండి. వీలైతే తననే బుజ్జగించి అడగండి. చెబితే సరే. లేదంటే ఒత్తిడి చేయకుండా మరో మార్గంలో తెలుసుకోడానికి ట్రై చేయండి. ఏదీ లేకపోతే తనని మార్చడానికి మీరే మెల్లగా ప్రయత్నించాలి. తను చెప్పినట్టే ప్రతిసారీ వినడం ఎందుకు సాధ్యం కాదో వివరించండి. వీలైనంత వరకూ కసురు కోవడం, తిట్టడం లాంటివి చేయకండి. సాధ్యమైనంత నెమ్మదిగానే డీల్ చేయండి. అలా అని బాధపడతాడేమోనని అడిగినవన్నీ ఇచ్చెయ్యకండి. మీ ప్రయత్నాలన్నీ చేసినా బాబు మారకపోతే కౌన్సెలర్‌కు చూపించండి. వాళ్లే చూసుకుంటారు. నత్తికి మాత్రం ఓసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించండి. స్ట్రెస్ వల్లే ఇలా వస్తోందా లేక ఇంకేదైనా సమస్య ఉందా అనేది వాళ్లే చెప్పగలరు. మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చదువులో చాలా చురుకు. ఎక్కువ చదువుతాడు. బాగా నాలెడ్జ్ ఉంది. క్విజ్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొని బోలెడు ప్రయిజులు తెచ్చుకున్నాడు. అందుకే వాడికి పనికి వస్తుందని కంప్యూటర్ కొనిచ్చాం. కానీ ఈమధ్య ఓసారి వాడి గదిలోకి వెళ్లినప్పుడు... వాడు పిచ్చి పిచ్చి వీడియోలు, ఫొటోలు చూడటం కనిపించింది. గమనించనట్టే వచ్చే శాను. ఇలాంటివి చేస్తే వాడి భవిష్యత్తు ఏమవు తుందోనని భయంగా ఉంది. మాకు విషయం తెలిసిందని తెలిస్తే ఎలా రియాక్టవుతాడోనని మరో భయం. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి? - పి.స్వర్ణ, హైదరాబాద్ బాబుతో తప్పకుండా ఈ విషయం మాట్లాడండి. ఈ వయసులో ఇటువంటివి జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు. తప్ప కుండా తనకి తప్పొప్పులు తెలిసేలా చేయాలి. కాబట్టి కూర్చోబెట్టి వివరిం చండి. అవసరమైతే పనిష్మెంట్గా ఒక వారం పది రోజుల పాటు కంప్యూటర్ తీసేసుకోండి. తిరిగి ఇచ్చేటప్పుడు అన్ని రూల్స్ పెట్టి ఇవ్వండి. తప్పితే కంప్యూటర్ పూర్తిగా తీసేసుకుంటానని చెప్పండి. ఇంటర్నెట్ కూడా అవసరం మేరకే ఉండేలా జాగ్రత్తపడండి. ఓ సమయం దాటాక ఇంటర్నెట్ రాకుండా చేసేయండి. కంప్యూటర్లు, ల్యాప్‌టాపుల్లో పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయండి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్లని కరెక్ట్ చేయడం మన బాధ్యత. కానీ అది వాళ్లలో మార్పు తీసుకు వచ్చేలా ఉండాలి తప్ప అవమానించేలా, సిగ్గు పరిచేలా ఉండకూడదు. కాబట్టి కాస్త కూల్‌గానే డీల్ చేయండి. మా పాప ఆరో తరగతి చదువుతోంది. తెలివితేటల వరకూ ఎటువంటి సమస్యా లేదు. అయితే పాప ప్రవర్తనతోనే కాస్త ఇబ్బంది. ఎందుకో తెలియదు కానీ తనకు స్వార్థం చాలా ఎక్కువ. ఎవరితోనూ ఏదీ షేర్ చేసు కోడానికి ఇష్టపడదు. చివరికి తన తమ్ముడితో కూడా ఇది నీది, ఇది నాది అని వాదిస్తూ ఉంటుంది. ఎవరికీ ఏమీ పెట్టదు, ఇవ్వదు. అలా ఉండకూడదని, అందరితోనూ పంచు కోవడం చాలా గొప్ప లక్షణమని నా భార్య, నేను చాలాసార్లు చెప్పాం. కానీ తన తీరు మారలేదు. ఎందుకిలా చేస్తోంది? చిన్నప్పుడే ఇలా ఉంటే తను మంచి వ్యక్తి ఎలా అవుతుంది? సలహా ఇవ్వండి. - ప్రవీణ్‌రెడ్డి, విజయవాడ చాలామంది పిల్లలు ఈ వయసులో ఇలాంటివి చేస్తారు. కానీ మరీ ఇలా మాత్రం ఉండకూడదు. షేర్ చేసుకోవాలని మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ తను అలా చేయడం లేదు. కాబట్టి ఈసారి బలవంతంగానైనా ఆ పని చేయించండి. దగ్గరుండి వాళ్లకీ వీళ్లకీ తనతోనే ఏమైనా ఇప్పించండి. తను ఒప్పుకోకపోయినా, కోపం వచ్చినా వదిలి పెట్టవద్దు. అలాగే, షేర్ చేసుకోవడం వల్ల వచ్చే మంచి ఫలితాలేమిటో కూడా తనకి చెప్పండి. మనం ఇవ్వడం వల్ల ఎదుటివాళ్లు ఎలా సంతోషపడతారు, వాళ్లు కూడా తమకున్న వాటిని ఎలా పంచుతారు, ఎలా దీవిస్తారు వంటివన్నీ తనకు అనుభవమయ్యేలా చేయండి. అప్పుడు తనకే అలవాటవు తుంది. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టు సాయం తీసుకోండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్