14న భౌతిక శాస్త్ర క్విజ్ పోటీలు
Published Fri, Aug 5 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
సూర్యాపేట : విజ్ఞాన భారతి – అన్వేషిక జాతీయ స్థాయి భౌతిక శాస్త్ర ప్రయోగ నైపుణ్య క్విజ్ పోటీలు ఈనెల 14న సూర్యాపేటలో నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ శాస్త్రవేత్త జితేందర్‌సింగ్, జిల్లా సైన్స్ అధికారి గోళ్లమూడి రమేష్‌బాబు తెలిపారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి వర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించే ఈ క్విజ్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా నిర్వహించే ఈ పోటీ ద్వారా విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు నిర్వహించడంలో మెళకువలను పెంపొదిస్తామని తెలిపారు. పేర్ల నమోదుకు ఈనెల 10వ తేదీ లోగా జిల్లా కన్వీనర్ సెల్ 9848431030 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విజ్ఞాన భారతి రాష్ట్ర కార్యదర్శి జీఎల్‌ఎన్ మూర్తి, కె.గురుమూర్తి, ఎస్.కె.జాఫర్, వెంకటేశ్వర్లు, వెంకన్న, రాజేందర్, శ్రీరామ్ పాల్గొన్నారు.
Advertisement