శ్రీ కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం డీఆర్‌సీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జనరల్ నాలెడ్జ్ క్విజ్ పోటీలు నిర్వహించారు.
గుంతకల్లు టౌన్ : శ్రీ కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం డీఆర్‌సీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జనరల్ నాలెడ్జ్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇంతియాజ్, నరేంద్రలు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.
గుంతకల్లు ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మహబూబ్‌బాషా, వీరాంజినేయులు ద్వితీయ స్థానం, కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మల్లికార్జున, ధనుంజయలు తృతీయ స్థానంలో నిలిచినట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేశ్వర్ వెల్లడించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కాలేజీ వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదాచార్యులు, డీఆర్‌సీ కన్వీనర్ రఫీ అహ్మద్, అధ్యాపకులు గోపినాయక్, ఇక్భాల్ తదితరులు పాల్గొన్నారు.