
మీలోని పరిణతి ఎంత?
సెల్ఫ్ చెక్
కొందరు చాలా సాఫ్ట్‌గా ఉంటూ గౌరవం పొందుతుంటే, మరికొందరు దానికి వ్యతిరేకంగా ఉంటారు. కొందరు సత్కారాలు అందుకుంటుంటే మరికొందరు ఛీత్కారాలు పొందుతుంటారు. మంచైనా చెడైనా మన నడవడికమీదే ఆధారపడి ఉంటుంది. కొందరు హుందాగా ప్రవర్తిస్తారు. మరికొందరు అలా ఉండరు. ఇది ఏ జండర్‌లోనైనా ఒకటే. అది మీ పరిణతిని సూచిస్తుంది. మీలోని పరిణతి ఎంతో తెలుసుకోవడానికి ఈ క్విజ్ పూర్తిచేయండి.
1. సమయానుకూలమైన దుస్తులు ధరిస్తారు. గొప్పలు పోరు.
ఎ. కాదు బి. అవును
2. ఎవరినుంచైనా సహాయం పొందాక కృతజ్ఞతలు తెలుపకుండా ఉండరు.
ఎ. కాదు బి. అవును
3. అందరికీ తగిన గౌరవం ఇస్తారు. మాటలతో ఎవరినీ బాధ పెట్టరు. మీతో మాట్లాడటానికి అందరూ ఇష్టపడతారు.
ఎ. కాదు బి. అవును
4. ఎక్కువమంది కూడిన చోట ఎవరైనా జోకులు వేస్తే పెద్దగా నవ్వరు, హుందాగా ఉంటారు.
ఎ. కాదు బి. అవును
5. ఎవరినీ అవమానాలకు గురిచేయరు. మృదుస్వభావంతో ఉంటారు.
ఎ. కాదు బి. అవును
6. మీ విజయాన్ని ఎవరైనా అభినందిస్తుంటే, దాన్ని రిసీవ్ చేసుకుంటారే కాని బడాయికి పోరు.
ఎ. కాదు బి. అవును
7. ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడరు. అలా మాట్లాడేవారంటే మీకిష్టం ఉండదు.
ఎ. అవును బి. కాదు
8. అనవసరంగా కోపం తెచ్చుకోరు. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు.
ఎ. కాదు బి. అవును
9. దయాగుణం మీలో ఎక్కువ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు.
ఎ. కాదు బి. అవును
10. ఎవరికీ ఎక్కువ చనువివ్వరు. కొత్తవారి స్వభావాన్ని గమనించే వరకు వారితో సాధారణ వ్యవహారాల వరకే పరిమితమ వుతారు.
ఎ. కాదు బి. అవును
‘బి’ లు ఏడు దాటితే మీలో పరిణతి ఎక్కువే. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ లిమిటేషన్స్ దాటే ప్రయత్నం చేయరు. స్నేహభావం వల్ల కొత్తకొత్తవారు పరిచయమవుతుంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కంటే ఎక్కువగా వస్తే మీలో పరిణతి అంతగా లేదని చెప్పవచ్చు. మనకు గౌరవం లభించాలంటే అది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మీలో పరిణతి మెరుగు పరుచుకునేందుకు ‘బి’లనే సూచనలుగా భావించి జెంటిల్‌గా ఎలా ఉండవచ్చో తెలుసుకోండి.