
న్యూఢిల్లీ: గత 9 నెలలుగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటివరకు 9,88,576 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 75 లక్షల మంది వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిలో 63,402 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమవారు ప్రాణాలతో తిరిగిరావాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక కంటికి కనిపించని కరోనా వైరస్ దెబ్బతో ఇదీ అదీ అని కాకుండా అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈక్రమంలో చైనాలోని వుహాన్ నగరంలో ఓ ల్యాబ్ నుంచి పుట్టుకొచ్చినట్టు భావిస్తున్న కోవిడ్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలపై మీకో క్విజ్!
(చదవండి: త్వరలో రష్యా ప్రజలకు కరోనా టీకా)
Comments
Please login to add a commentAdd a comment