సాక్షి - కే సర్కిల్ ఓపెన్ స్కూల్ | sakshi quiz registrations started | Sakshi
Sakshi News home page

సాక్షి - కే సర్కిల్ ఓపెన్ స్కూల్

Published Tue, Aug 18 2015 2:36 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి - కే సర్కిల్ ఓపెన్ స్కూల్ - Sakshi

సాక్షి - కే సర్కిల్ ఓపెన్ స్కూల్

హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మకమైన కే-సర్కిల్ క్విజ్ సంస్థతో కలసి ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి కే-సర్కిల్ ఓపెన్ స్కూల్ క్విజ్’ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలు ఈ నెల 19వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఆరు బృందాలను పంపవచ్చు. 5 నుంచి 10వ తరగతి వరకు ఒకే కేటగిరీలో పోటీలు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఉచితం. రెండు దశల్లో ఈ పోటీలు జరుగుతాయి.

మొదటి దశలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు రాతపరీక్ష, రెండో దశలో సెప్టెంబర్ తొలి వారంలో ఫైనల్స్ జరుగుతాయి. వీటిని సాక్షి టీవీలో ప్రసారం చేస్తారు. విజేతలకు ‘సాక్షి కే-సర్కిల్ చాంపియన్స్ ట్రోఫీ’ని అందజేస్తారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. వివరాలకు 9505551099 నంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా
bit.ly/schoolopen, kckcircle@gmail.com కు ఈ మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement