క్విజ్‌ పోటీ విజేతలకు అభినందనలు | students win dist Quiz competetions | Sakshi
Sakshi News home page

క్విజ్‌ పోటీ విజేతలకు అభినందనలు

Published Mon, Oct 3 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

క్విజ్‌ పోటీ విజేతలకు అభినందనలు

క్విజ్‌ పోటీ విజేతలకు అభినందనలు

నారాయణగూడెం(మునగాల): గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మండలం పెదకాపర్తి గాంధీ గుడి సభ్యులు ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి క్విజ్‌ పోటీల్లో మండలంలోని నారాయణగూడెం విద్యార్థినులు ప్రథమ బహుమతి సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసుకుల రామారావు సోమవారం అభినందించారు.  ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు డి.లెనినా, డి.స్టాలినా, బి.శిరీషాలు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు.

గతంలో కూడ వీరు జిల్లాస్థాయిలో పలు పోటీల్లో తమ ప్రతిభను చాటుకొని పాఠశాలకు గుర్తింపు తీసుకవచ్చారని కొనియాడారు.  భవిష్యత్‌లో వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని  మరిన్ని బహుమతులు గెలుచుకోవాలని రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,  డి.శ్రీనివాస్‌. పీవీ నారాయణ, డి.నాగేశ్వరరావు, ఎం.వెంకటేశ్వర్లు, ఈ.కిరణ్, ఎస్‌.జయలక్ష్మి, బి.మంగమ్మ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement