competetions
-
కేలో..కేలో..కేలోరే...!
ఉత్కంఠంగా రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మెయిన్ డ్రాలో ఆడుతున్న క్రీడాకారులు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ): రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ఉత్కంఠతతో కొనసాగాయి. క్రీడాకారులు మెయిన్‌డ్రాలో తమ సత్తాను చాటుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 13, 15 విభాగాల్లో సింగిల్స్, డబుల్స్‌తో బాలురు, బాలికల జట్ల మ«ధ్య హోరాహోరీగా సాగుతోంది. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియం, భాను ఇండోర్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్ జరుగుతుండగా, డబుల్స్ శుక్రవారం జరగనున్నాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారు త్వరలో జరగబోయే నేషనల్స్ టోర్నమెంటోలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. నేషనల్స్‌కు వెళ్లాలి నాకు చిన్నప్పటినుంచి షటిల్ అంటే తెలీని ఇçష్టం, దాంతో స్కూలులో ఎక్కువగా ఆడుతుండేవాడిని. అదే నాకు మంచి తోడ్పాడునిచ్చింది. ఇప్పటివరకు అండర్ 13లో నాలుగు టోర్నమెంట్లు ఆడాను. నేషనల్స్‌కు వెళ్లి రాష్ట్రం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం. - అభిరామ్, షటిల్ క్రీడాకారుడు. శ్రీకాకుళం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో షటిల్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నాను. వారిచ్చే ప్రోద్బలంతో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది. నేషనల్ ర్యాంకింగ్ కొయంబత్తూర్ ఆడాను. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాను. -కె.సాత్విక్ కోర్, షటిల్ క్రీడాకారుడు. ఒంగోలు ఒలింపిక్ సాధనే లక్ష్యం.. ఒలింపిక్ సాధనే లక్ష్యంతో ఆడుతున్నాను. నేషనల్ ర్యాంకింగ్ సెవెన్‌తో పాటు తెనాలి స్టేట్ విన్నర్‌గా నిలిచాను. అండర్ 13లో ఆడుతున్నాను. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి. ఆసక్తికరంగా పోటీలు సాగుతున్నాయి. విజేతగా నిలిచేందుకు కృషి చేస్తున్నాను. - బాబారావ్, షటిల్ క్రీడాకారుడు. కడప. నేషనల్స్‌కు ఆటగాళ్లను పంపుతాం రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు వచ్చారు. వీరందరికీ భోజన, వసతి సదుపాయలు కల్పించాం. క్రీడాకారులు పోటాపోటీగా ఆడుతున్నారు. 19న జరిగే పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారిని నేషనల్స్‌కు పంపుతాం. ఈ పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. - జి.సాయిబాబా, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ -
ఆ పద, స్వరాలకు అవార్డులు
-యునెస్కో పోటీల్లో ‘రాధాకృష్ణ’ విద్యార్థినుల ప్రతిభ -నాట్య, సంగీత విభాగాల్లో బహుమతుల పంట రాజమహేంద్రవరం కల్చరల్ : జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన దారోహర్ అంతర్జాతీయ సంగీత నృత్యపోటీలలో పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు బదరీ నారాయణ అవార్డులను ప్రదర్శించి, వివరాలను వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాధాకృష్ణ విద్యార్థినులు అన్ని విభాగాలలో బహుమతులను గెలుచుకున్నారు. అద్భుతమైన కొరియోగ్రఫీని అందించినందుకు రాధాకృష్ణ అధ్యాపకురాలు గోరుగంతు ఉమాజయశ్రీ ‘కళాకుంజ్’ అవార్డును, అన్ని విభాగాలలో ప్రధాన పాత్ర పోషించిన కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక ‘కళాప్రభ’ అవార్డును గెలుచుకున్నారు. మరో విద్యార్థిని మాధురి లలితసంగీతంలో తృతీయ బహుమతిని, లక్ష్మీదీపిక, సునంద కూచిపూడి విభాగంలో ప్రథమ బహుమతిని సాధించారు. జూనియర్స్ విభాగంలో వినాయక కౌతం బృందం కళాకారులు ప్రథమ బహుమతిని, వీణ ఫ్యూషన్‌లో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. గోదావరి హారతి, నవరాగమాలికా వర్ణాలకు ప్రథమ బహుమతి కూడా లభించింది. అన్ని విభాగాలలో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు మొత్తం 15 బహుమతులను గెలుచుకుని, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటారని నారాయణ చెప్పారు. ఏ వేదికపై ప్రదర్శనలు ఇచ్చినా సనాతన భారతీయ వైభవాన్ని ప్రచారం చేయడమే తమ లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో కళాక్షేత్ర అధ్యాపకురాలు ఉమాజయశ్రీ, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఖాన్, సభ్యులు పి.సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు. శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. -
పిల్లలను క్రీడల్లోనూ ప్రోత్సహించాలి
– రూ 4.50 కోట్లతో రాజమహేంద్రవరం స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలి –ముగిసిన టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ పోటీలు తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉన్న త్యాగరాయ నారాయణదాస సేవాసమితి పం„క్షన్ హాలులో రాష్ట్ర స్థాయి రెండోవ టేబుల్ టెన్నిస్ పోటీలు మూడు రోజుల పాటు జరిగాయి. పురుషులు, మహిళ, యూత్బాయ్స్, యూత్ గరల్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ గరల్స్, సబ్ జూనియర్, మినీకెడిట్, డబుల్ తదితర 14 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి నగరానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నగరంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కార్పొరేటర్లతో చర్చించి స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్టేడియం నిర్మాణానికి ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్ రూ.మూడు కోట్ల నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వం ఇచ్చే నిధులతో స్టేడియం అభివృద్ధి చే స్తామని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రావు చిన్నారావు, కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, నన్నయ్య యూనివర్సీటీ పీడి ఏ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా టీటీ పోటీలు
ఫైనల్‌కు చేరిన ఛార్వీపల్గున్ నేటితో పోటీల ముగింపు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) : ఏపీ స్టేట్ రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక గోదావరి గట్టు వద్ద ఉన్న త్యాగరాయ దాసాసేవా సమితి హాల్లో నిర్వహించిన రెండో రోజు పోటీల్లో రాష్ట్రంలోని 39 మంది పురుషులు, 80 మంది బాలికలు తలబడ్డారు. వీరిలో కేడెట్ బాలికల విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన ఛార్వీపల్గున్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. ఏపీ స్టేట్ ప్రథమ ర్యాంకింగ్ పోటీలు గత నెలలో విజయవాడలో నిర్వహించారు. త్వరలో గుంటూరు, విశాఖపట్నంలో కూడా పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురంలో ఫైనల్స్ నిర్వహించి నేషనల్‌కు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. క్రీడాకారులకు ఉచిత శిక్షణ రాజమహేంద్రవరం నుంచి ఎందరో ఆటగాళ్లను తయారుచేసే అవకాశం ఉంది. దేశం తరఫున ఆడే సత్తాగల క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. ఒక్క టేబుల్ టెన్నిస్‌కే కాదు ఏ క్రీడాలోనూ శిక్షణ పొందేందుకు ఇక్కడ స్టేడియం లేదు. ఆటగాళ్లను తయారు చేయాలంటే అన్ని వనరులు ఉండాలి. నగరంలో టౌన్‌హాలు ఎదురుగా ఉన్న టీటీ అకాడమీలో 72 మందికి టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాం. రాజమహేంద్రవరంలో సొంతంగా 15 టేబుళ్లతో స్టేడియం నిర్మించనున్నాం. అక్కడ ఉచితంగా టీటీ శిక్షణతో పాటు యోగా, జిమ్ వంటివి ఎన్నో అందుబాటులోకి తీసుకువస్తాం –వి.భాస్కర్రామ్, ఏపీ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర అధ్యక్షుడు బాగా ఆడుతున్నారు టేబుల్ టెన్నిస్‌లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. వీరిలో ప్రతిభగల వారిని ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి నేషనల్స్, ఒలింపిక్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజమహేంద్రవరంలో జరుగుతున్న రెండో ర్యాంకింగ్ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారందరికీ తగు ఏర్పాట్లు చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మంచి టీటీ క్రీడాకారులను తయారుచేస్తాం. - ఎస్.ఎం.సుల్తాన్, ఏపీ టీటీ రాష్ట్ర కార్యదర్శి నా కుమార్తెను ప్రోత్సహిస్తున్నాం నా కుమార్తె ఆశ్రిత సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో తలపడుతోంది. చిన్నప్పటి నుంచే టేబుల్ టెన్నిస్‌పై ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో మేము ఆమెను ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ టోర్నీ జరిగినా అందులో పోటీ పడుతోంది. ఆమె జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించాలని కోరుకుంటున్నాం. - టి.సునీల, టీటీ క్రీడాకారిణి తల్లి, వైజాగ్ ఒలింపిక్ పతకం సాధిస్తా ఏలూరులో జరిగిన టోర్నమెంట్ కేడెట్లో గోల్డ్ మెడల్ సాధించా. చిన్నప్పటి నుంచి టీటీ అంటే చాలా ఇష్టం. మా నాన్న గారు మంచి టీటీ క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తితో ఈ ఆటపై మక్కువ ఏర్పడింది. ఒలిపింక్ పతకం తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నా. - ఛార్వీపల్గున్, టీటీ క్రీడాకారిణి, రాజమహేంద్రవరం టీటీ అంటే ఎంతో ఇష్టం టేబుల్ టెన్నిస్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఇప్పటికే చాలా టోర్నమెంట్లలో ఆడాను. పలు పతకాలు వచ్చాయి. వాటన్నింటికన్నా దేశానికి పేరు తెచ్చేలా ఒలింపిక్ పతకం సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉన్నా. - శైలునూర్ బాషా, టీటీ క్రీడాకారిణి, విజయవాడ 15 గోల్డ్ మెడల్స్ సాధించా ఇప్పటి వరకూ ఎన్నో టోర్నీల్లో పాల్గొన్నా. 12 నేషనల్స్ ఆడాను. రాష్ట్ర స్థాయిలో 15 ప్రథమ స్థానాలు సాధించి గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నా. జాతీయ స్థాయి పోటీలంటే చాలా ఇష్టం. మరింత ముందుకు వెళ్లాలని ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. - డి.రాహుల్, టీటీ క్రీడాకారుడు, రాజమహేంద్రవరం స్పోర్ట్ కోటాలో ఉద్యోగం చిన్నప్పటి నుంచి టీటీ అంటే ఎంతో ఇష్టం. ఇçప్పటి వరకూ 300 పైగా టోర్నీలు ఆడాను. ఆటలపై నాకున్న మక్కువతోనే నాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. టేబుల్ టెన్నిస్‌లో ఇండియా తరఫున ఆడాలనే లక్ష్యంతో ఉన్నాను. - చల్లా ప్రణీత, టీటీ క్రీడాకారిణి, విజయవాడ -
రేపటి నుంచి నాటికల పోటీలు
కాకినాడ కల్చరల్ : కళాకారులను ప్రోత్సహిస్తూ, నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి బాబ్జి, పంపన దయానంద బాబు తెలిపారు. స్థానిక యంగ్మెన్స్ క్లబ్ సమావేశపు మందిరంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థల సౌజన్యంతో ఈ నెల 4 నుంచి 6 వరకూ స్థానిక సూర్యకళామందిర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కరప గ్రామంలోని శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 4న గోవాడ క్రియేషన్స్ వారి ‘రచ్చబండ’ నాటిక, ఎస్ఎన్ఎం క్లబ్ వారి ‘గడి’ నాటిక, 5న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక రూపకల్పన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’ నాటిక, మూర్తి కల్చరల్ అసోసియేషన్ వారి ‘అంతిమ తీర్పు’ నాటిక, 6న ఉషోదయ కళానికేతన్ వారి ‘గోవు మాలచ్చిమి’ నాటిక, శ్రీసాయి ఆర్ట్స్ వారి ‘చాలు–ఇకచాలు’ నాటిక, అభినయ ఆర్ట్స్ వారి ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నట్టు వారు తెలిపారు. శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్ర నాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్య బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులకు ‘సాహితీ కళాభిజ్ఞ’ పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు ‘సేవారత్న’ ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో బాజిబోయిన వెంకటేష్ నాయుడు, భీమశంకర్, తురగా సూర్యారావు, టి.ఎల్.ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
పరుగో.. పరుగు
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు సీనియర్స్ విజేత విశాఖ జూనియర్స్ విజేత తూర్పుగోదావరి గొల్లప్రోలు : గొల్లప్రోలులోని మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. స్థానిక గోదావరికాలువ గట్టుపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 47 జతల ఎడ్లు పాల్గొన్నాయి. రైతులు మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా చెట్లు, వరిచేలగట్లపై నిల్చొని పోటీలను ఆసక్తిగా తిలకించారు. * సీనియర్స్ విభాగంలో ఏడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన అద్దేపల్లి పాలవల్లికి చెందిన ఎడ్లు(5నిమిషాలు–54సెకన్లు–37పాయింట్లు), ద్వితీయస్థానంలో విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లుజత(5–54–44), అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణిశ్రీయుక్తకు చెందిన ఎడ్లు(6–05–87) తృతీయస్థానంలో నిలిచాయి. * జూనియర్స్ విభాగంలో 30జతల ఎడ్లు పాల్గొనగా, విజేతగా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామసూర్యవర్షిత్ ఎడ్లుజత(4 నిమిషాలు, 39సెంకడ్లు––28పాయింట్లు) , ద్వితీయస్థానంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడుకు చెందిన బొజ్జా లక్ష్మీఅపర్ణకు చెందిన ఎడ్లు జత(4–49–25) , తృతీయస్థానంలో ప్రకాశంజిల్లా పంగులూరుకు చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లుజత(4–49–37) నిలిచాయి. విజేతలకు బహుమతులు సీనియర్స్‌లో విజేతకు లింగం రాజు రూ.15వేలు నగదు, ద్వితీయవిజేతకు నాగలక్ష్మిసీడ్స్ అధినేత గట్టెం విష్ణు రూ.12వేలు, తృతీమబహుమతిని పీఎంఆర్ విద్యామందిర్ అధినేత మాదేపల్లి వినీల్ రూ10వేలు, జూనియర్స్ విజేతకు మాధురివిద్యాలయ అధినేత కడారి తమ్మయ్యనాయుడు రూ.12వేలు, ద్వితీయబహుమతిని శివసాయి ఏజన్సీస్ అధినేత తెడ్లపు చిన్నారావు రూ.10వేలు, తృతీయ బహుమతిని అధమాకంపెనీ రూ.8వేలు ఆర్థికసహాయం అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు, మెమెంటోలు, శివసాయి ఏజన్సీస్ అధినేత చిన్నారావు ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి వినీల్, నగరపంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం, నీటి సంఘం అధ్యక్షులు కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలగా సిద్ధా నానాజీ వ్యవహరించారు. ఏర్పాట్లను రంగబాబు మెమోరియల్ కమిటీ పర్యవేక్షించింది. శ్రీశ్రీనివాసా ఏజన్సీస్ అధినేత కేదారిశెట్టినానాజీ మజ్జిగ పంపిణీ చేశారు. -
అంగన్వాడీ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
కొత్తపేట : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి ఎనిమిదో తేదీ) పురస్కరించుకుని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గత నెల 18న ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో, 21న జిల్లా స్థాయిలో కాకినాడలో కబడ్డీ పోటీలు నిర్వహించగా కొత్తపేట ప్రాజెక్టు జట్టు జిల్లా స్థాయిలో ప్రథమస్థానం సాధించింది. జిల్లా పోటీల్లో బాగా ఆడిన ఆర్ రత్నకుమారి, బీఎస్ఎన్ కుమారి(కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు), శాంతి, ప్రసన్న, సుజాత, వీరమణి, తులసి, త్రివేణి(తుని ప్రాజెక్టు), గంగాదేవి (పెద్దాపుర ప్రాజెక్టు)లను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుగా కూర్చారు. ఈ జట్టు మంగళవారం రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో క్వార్టర్స్‌లో పశ్చిమ గోదావరి జట్టుపై, సెమీ ఫైనల్స్‌లో చిత్తూరు జట్లపై గెలిచి, ఫైనల్స్‌లో కృష్ణా జిల్లా జట్టుపై ఘన విజయం సాధించినట్టు కొత్తపేట ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ జట్టును స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆర్జేడీ విద్యావతి, తుని, కొత్తపేట సీడీపీఓలు వి మాధవి, బి అనంతలక్ష్మి తదితరులు అభినందించారు. ఆ టీమ్ సభ్యులకు వచ్చే నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందచేస్తారని రాజ్యలక్ష్మి తెలిపారు. -
నేటితో క్రీడాసంబరం పరిసమాప్తం
పాయింట్ల ఆధారంగా విజేతల నిర్ణయం అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌కు సత్కారం అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ నేషనల్ ఇన్విటేషన్ మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఐదు సెట్లలో నిర్వహించిన ఈ పోటీల్లో మూడు సెట్లు గెలిచినవారు విజయం సాధిస్తారు. కాని మూడొంతుల మ్యాచ్‌లు ఐదు సెట్లు, నాలుగు సెట్లలోకాని ఫలితం తేలలేదు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలను పరిశీలిస్తే పురుషుల విభాగంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), వెస్ట్రన్ రైల్వే (ముంబై), పోస్టల్ (కర్ణాటక), మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), పోస్టల్ (కర్ణాటక) జట్లు విజేతగా నిలిచే అవకాశముంది. సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో సాయి (గుజరాత్)పై ఇన్‌కంట్యాక్స్ (చెన్నై) జట్టు 25–18, 27–17, 25–18 తేడాతో ఏకపక్షంగా సాగిన పోరులో విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్ మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), సాయి (గుజరాత్) జట్ల మధ్య జరగగా, ఎస్సీ రైల్వే 23–25, 25–16, 25–22, 25–22 తేడాతో విజయం సాధించింది. పోస్టల్ (కర్ణాటక) జట్టుపై వెస్ట్రన్ రైల్వే (ముంబై) జట్టు 25–16, 23–25, 27–25, 28–18 తేడాతో గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి పురుషుల విభాగంలో జరిగిన పోరులో సీఆర్పీఎఫ్(ఢిల్లీ) జట్టు సాయి (గుజరాత్)పై 23–25, 25–1, 25–22, 25–22 తేడాతో గెలుపొందాయి. నేటితో ముగింపు ఐదు రోజుల పాటు జరగనున్న ఎన్వీఆర్ వాలీబాల్ పోటీలు మంగళవారం రాత్రితో ముగియనున్నాయి. పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచినవారితోపాటు అన్ని జట్లకు కలిపి రూ.ఐదు లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీని అందించనున్నారు. సాత్విక్‌కు ఘన సత్కారం అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్‌కు ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ సోమవారం రాత్రి ఘనంగా సత్కరించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, టోర్నమెంట్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడులు సాత్విక్‌ను సత్కరించారు. అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, కోశాధికారి అరిగెల నానాజీ, సాంకేతిక కమిటీ సభ్యుడు ఉండ్రు రాజబాబులు ఉన్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) :గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండోరోజు శనివారం సాయంత్రం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో పోస్టల్ కర్నాటక జట్టుపై సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు 25–22, 22–25, 19–25, 25–19, 15–8 పాయింట్లతో గెలుపొందింది. మొత్తం ఐదు సెట్లలో జరిగిన ఈ పోరు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మహిళా విభాగంలో కర్ణాటక జట్టు సౌత్ సెంట్రల్ రైల్వేపై 27–25, 25–20, 17–25, 25–19 తేడాతో విజయం సాధించింది. ముందు రోజు శుక్రవారం రాత్రి రెండు గంటల వరకూ పోటీలు జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీటీం) జట్టు సాయి గుజరాత్‌పై 25–22, 25–16, 25–21 స్కోర్‌తో గెలుపొందింది. మహిళా విభాగంలో జరిగిన పోరులో పోస్టల్ కర్నాటక జట్టు సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టుపై 25–19, 25–23, 21–25, 25–18 స్కోర్‌తో గెలుపొందింది. ఒక్కో మ్యాచ్ ఫలితం కోసం నాలుగు, ఐదు సెట్లు ఆడాల్సి రావడంతో పోటీలు ఆలస్యమవుతున్నాయి. సుమారు ఐదువేల మంది సామర్థ్యం ఉన్న గ్యాలరీ నిండిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోతున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావులు రెండో రోజు పోటీలను తిలకించారు. వారికి టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్ స్వాగతం పలికారు. -
హోరాహోరీగా బిలియర్డ్స్ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బిలియర్డ్స్ చాంపియన్‌షిప్-2017 టోర్నమెంట్లో భాగంగా రెండోరోజు శుక్రవారం పోటీలు హోరాహోరీగా జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి 28 మంది క్రీడాకారులు పోటీల్లో తలపడుతున్నారు. గురు,శుక్రవారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు శనివారం ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకుడు సుబ్బారావు తెలిపారు. -
ఉభయ తెలుగు రాష్ట్రాల బిలియర్డ్స్ పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల బిలియర్డ్స్ చాంపియన్ షిప్ పోటీలు రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను నేషనల్ బిలియర్డ్స్ చాంపియన్ దేవగుప్తాపు సుబ్బారావు ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు, రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి వి.భాస్కరరామ్ మాట్లాడుతూ బిలియర్డ్స్ క్రీడ గతంలో ఉజ్వలంగా సాగిందన్నారు. ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులు నగరంలో బిలియర్డ్స్ ఆడిన సందర్భాలున్నాయన్నారు. దేవగుప్తాపు సుబ్బారావు, న్యాపతి సుబ్బారావు ద్వయం బిలియర్డ్స్, స్నూకర్స్ పోటీల్లో నగరానికి ప్రపంచ గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 28 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో హెచ్‌బీవీ శర్మ, ఆకుల వీర్రాజు, చల్లా శంకరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటంబరంగా
ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు ముఖ్యఅతి«థులుగా హాజరైన ఆర్థికమంత్రి యనమల, రాజప్ప భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు గురువారం కాకినాడ జర్నలిస్టుల క్రీడోత్సవ్–2017 పేరుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రికెట్, కబడ్డీ, షటిల్ పోటీలకు సంబంధించి 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హాజరై మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడిని దూరం చేసే క్రీడా పోటీల్లో జర్నలిస్టులు పాల్గొనడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఏటా ఉప్పలగుప్తంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నీని నిర్వహించడం ఆహ్వానించదగ్గదని, నాయకులు ఎంత బిజీగా ఉంటారో జర్నలిస్టులు సైతం అంతే బిజీగా ఉంటారన్నారు. కార్యక్రమానికి కాకినాడ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వి.సి.వెంకటపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ క్రీడాపోటీలు నిర్వహించి జర్నలిస్టులకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందివ్వాలని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, జేఎన్టీయూకే వీసీ కుమార్, శాప్ ఎండీ నల్లపురాజు బంగార్రాజు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, డీఎస్డీఓ మురళీధర్, డీఈవో పి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. -
24 నుంచి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
బ్రోచర్, ఆహ్వాన పత్రిక విడుదల ఉప్పలగుప్తం (అమలాపురం) : మహాశివరాత్రి, కోనసీమ ఉత్సవ శోభ ఉత్సవాలను పురస్కరించుకుని గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుంచి ఐదు రోజుల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల బ్రోచర్, ఆహ్వాన పత్రికలను బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేశారు. గొల్లవిల్లిలోని చినరాజప్ప కల్యాణ మంటపంలో టోర్నీ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు అధ్యక్షతన టోర్నీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్నేళ్లుగా అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడాకారులు హజరవుతారని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. టోర్నీ కోశాధికారి, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య. కార్యదర్శి మద్ధింశెట్టి సుబ్బరాజు (సురేష్) మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు, గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొలకోటి సత్తిరాజు, సాంకేతిక పర్యవేక్షకులు ఉండ్రు రాజబాబు, సభ్యులు షేక్ చినవలీ, సలాది సత్తిబాబు, గుర్రాల దుర్గాప్రసాద్, నిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్రకుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, అమలాపురం జోన్ పీఈటీల సంఘ అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, ఎస్సై డి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ జిల్లాలో సాక్షి ముగ్గుల పోటీలు
-
శ్రీప్రకాష్‌లో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం
తుని : సినిమారంగంలో మహానటులుగా ప్రజల అభిమానాన్ని పొందిన ఎందరికో నాటకరంగం మాతృమూర్తి వంటిదని జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసౌధంలో గురువారం రాత్రి ‘అజో- విభో కందాళం ఫౌండేషన్, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్, కల్చరల్ అసోసియేషన్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలుగు నాటకరంగంలో ఒక విశిష్ట వ్యక్తికి చిరు సత్కారం పేరిట శ్రీ ప్రకాష్ పూర్వ విద్యార్థి, రాజస్థాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తూము శివ ప్రసాద్‌ను సత్కరించారు. విదేశాల్లో ఉంటూ అజో విభో కందాళం ఫౌండేషన్ స్థాపించి తెలుగు నాటికలను ప్రజలకు అందించిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ రూపొందించిన వైజయంతి సమ్మోనోత్సవ విశేష సంచికను విజయ్‌ప్రకాష్, కథానాటికలు–2017 పుస్తకాన్ని దంటు సూర్యారావు ఆవిష్కరించారు. దంటు సూర్యారావు, కేఆర్జే శర్మ, ఎన్.తారకరామారావు, డి.రామకోటేశ్వరరావు, డాక్టర్ కె.వీర్రాజు, ఆహ్వానసంఘం కన్వీనర్ డీఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి పాల్గొన్నారు. తొలిరోజు ‘నాన్నా! నువ్వు సున్నావా?’, ‘గోవు మాలచ్చిమి’, ‘దగ్ధగీతం’ నాటికలను ప్రదర్శించారు. -
ఎస్జీఎస్ అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాల బాలికల 62వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తి వెంటి పేర్రాజు పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కృత్తివెంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల ఎం సూర్యమోహన్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ ఎస్జీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. జిల్లా వృత్తి విద్యాధికారిణి కె హెప్సీరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్జీఎఫ్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి మాట్లాడుతూ ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి బాలురు, 10 జిల్లాల నుంచి బాలికలు పాల్గొంటున్నారన్నారు. ఈనెల 30వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎస్జీఎఫ్ ఏపీ ప్రతినిధి, అబ్జర్వర్ వి సీతాపతిరావు మాట్లాడుతూ జనవరి 9 నుంచి జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు కృష్ణాజిల్లా నూజివీడులో జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక రామచంద్రపురంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, బాస్కెట్‌బాల్ సీనియర్ క్రీడాకారులు బాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల ముత్యాల సత్యనారాయణ, హెచ్ఎం జీ రాంప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్ర టీమ్‌లో జిల్లా నుంచి 'ఫణీంద్ర' ప్రాతినిధ్యం వచ్చె నెల చత్తీస్‌ఘడ్‌లో పోటీలు కొత్తపేట : జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ అండర్ –17 పోటీలకు కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పాటి ఫణీంద్రసాయి ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న ఫణీంద్రసాయి అత్యుత్తమ ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు సోమవారం తెలిపారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాజనందిగామ్లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ స్టేట్ టీమ్ 12 మందిలో (6వ) స్థానానికి ఎంపికైనట్టు తెలిపారు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపుతానని ఫణీంద్రసాయి ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాని వివరించారు. ఫణీంద్రసాయిని హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు, ఎన్సీసీ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు, పీడీ భమిడిపాటి అప్పాజీ, పీఈటీ పి.జ్యోతి అభినందించారు. -
క్షీర సమరం
మండపేటలో రాష్ట్రస్థాయి పాలపోటీలు డిసెంబరు 15వ తేదీ నుంచి 17 వరకు నిర్వహణ పలు విభాగాల్లో పశువుల అందాల పోటీలు క్షీర సమరానికి మరోమారు ఆంధ్రా హర్యానా వేదికవుతోంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులు పాటు మండపేటలో జరిగే పోటీల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఐదు విభాగాల్లో పాల పోటీలు, మూడు విభాగాల్లో పశు ప్రదర్శన పోటీలు జరుగనున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాడిరైతులు తమ పాడిపశువులను పోటీలకు తీసుకువస్తారని అధికారులు భావిస్తున్నారు. - మండపేట మేలుజాతి పశు పోషణ ద్వారా ఇప్పటికే మండపేట ప్రాంతం (మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలు) ఆంధ్రా హర్యానాగా పేరుగాంచింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన పలు పాలపోటీల్లో ఇక్కడి రైతులు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. మేలుజాతి పశుపోషణపై వీరికున్న మక్కువ, అవగాహన ఈ ప్రాంతానికి ఆ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 2007 నుంచి ఇప్పటి వరకు మండపేటలో ఐదు పర్యాయాలు రాష్ట్ర స్థాయి పాల పోటీలు నిర్వహించగా ప్రస్తుతం ఆరో సారి పోటీలు జరుగుతున్నాయి. ఇందుకు మండపేటలోని మారేడుబాక రోడ్డులో గల సూర్యచంద్ర పేపర్‌మిల్స్ సమీపం స్థలం వేదిక కానుంది. పాల పోటీల నిర్వహణ ఇలా.. ముర్రా, జాఫర్‌బాది జాతి గేదెలు, ఒంగోలు, గిర్, పుంగనూరు ఆవుల విభాగాల్లో పాలపోటీలు నిర్వహిస్తున్నారు. రోజుకు 15 లీటర్లకు పైబడి పాలిచ్చే ముర్రా, జాఫర్‌బాది జాతి గేదెలు, 8 లీటర్లకు పైబడి పాలిచ్చే ఒంగోలు, గిర్, ఐదు లీటర్లకు పైబడి పాలిచ్చే పుంగనూరు ఆవులు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తొలిరోజు సాయంత్రం తీసిన పాలను నమూనాగా పరిగణిస్తారు. రెండో రోజు ఉదయం, సాయంత్రం, మూడో రోజు ఉదయం పాలు తీసి ఏప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ కాటాపై తూకం వేస్తారు. 20 నిముషాల వ్యవధిలోనే పాలు తీయాల్సి ఉంటుంది. తొలి రోజు నమూనా పాలదిగుబడికి తదుపరి పాలదిగుబడికి రెండు కేజీలకు పైబడి వ్యత్యాసం ఉంటే ఆ పశువును పోటీ నుంచి తొలగించనున్నట్టు పశువైద్యాధికారులు తెలిపారు. ప్రోత్సాహక బహుమతులు పాలపోటీలకు సంబంధించి ఒంగోలు ఆవులు, ముర్రా, జాఫర్ జాతుల గేదెల విభాగాల్లో ప్రధమ బహుమతి రూ.50 వేలు చొప్పున కాగా, ద్వితీయ రూ. 40 వేలు తృతీయ బహుమతిగా రూ.30 వేలు చొప్పున అందించనున్నారు. గిర్, పుంగనూరు జాతుల ఆవుల విభాగాల్లో ప్రధమ రూ. 40 వేలు చొప్పున, ద్వితీయ రూ. 30 వేలు చొప్పున, తృతీయ రూ. 20 వేల చొప్పున పాడిరైతులకు బహుమతులుగా అందజేయనున్నారు. పశు ప్రదర్శన ఒంగోలు, పుంగనూరు, గిర్ జాతుల ఆడ, మగ విభాగాల్లో ముర్రా జాతికి చెందిన ఆడ, మగ విభాగాల్లో పశుప్రదర్శన పోటీలు జరుగుతాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్లు వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. మూడు విభాగాల్లో మొదటి బహుమతిగా రూ. 10 వేలు చొప్పున, ద్వితీయ రూ. 7,500లు చొప్పున, తృతీయ రూ. 5 వేలు చొప్పున పాడిరైతులకు నగదు బహుమతులు అందజేస్తారు. -
ఆటంకాలే
గ్రిగ్పోటీలకు దక్కని బాసట ప్రభుత్వం నుంచి నిధులు లేవు జెడ్పీ నుంచి దక్కని చేయూత పెద్దనోట్లకు చిల్లరి లేదు భారంగా మారిన జోనల్ గ్రిగ్ పోటీలు అమలాపురం : పాఠశాల స్థాయిలో జరిగే జోనల్ గ్రిగ్ పోటీలకు నిధులు కొరత పట్టిపీడిస్తోంది. ఈ పోటీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందలేదు. గతంలో జెడ్పీ నుంచి మైదానం అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిలిచిపోయాయి. దాతల సహాయం తీసుకుందామన్నా.. పెద్దనోట్లు పెద్ద సమస్యగా మారాయి. దీంతో పోటీల నిర్వహణ ప్రహసనమైంది. జెడ్పీ మొండి చేయి చూపడంతో.. పాఠశాల స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే గ్రిగ్ పోటీలు జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆరంభమయ్యాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ రెండు నుంచి ప్రారంభం కావల్సి ఉండగా, నిర్వహణ భారం మోయలేక కొన్ని పోటీలను ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు నిధుల కొరత పట్టిపీడిస్తోంది. పోటీల నిర్వహణకు జోన్ స్థాయిలో రూ.మూడు లక్షలు, సెంట్రల్ జోన్ పోటీలకు రూ.రెండు లక్షలు ఖర్చవుతోంది. తొలి నుంచి పోటీలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేదు. పోటీల్లో పాల్గొనే ఆయా పాఠశాలలు ఎంట్రీ ఫీజులు, అప్లికేషన్ ఫీజులు చెల్లించే రుసుమునే ఆయా పాఠశాలలకు రూ.పది వేల చొప్పున కేటాయిస్తున్నారు. గతంలో మైదానాల అభివృద్ధి పేరుతో జిల్లా పరిషత్ రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది జెడ్పీ కూడా మొండిచేయి చూపించింది. దీంతో పోటీల నిర్వాహకులు దాతలు అందించే సహాయంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. తీరా నోట్ల రద్దుతో పెద్దనోట్లు మారకపోవడం, చిల్లరి నోట్లు దొరకక నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తనోట్లు లేకపోవడం, పాతనోట్లు తీసుకోకపోవడంతో పోటీలు నిర్వహించలేకపోతున్నారు. అమలాపురం జోన్ బాలుర గ్రిగ్ పోటీలు ఈ ఏడాది అయినవిల్లి మండల కొండుకుదురుకు కేటాయించారు. నిర్వహణ భారమైనా పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజోలు, రామచంద్రపురం, రంపచోడవరం, తుని, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం జోన్లలో బాలురు, బాలికల క్రీడాపోటీల నిర్వహణకు సైతం ఇవే ఇబ్బందులున్నాయి. పక్కదారినపడుతున్న ఖేల్‌రత్న నిధులు మూడు, నాలుగు రోజుల పాటు వందల మంది విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించే గ్రిగ్ పోటీల నిర్వహణకు నిధులు లేవు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యే ఖేల్‌రత్న(గతంలో పైకా) పోటీలకు మాత్రం నిధులిస్తున్నారు. మండల స్థాయిలో రూ.30 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.40 వేలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకువెళుతున్నారు. కేటాయిస్తున్న నిధులను చాలా మంది ఎంపీడీఓలు నొక్కేస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఇలా అవసరమైన చోట నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట సద్వినియోగం కాకపోవడం పాఠశాల స్థాయి క్రీడాకారులకు శాపంగా మారింది. ప్రత్యేకంగా నిధులివ్వాలి పాఠశాలల్లో క్రీడా పోటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. నిర్వహణకు లక్షల్లో ఖర్చుపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఖేల్‌రత్నకు ఇస్తున్నట్టుగా జోనల్ గ్రిగ్ పోటీలకు సైతం ప్రభుత్వం నిధులివ్వాలి. – ఉండ్రు ముసలయ్య, అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు. -
కరీంనగర్లో మిస్ కరీంనగర్ పోటీలు
-
జాతీయస్థాయి తెలుగు పాటల పోటీలు
నరసరావుపేట ఈస్ట్ : మహాత్మా గాంధీ–పొట్టి శ్రీరాములు కళాసమితి, సేవా సింధూ సంస్థల ఆధ్వర్యంలో వేగాస్ ఫౌండేషన్ సౌజన్యంతో జాతీయస్థాయి తెలుగు పాటల పోటీలు ఆదివారం రాత్రి భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించారు. ఈ పోటీలలో సీహెచ్ స్టాలిన్ (బాపట్ల), జి.హిమబిందు (అద్దంకి), రమణపాత్రో (పార్వతీపురం) బహుమతులు సాధించారు. అలాగే ప్రోత్సాహక బహుమతులను సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎ.శ్రుతి, ఎం.మల్లిఖార్జునరావులకు అందించారు. ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎన్ఇసి విద్యా సంస్థల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, రాష్ట్ర బులియన్ మర్చంట్ అధ్యక్షులు కపిలవాయి విజయకుమార్, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అ««దl్యక్షులు ఊరా భాస్కరరావు తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. వాగిచర్ల వెంకటేశ్వరరావు, వై.త్యాగరాజు, షేక్ సలాం తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
క్విజ్ పోటీ విజేతలకు అభినందనలు
నారాయణగూడెం(మునగాల): గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మండలం పెదకాపర్తి గాంధీ గుడి సభ్యులు ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో మండలంలోని నారాయణగూడెం విద్యార్థినులు ప్రథమ బహుమతి సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసుకుల రామారావు సోమవారం అభినందించారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు డి.లెనినా, డి.స్టాలినా, బి.శిరీషాలు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. గతంలో కూడ వీరు జిల్లాస్థాయిలో పలు పోటీల్లో తమ ప్రతిభను చాటుకొని పాఠశాలకు గుర్తింపు తీసుకవచ్చారని కొనియాడారు. భవిష్యత్‌లో వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని మరిన్ని బహుమతులు గెలుచుకోవాలని రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డి.శ్రీనివాస్. పీవీ నారాయణ, డి.నాగేశ్వరరావు, ఎం.వెంకటేశ్వర్లు, ఈ.కిరణ్, ఎస్.జయలక్ష్మి, బి.మంగమ్మ పాల్గొన్నారు. -
రసవత్తరంగా క్యారమ్స్ పోటీలు
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని సీఆర్ క్లబ్లో రాష్ట్రస్థాయి సెకెండ్ ర్యాంకు క్యారమ్స్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. క్లబ్ స్థాపించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు శుక్రవారం రెండోరోజు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యారమ్ బోర్డు ప్లేయర్లు పోటీలలో పాల్గొంటున్నారు. పోటీలను పురుషులు, మహిళ విభాగాల్లో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి సౌత్ ఇండియా స్థాయిలో పోటీలు ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతాయని క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు తెలిపారు. -
రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
బాపట్ల : మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామంలో రాష ్ట్రస్థాయి ఎడ్లపందేలు గురువారం రసవత్తరంగా సాగాయి. 15 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొనగా 3 క్వింటాళ్ల ఎద్దులు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాలనే నిబంధన పెట్టారు. పోలురాద పద్ధతిలో బండిచక్రాలు కదలకుండా కట్టి ఎక్కువ దూరంగా ఏ ఎడ్ల జత లాగితే వారికి బహుమతులు ఇచ్చే విధంగా పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతగా రాధాకృష్ణ వ్యవహరించగా గురువారం రాత్రి మూడు జతలు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాయి. రాత్రికి కూడా పోటీలు నిర్వహించి శుక్రవారం బహుమతులు ఇచ్చేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీల నిర్వాహకులుగా గవిని వెంకటేశ్వర్లు, మరుప్రోలు చెన్నకేశ్వరెడ్డి, కోకి శ్రీనివాసరెడ్డి, నాయుడు శ్రీరామమూర్తిరెడ్డి, సత్యంరెడ్డి, మంచాల శ్రీనివాసరెడ్డి, కావూరు రామకృష్ణారెడ్డి, మామిడాల ఏడుకొండలరెడ్డి, కావూరు శేషారెడ్డి వ్యవహరించారు. పోటీలు చూసేందుకు ఆయా గ్రామాల నుంచి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.