పిల్లలను క్రీడల్లోనూ ప్రోత్సహించాలి
పిల్లలను క్రీడల్లోనూ ప్రోత్సహించాలి
Published Sun, Jul 9 2017 11:42 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
– రూ 4.50 కోట్లతో రాజమహేంద్రవరం స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలి
–ముగిసిన టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ పోటీలు
తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉన్న త్యాగరాయ నారాయణదాస సేవాసమితి పం„క‌్షన్ హాలులో రాష్ట్ర స్థాయి రెండోవ టేబుల్ టెన్నిస్ పోటీలు మూడు రోజుల పాటు జరిగాయి. పురుషులు, మహిళ, యూత్‌బాయ్స్, యూత్ గరల్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ గరల్స్, సబ్ జూనియర్, మినీకెడిట్, డబుల్ తదితర 14 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి నగరానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నగరంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కార్పొరేటర్లతో చర్చించి స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్టేడియం నిర్మాణానికి ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్ రూ.మూడు కోట్ల నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వం ఇచ్చే నిధులతో స్టేడియం అభివృద్ధి చే స్తామని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రావు చిన్నారావు, కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, నన్నయ్య యూనివర్సీటీ పీడి ఏ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement