table
-
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్‌ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్‌కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్‌ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్లే ఆఫ్స్ కి వెళ్లే టీం ఏవి?
-
ఆ సార్లకు తలవంచి ధన్యవాదాలు చెబుతున్నా: బలగం మొగిలయ్య
హైదరాబాద్: నిమ్స్‌లో ‘బలగం’ మొగిలయ్యకు చికిత్స కొనసాగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు వైద్యనిపుణులు నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. ఛాతి నొప్పి రావడంతో మెరుగైన చికత్స నిమిత్తం వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆయన దీర్ఘకాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి మొగిలయ్య కంటి చూపునూ కోల్పోయారు. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను గురువారం నిమ్స్ పాత భవనంలోని ఎఫ్ బ్లాక్ స్పెషల్ రూమ్‌కు తరలించి డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో మొగిలయ్య ఉన్నాడని ఆయన భార్య కొమురమ్మ కన్నీటి పర్యంతమైంది. అయనకు మెరుగైన వైద్యం అందించడానికి సాయపడుతున్న మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆయా సార్ల సాయంతో నిమ్స్‌కు వచ్చిన మొగిలయ్య ఆరోగ్యం గురించి మరెంతో మంది పెద్ద సార్లు ఆందోళన చెందుతున్నారని.. ఇప్పటికీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, నిర్మాత దిల్ రాజు, బలగం దర్శకులు వేణు ఇంకా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. -
కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?
‘‘డిజిటల్ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్ బిగ్ అని ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు. బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది. కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్ వేస్ట్ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆడపిల్ల పుట్టాలి... చదవాలి! ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం. యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్ కమిషనర్. నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు! నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం చేశాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి. టైలరింగ్ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్మెంట్ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్మెంట్లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను. – కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్
రాబోయే రోజులన్నీ రీ సైక్లింగ్ డేసే. ఉన్నవాటిని పొదుపుగానే కాదు కళాత్మకంగా వాడుకునే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని గతానుభవాలు కళ్లకు కడుతున్నాయి. వాటిలో ఇంటిని శారీ‘కళ’తో ఇంపుగా తీర్చిదిద్దడం ప్రస్తుత ట్రెండ్. అది ఎలా శోభిల్లుతుందో చూద్దాం.. వాల్ డెకర్ ఎంబ్రాయిడరీ చేసే ఫ్రేమ్స్ మార్కెట్లో లభిస్తాయి. వీటికి మీ పాత చీరలను డిజైన్లను బట్టి ఎంచుకొని, వాటిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను కావల్సిన విధంగా కట్ చేసుకొని, ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ మీ ఇంటి వాల్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు ఫ్యాబ్రిక్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ ఎంచుకోవచ్చు. టేబుల్ మ్యాట్ ఉడెన్ లేదా గ్లాస్ టేబుళ్లు బోసిగా ఉంటే వాటిని చీర అంచులతో మెరిపించవచ్చు. సగం శారీని టేబుల్ కవర్గానూ, మిగతా భాగాన్ని ప్లేట్స్ పెట్టుకునే మ్యాట్స్గానూ డిజైన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మాత్రమే కాదు సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ సోఫా కవర్గానూ జరీ అంచు చీరను అందంగా మలచవచ్చు. ఆ కళను కళ్లారా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల మన్ననలూ పొందవచ్చు. కాటన్ ఇక్కత్ల కళ టేబుల్ మ్యాట్స్‌లో విశేషంగా ఆకట్టుకుంటున్న డిజైన్స్ ఇక్కత్ కాటన్ శారీతో రూపొందినవి. గ్లాస్ హోల్డర్స్, బౌల్ మ్యాట్స్గానూ తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది చక్కటి ఈ ఫ్యాబ్రిక్. కిటికీ తెరలు పాత జరీ అంచు చీరలు ఉంటే, వాటిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించనక్కర్లేదు. చిన్నపాటి మార్పులతో విండోస్‌కి కర్టెన్స్‌గా వాడుకోవచ్చు. శారీ కొనుగోలు చేసిన సందర్భం లేక ఎవరైనా కానుకగా ఇచ్చుంటే ఆ జ్ఞాపకాలను గాలితో పాటు మోసుకొచ్చి మీ మనసును తడతాయి తెరలు తెరలుగా. కుషన్ కవర్ మార్కెట్లో లభించే కవర్స్తోనే కుషన్స్‌ని అలంకరించాలని రూలేం లేదు. ఇప్పుడు జరీ చీరల కవర్లు కుషన్స్‌ని మరింత కళగా మార్చేస్తున్నాయి. వీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే ఇంట్లో ఆ కళాత్మకత అంతగా పెరుగుతందనేది నేటి హోమ్ డెకర్ లవర్స్ మాట. -
వధువరుల గ్రాండ్ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్ వీడియో..
-
వధువరుల గ్రాండ్ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్ వీడియో..
వివాహ వేడుకను ప్రతి ఒక్కరు తమ జీవితకాలమంతా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ప్రీవెడ్డింగ్ షూట్ మొదలుకొని.. అప్పగింతల వరకు ప్రతి కార్యక్రమాన్ని వీడియో రూపంలో భద్రపరుచుకుంటున్నారు. వివాహన్ని ట్రెండ్‌కు తగ్గట్టుగ నిర్వహించుకోవడానికి యువత ఎంత ఖర్చుకైన వెనకాడటం లేదు. పెళ్లికి సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ..ఈ కోవకు చెందిన ఒక పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేటి యువత తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఈ వివాహంలో.. వధువరులు ప్రత్యేకంగా తమ పెళ్లిమండపానికి చేరుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగా.. ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఆ బల్లను గాలిలో ఒక వాహనం సహయంతో పైకి ఎత్తేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో.. అందంగా ముస్తాబైన.. వధువరులు బల్లపై కూర్చుని మండపం వైపు వస్తున్నారు. వేడుకకు హజరైన బంధువులు, స్నేహితులు వారి రాకను ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు కూడా మండపాన్ని, బంధువుల వైపు ఆనందంగా చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. పాపం.. వధువరులు ప్రయాణిస్తున్న బల్ల ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో వారు.. కింద పడిపోయారు. మండపంలో ఉన్న.. బంధువులంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని వధువరులను పైకి ఎత్తారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం.. బ్రైడ్స్ స్పెషల్ అనే ట్వీటర్ ఖాతాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం ఎంట్రీరా బాబు..’, ‘పాపం.. దెబ్బలేం తగల్లేవు కదా..’, ‘ ఇవేం.. ట్రెండీ ఆలోచనలు.. ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
టేబులే.. స్మార్ట్‌ఫోన్ ఛార్జర్!
పగలు ఆఫీసులో.. రాత్రి ఇంట్లో.. మన మొబైల్ఫోన్లు విశ్రాంతి తీసుకునే స్థలమేది? ఇంకేముంది.. టేబుల్ లేదా ఛార్జర్!. మరి... ఈ రెండు ఒక్కటైపోతే ఎలాగుంటుంది? ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. వివరాలు చూద్దాం. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్ న్యూ ఎనర్జీ ఓ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఉంచిన మొబైల్‌ఫోన్‌కు విద్యుత్తును అందించడం ఈబోర్డ్గా పిలుస్తున్న ఈ టేబుల్ ప్రత్యేకత. ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వాడే దీపాల వెలుగుతోనే విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఈబోర్డుపై ప్రత్యేకమైన సోలార్‌ప్యానెల్స్ ఉంటాయి. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో ఉంటే దాంతోనూ విద్యుదుత్పత్తి చేస్తుంది. మొత్తం 50 వరకూ ఛార్జింగ్ కాయిల్స్ కూడా ఏర్పాటు చేసిన ఈ టేబుల్‌పై ఎక్కడ ఫోన్ ఉంచినా ఛార్జింగ్ అవుతుంది. ఏకకాలంలో నాలుగు స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. కీ ఛార్జింగ్ ప్లాట్ఫార్మ్ను వాడుకుంటున్నందున ఈ టేబుల్ ద్వారా ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్ 3, 3ఎక్స్ ఎల్లతోపాటు సోని, నోకియా, ఎల్జీ వంటి ఫోన్లను స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కీ ఛార్జింగ్ ప్లాట్ఫార్మ్ను వాడకపోతే అడాప్టర్లను వాడాల్సి ఉంటుంది. ఈ వినూత్న టేబుల్‌పై తాము సముద్ర బ్యాక్టీరియా తాలూకూ ప్రొటీన్‌తో తయారైన త్వచాన్ని వాడామని.. ఫలితంగా తక్కువ కాంతిలోనూ విద్యుత్తును ఉత్పత్తి చేయడం వీలవుతుందని కంపెనీ చెబుతోంది. -
పిల్లలను క్రీడల్లోనూ ప్రోత్సహించాలి
– రూ 4.50 కోట్లతో రాజమహేంద్రవరం స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలి –ముగిసిన టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ పోటీలు తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉన్న త్యాగరాయ నారాయణదాస సేవాసమితి పం„క్షన్ హాలులో రాష్ట్ర స్థాయి రెండోవ టేబుల్ టెన్నిస్ పోటీలు మూడు రోజుల పాటు జరిగాయి. పురుషులు, మహిళ, యూత్బాయ్స్, యూత్ గరల్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ గరల్స్, సబ్ జూనియర్, మినీకెడిట్, డబుల్ తదితర 14 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి నగరానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నగరంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కార్పొరేటర్లతో చర్చించి స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్టేడియం నిర్మాణానికి ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్ రూ.మూడు కోట్ల నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వం ఇచ్చే నిధులతో స్టేడియం అభివృద్ధి చే స్తామని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రావు చిన్నారావు, కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, నన్నయ్య యూనివర్సీటీ పీడి ఏ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా టీటీ పోటీలు
ఫైనల్‌కు చేరిన ఛార్వీపల్గున్ నేటితో పోటీల ముగింపు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) : ఏపీ స్టేట్ రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక గోదావరి గట్టు వద్ద ఉన్న త్యాగరాయ దాసాసేవా సమితి హాల్లో నిర్వహించిన రెండో రోజు పోటీల్లో రాష్ట్రంలోని 39 మంది పురుషులు, 80 మంది బాలికలు తలబడ్డారు. వీరిలో కేడెట్ బాలికల విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన ఛార్వీపల్గున్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. ఏపీ స్టేట్ ప్రథమ ర్యాంకింగ్ పోటీలు గత నెలలో విజయవాడలో నిర్వహించారు. త్వరలో గుంటూరు, విశాఖపట్నంలో కూడా పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురంలో ఫైనల్స్ నిర్వహించి నేషనల్‌కు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. క్రీడాకారులకు ఉచిత శిక్షణ రాజమహేంద్రవరం నుంచి ఎందరో ఆటగాళ్లను తయారుచేసే అవకాశం ఉంది. దేశం తరఫున ఆడే సత్తాగల క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. ఒక్క టేబుల్ టెన్నిస్‌కే కాదు ఏ క్రీడాలోనూ శిక్షణ పొందేందుకు ఇక్కడ స్టేడియం లేదు. ఆటగాళ్లను తయారు చేయాలంటే అన్ని వనరులు ఉండాలి. నగరంలో టౌన్‌హాలు ఎదురుగా ఉన్న టీటీ అకాడమీలో 72 మందికి టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాం. రాజమహేంద్రవరంలో సొంతంగా 15 టేబుళ్లతో స్టేడియం నిర్మించనున్నాం. అక్కడ ఉచితంగా టీటీ శిక్షణతో పాటు యోగా, జిమ్ వంటివి ఎన్నో అందుబాటులోకి తీసుకువస్తాం –వి.భాస్కర్రామ్, ఏపీ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర అధ్యక్షుడు బాగా ఆడుతున్నారు టేబుల్ టెన్నిస్‌లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. వీరిలో ప్రతిభగల వారిని ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి నేషనల్స్, ఒలింపిక్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజమహేంద్రవరంలో జరుగుతున్న రెండో ర్యాంకింగ్ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారందరికీ తగు ఏర్పాట్లు చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మంచి టీటీ క్రీడాకారులను తయారుచేస్తాం. - ఎస్.ఎం.సుల్తాన్, ఏపీ టీటీ రాష్ట్ర కార్యదర్శి నా కుమార్తెను ప్రోత్సహిస్తున్నాం నా కుమార్తె ఆశ్రిత సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో తలపడుతోంది. చిన్నప్పటి నుంచే టేబుల్ టెన్నిస్‌పై ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో మేము ఆమెను ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ టోర్నీ జరిగినా అందులో పోటీ పడుతోంది. ఆమె జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించాలని కోరుకుంటున్నాం. - టి.సునీల, టీటీ క్రీడాకారిణి తల్లి, వైజాగ్ ఒలింపిక్ పతకం సాధిస్తా ఏలూరులో జరిగిన టోర్నమెంట్ కేడెట్లో గోల్డ్ మెడల్ సాధించా. చిన్నప్పటి నుంచి టీటీ అంటే చాలా ఇష్టం. మా నాన్న గారు మంచి టీటీ క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తితో ఈ ఆటపై మక్కువ ఏర్పడింది. ఒలిపింక్ పతకం తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నా. - ఛార్వీపల్గున్, టీటీ క్రీడాకారిణి, రాజమహేంద్రవరం టీటీ అంటే ఎంతో ఇష్టం టేబుల్ టెన్నిస్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఇప్పటికే చాలా టోర్నమెంట్లలో ఆడాను. పలు పతకాలు వచ్చాయి. వాటన్నింటికన్నా దేశానికి పేరు తెచ్చేలా ఒలింపిక్ పతకం సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉన్నా. - శైలునూర్ బాషా, టీటీ క్రీడాకారిణి, విజయవాడ 15 గోల్డ్ మెడల్స్ సాధించా ఇప్పటి వరకూ ఎన్నో టోర్నీల్లో పాల్గొన్నా. 12 నేషనల్స్ ఆడాను. రాష్ట్ర స్థాయిలో 15 ప్రథమ స్థానాలు సాధించి గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నా. జాతీయ స్థాయి పోటీలంటే చాలా ఇష్టం. మరింత ముందుకు వెళ్లాలని ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. - డి.రాహుల్, టీటీ క్రీడాకారుడు, రాజమహేంద్రవరం స్పోర్ట్ కోటాలో ఉద్యోగం చిన్నప్పటి నుంచి టీటీ అంటే ఎంతో ఇష్టం. ఇçప్పటి వరకూ 300 పైగా టోర్నీలు ఆడాను. ఆటలపై నాకున్న మక్కువతోనే నాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. టేబుల్ టెన్నిస్‌లో ఇండియా తరఫున ఆడాలనే లక్ష్యంతో ఉన్నాను. - చల్లా ప్రణీత, టీటీ క్రీడాకారిణి, విజయవాడ -
జీఎస్టీపై పోరాటం
11న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ‘జీఎస్టీ-ప్రజలపై దాని ప్రభావం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం రాజమహేంద్రవరం సిటీ : సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విషయంలో ప్రజలకు న్యాయం జరిగే వరకూ సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని, దేశంలోని పార్లమెంట్ సభ్యుల సహకారంతో పార్లమెంట్లో చర్చిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు, జీఎస్టీ ప్రజలపై దాని ప్రభావం అనే అంశంపై శుక్రవారం రాజమహేంద్రవరం వై.జంక్షన్ ఆనం రోటరీ హాల్లో సీపీఐ ఆద్వర్యంలో అఖిలపక్షనేతలు, వ్యాపారులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో జీఎస్టీ పై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న విధానాన్ని భారతదేశంలో అమలు చేయడం దారుణమన్నారు. నూతన చట్టం అమలుతో ఇప్పటికే చిరువ్యాపారులు, చేనేతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 28 శాతం పన్ను మన దేశంలోనే ఉందని మండిపడ్డారు. సామాన్యప్రజలకు న్యాయం జరిగే వరకూ ïసీపీఐ ఆద్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. జీఎస్టీ విషయమై ఈ నెల 11న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కొత్త చట్టం ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. దాన్ని అమల్లోనికి తీసుకువచ్చే అధికారులకు సైతం అవగాహన లేని పరిస్థితి ఉందన్నారు. సీపీఐ తమ పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధానమంత్రితో చర్చ ఏర్పాటు చేస్తే తాను పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.యూపీఏ పాలనలో జీఎస్టీ 18 శాతం ఉండేలా ప్రతిపాదనలు చేస్తే మొదటగా వ్యతిరేకించింది మోడీయేనని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి,కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఏమాత్రం అవగాహాన లేని చట్టాన్ని అమల్లోనికి తీసుకుని వచ్చారన్నారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టే విధంగా అమల్లోనికి వచ్చిన జీఎస్టీ ప్రజలను సైతం ఆర్థికంగా ఇబ్బందిపెట్టే విధంగా తయారైందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ వ్యాపారాన్ని వృత్తిగా చూడాలన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ సుబ్బారాయుడు, హోల్‌సేల్ బట్టల వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బొమ్మనరాజ్‌కుమార్, సీపీఐ జిల్లా నాయకులు మధు, నగర కార్యదర్శి నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
స.హ చట్టం ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు
– ఫోరం ఫర్ ఆర్టీఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి – దేశానికే నష్టం: వైఎస్సార్సీపీ నేత కందుల దుర్గేష్ సాక్షి, రాజమహేంద్రవరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కారు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, ఆర్టీఐ కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఫోరం జిల్లా కన్వీనర్ వరదా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల 70 శాతం అవినీతి అంతమవుతుందన్న సమయంలో ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దీన్ని రాజకీయ నేతలు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. స.హ. చట్టానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తమ పార్టీ నేతలతో చర్చించి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆర్టీఐ లేకపోతే దేశానికే నష్టమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ తమ పార్టీ తరఫున చట్ట సవరణకు వ్యతిరేకత తెలియజేస్తామని చెప్పారు. కార్పొరేటర్ కోసూరి చండీ ప్రియ మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టీఐ చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పిల్లి నిర్మల, రెడ్డి పార్వతి, పితాని లక్ష్మి కుమారి, ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ కార్యకర్త చేతన్, జనం పత్రిక సంపాదకులు కె.వెంకటరమణ, బీసీ నేత హారిక, తదితరులు పాల్గొన్నారు. -
టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం
–ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్ టెన్నిస్ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గె, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాము, చీఫ్ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్దాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విజేతలు... సబ్‌జూనియర్ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్శంకర్–కెశవన్కన్నన్పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్ బాలురలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–చంద్రచూడ్ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు. బాలికల విజేతలు : సబ్‌జూనియర్ బాలికల ఫైనల్స్‌లో అయేష్–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు -
టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం
–ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్ టెన్నిస్ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గె, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాము, చీఫ్ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్దాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విజేతలు... సబ్‌జూనియర్ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్శంకర్–కెశవన్కన్నన్పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్ బాలురలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–చంద్రచూడ్ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు. బాలికల విజేతలు : సబ్‌జూనియర్ బాలికల ఫైనల్స్‌లో అయేష్–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు -
టీటీకి పెరుగుతున్న ఆదరణ
మేయర్ రజనీ శేషసాయి రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ ప్రారంభం మూడు రోజులు జరగనున్న పోటీలు రాజమహేంద్రవరం సిటీ : టేబుల్ టెన్నిస్‌కు ఆదరణ పెరుగుతోందని మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డులోని ఎస్వీ ఫంక్షన్ హాలులో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. మొదటి ఆటను మేయర్, కార్పొరేటర్ చండీప్రియ ఆడి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఏపీ టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు వి.భాస్కరరామ్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నాయి. క్యాడెట్ బాలురు, బాలికలు; సబ్ జూనియర్ బాలురు, బాలికలు; జూనియర్ బాలురు, బాలికలు; యూత్ బాలురు, బాలికలు, మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. మొదటి రోజు క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ వీఆర్ ముక్కామల తెలిపారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు తరలివచ్చారన్నారు. ఎనిమిది టేబుళ్లపై 600 మ్యాచ్‌లు నిర్వహిస్తామని, వీటికి 20 మంది రిఫరీలుగా వ్యవహరిస్తారని వివరించారు. చివరి రోజు 20 మ్యాచ్‌లు మాత్రమే ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం టోర్నమెంట్లో బాలుర విభాగం నుంచి 80, మెన్స్ 65, యూత్ 85, జూనియర్స్ 85 దరఖాస్తులు అధికంగా వచ్చాయన్నారు. చీఫ్ రిఫరీగా ఎం.వేణుగోపాల్ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు జేవీవీ అప్పారెడ్డి, వీటీవీ సుబ్బారావు, ఫల్గుణ్ తదితరులు పాల్గొన్నారు. -
టేబుల్ ట్యాబ్లెట్
టెక్ టాక్ / కెనైటీ ట్యాబ్లెట్ కంప్యూటర్ అంటే పది అంగుళాల నుంచి 20 అంగుళాల సైజు ఉంటాయని ఊహించుకోవచ్చు. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఇది కూడా ఓ ట్యాబ్లెట్టే. పేరు కెనైటీ... సైజు మాత్రం ఏకంగా 42 అంగుళాలు. కాఫీ టేబుల్ మాదిరిగా దీనిపై వేడివేడి కాఫీ కప్పుల్ని ఉంచుకోవచ్చు.. లేదంటే మీకిష్టమైన కూల్‌డ్రింక్‌ను ఎంజాయ్ చేస్తూ కూడా ట్యాబ్లెట్‌ను వాడుకోవచ్చు. అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకునే విధంగా ఈ ట్యాబ్లెట్ ఉపరితలంపై దృఢమైన కార్నింగ్ 3 గొరిల్లా గ్లాస్ ఉంది మరి! ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉన్న కెనైటీ విండోస్ 10 ఆపరేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంట్లో ఉండే అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నియంత్రించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మీ చేతి కదలికలతోనే టీవీ ఛానళ్లు మార్చవచ్చు... స్మార్ట్‌ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను టీవీ తెరపై చూడవచ్చునన్నమాట. స్క్రీన్‌ను విభజించుకుని ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు వేర్వేరు అప్లికేషన్లను రన్ చేయవచ్చు కూడా. ఇటలీ కంపెనీ తయారు చేసిన ఈ హైటెక్ కాఫీ టేబుల్ ట్యాబ్లెట్ ధర దాదాపు రూ. నాలుగు లక్షలు. -
కార్పెట్ అలియాస్ టేబుల్
అసలే ఇరుకిళ్లు.. దాన్ని ఫర్నిచర్‌తో నింపేస్తే.. మరింత ఇరుకైపోతుంది. అలాంటిళ్ల కోసమే ఈ కార్పెట్. ఇది కార్పెట్.. అవసరమైనప్పుడు ఇలా టేబుల్‌గానూ మారిపోతుంది. దీన్ని ఇటలీకి చెందిన డిజైనర్ అలెగ్జాండ్రో ఐజోలా రూపొందించారు. కార్పెట్ల అంచుల్లో మడతలు పడటం వంటివి ఆయనకు నచ్చవట. దీంతో ఆ మడతలను కూడా అనుకూలంగా మార్చుకోవాలని డిసైడయ్యారు. అందుకే ఆ మడతలనే వంచితే.. టేబుల్లాగా మారేలా ‘స్టంబుల్ అపాన్’ అనే ఈ కార్పెట్‌ను తయారుచేశారు. ఈ కార్పెట్ కింది భాగం మెటాలిక్ తరహాలో ఉంటుంది. దీంతో దాన్ని మడవగానే.. టేబుల్ లుక్ వచ్చేస్తుంది. -
ఇదేం పని?
పేరుకే బాలల హక్కుల కమిషన్ కనీస సౌకర్యాలు నిల్ రెండు నెలల క్రితమే సర్కారుకు నోటీసులు లోకాయుక్త ఆదేశాలూ బేఖాతరు సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రంలో టేబుల్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. కానీ దాన్ని నిలబెట్టడానికి ఇటుకలు, రాళ్లు ఆధారంగా ఉంచాల్సిందే.. ఫ్యాన్లు, ఏసీ.. అన్నీ ఉన్నట్టే ఉంటాయి. పనిచేసేది అనుమానమే.. ఉన్నదే ఒక్క గది.. చూడబోతే స్టోర్‌రూమ్‌ను తలపిస్తుంది.. ఇదీ బాలల హక్కుల కమిషన్ దుస్థితి. ఆర్భాటంగా కమిషన్ ఏర్పాటైతే చేశారు కానీ.. అందులోని బాధ్యులెవరూ ఇక్కడ పట్టుమని పది నిమిషాలు కూర్చుని పనిచేసే పరిస్థితి లేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా (ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా) రహీముద్దీన్, పి.అచ్యుతరావు, ఎం.సుమిత్ర, ఎస్.మురళీధర్‌రెడ్డి, మమతా రఘువీర్, ఎస్.బాలరాజును నియమించింది. నెలైనా వీరికి కార్యాలయం సమకూర్చలేదు. దీంతో సభ్యులు కార్యకలాపాలను తమ ఇళ్ల నుంచే సాగించారు. కమిషన్ కష్టాలు పత్రికలలో రావడంతో లోకాయుక్త సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కమిషన్‌కు కార్యాలయం, సిబ్బందిని కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ శ్యాంసుందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నేటి వరకు లోకాయుక్త ఆదేశాలపై, నోటీసుపై ఎలాంటి స్పందన లేదు. తూతూ మంత్రంగా యూసుఫ్‌గూడలోని మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్యాలయంలో చిన్నపాటి గదిని మాత్రం ఇచ్చారు. అందులో ఆరుగురు సభ్యులకు కలిసి మూడంటే మూడే కుర్చీలు (అవి కూడా కాలు విరిగినవి) సమకూర్చారు. ఇక తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. సౌకర్యాలు ఈ రకంగా ఉంటే ఇక ఒక్కరంటే ఒక్క సిబ్బందినీ ఇంతవరకూ కేటాయించలేదు. 2013 జీఓ నెంబర్ 5 ప్రకారం కమిషన్ సభ్యులకు ఏ ఒక్క సౌకర్యం కల్పించలేదు. కార్యకలాపాలు సాగేందుకు వీలు లేక.. దీన స్థితిలో బాలల హక్కుల కమిషన్ ఉందంటే బాలలపై ప్రభుత్వం ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది. -
మాటలను ట్వీట్‌గా మార్చే ల్యాంప్
లండన్: మీ సన్నిహితులతో కలసి డిన్నర్ కోసం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లారా? అయితే మీ టేబుల్‌కు పక్కనే ఉన్న ల్యాంప్‌ను ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే.. ఆ ల్యాంప్ మీ సంభాషణలను రహస్యంగా విని.. మీ మాటలను యథాతథంగా ట్వీట్ చేసే అవకాశం ఉంది. ల్యాంప్ ఏంటి.. సంభాషణలను ట్వీట్ చేయడం ఏమిటీ? అని ఆశ్చర్యపోకండి.. అమెరికాకు చెందిన పరిశోధకులు కైల్ మెక్‌డోనాల్డ్, బ్రియాన్ హౌస్.. సంభాషణలను వినీ వాటిని ట్వీట్ చేసే సామర్థ్యం ఉన్న ల్యాంప్‌ను అభివృద్ధిపరిచారు. ఇది తనకు సమీపంలోని శబ్దాలను సంగ్రహించి.. వాటిని తనకు దగ్గరలోని వై-ఫై ఇంటర్నెట్ ద్వారా ఓ ట్విటర్ అకౌంట్‌కు ట్వీట్ల రూపంలో అప్లోడ్ చేస్తుంది. ఒక ప్లాస్టిక్ కుండీలో ఉండే ఈ ల్యాంప్ ధర రూ. 6 వేలు. ఈ ల్యాంప్‌లో మినీ కంప్యూటర్, మైక్రోఫోన్, ఎల్ఈడీ ఉంటాయి. వీటి సహాయంతోనే ఇది సంభాషణలను ట్వీట్ చేయగలుగుతుంది. -
ఐబీఎల్‌లో పుణే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది
పుణే పిస్టన్స్ (పీపీ) ఐబీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పుణే 3-2తో ముంబై మాస్టర్స్ (ఎంఎం)ను కంగుతినిపించింది. ముంబై ఆటగాడు వ్లాదిమిర్ ఇవనోవ్ సింగిల్స్, డబుల్స్‌లో చక్కని పోరాటం కనబరిచినా... మిగతా మ్యాచ్‌ల్లో సహచరులు ఓడటంతో ముంబై మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఇవనోవ్ (ఎంఎం) 21-16, 21-14తో సౌరభ్ వర్మ (పీపీ)పై అలవోక విజయం సాధించాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో జులియన్ షెంక్ (పీపీ) 11-21, 21-10, 11-7తో టిన్ బౌన్ (ఎంఎం)పై గెలుపొందడంతో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్-ప్రణవ్ చోప్రా (ఎంఎం) జోడి 21-12, 20-21, 11-9తో సనావే థామస్-రూపేశ్ (పీపీ) జంటపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో టిన్ మిన్హ్ (పీపీ) 21-18, 21-13తో మార్క్ జ్వెబ్లెర్ (ఎంఎం)పై విజయం సాధించడంతో స్కోరు 2-2తో సమమైంది. ఐదో మ్యాచ్ (మిక్స్డ్ డబుల్స్)లో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (పీపీ) జంట 21-20, 21-13తో సిక్కిరెడ్డి-ప్రణవ్(ఎంఎం) ద్వయంపై నెగ్గి పుణేకు విజయాన్ని అందించింది.