ఐబీఎల్‌లో పుణే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది
Published Sun, Aug 18 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
పుణే పిస్టన్స్ (పీపీ) ఐబీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పుణే 3-2తో ముంబై మాస్టర్స్ (ఎంఎం)ను కంగుతినిపించింది. ముంబై ఆటగాడు వ్లాదిమిర్ ఇవనోవ్ సింగిల్స్, డబుల్స్‌లో చక్కని పోరాటం కనబరిచినా... మిగతా మ్యాచ్‌ల్లో సహచరులు ఓడటంతో ముంబై మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఇవనోవ్ (ఎంఎం) 21-16, 21-14తో సౌరభ్ వర్మ (పీపీ)పై అలవోక విజయం సాధించాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో జులియన్ షెంక్ (పీపీ) 11-21, 21-10, 11-7తో టిన్ బౌన్ (ఎంఎం)పై గెలుపొందడంతో ఇరు జట్లు 1-1తో నిలిచాయి.
పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్-ప్రణవ్ చోప్రా (ఎంఎం) జోడి 21-12, 20-21, 11-9తో సనావే థామస్-రూపేశ్ (పీపీ) జంటపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో టిన్ మిన్హ్ (పీపీ) 21-18, 21-13తో మార్క్ జ్వెబ్లెర్ (ఎంఎం)పై విజయం సాధించడంతో స్కోరు 2-2తో సమమైంది. ఐదో మ్యాచ్ (మిక్స్‌డ్ డబుల్స్)లో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (పీపీ) జంట 21-20, 21-13తో సిక్కిరెడ్డి-ప్రణవ్(ఎంఎం) ద్వయంపై నెగ్గి పుణేకు విజయాన్ని అందించింది.
Advertisement
Advertisement