వధువరుల గ్రాండ్‌ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్‌ వీడియో.. | Bride And Groom Grand Entry Goes Funny In Wedding Hall:Viral Video | Sakshi
Sakshi News home page

వధువరుల గ్రాండ్‌ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్‌ వీడియో..

Nov 14 2021 2:14 PM | Updated on Nov 14 2021 2:49 PM

Bride And Groom Grand Entry Goes Funny In Wedding Hall:Viral Video - Sakshi

వివాహ వేడుకను ప్రతి ఒక్కరు తమ జీవితకాలమంతా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ప్రీవెడ్డింగ్‌ షూట్‌ మొదలుకొని.. అప్పగింతల వరకు ప్రతి కార్యక్రమాన్ని వీడియో రూపంలో భద్రపరుచుకుంటున్నారు. వివాహన్ని ట్రెండ్‌కు తగ్గట్టుగ నిర్వహించుకోవడానికి యువత ఎంత ఖర్చుకైన వెనకాడటం లేదు.

పెళ్లికి సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ..ఈ  కోవకు చెందిన ఒక పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేటి యువత తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఈ వివాహంలో.. వధువరులు ప్రత్యేకంగా తమ పెళ్లిమండపానికి చేరుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగా.. ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఆ బల్లను గాలిలో ఒక వాహనం సహయంతో పైకి ఎత్తేలా ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో.. అందంగా ముస్తాబైన.. వధువరులు బల్లపై కూర్చుని మండపం వైపు వస్తు‍న్నారు. వేడుకకు హజరైన బంధువులు, స్నేహితులు వారి రాకను ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు కూడా మండపాన్ని, బంధువుల వైపు ఆనందంగా చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. పాపం.. వధువరులు ప్రయాణిస్తున్న బల్ల ఒక్కసారిగా అదుపు తప్పింది.

దీంతో వారు.. కింద పడిపోయారు. మండపంలో ఉన్న.. బంధువులంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని వధువరులను పైకి ఎత్తారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం.. బ్రైడ్స్‌ స్పెషల్‌ అనే ట్వీటర్‌ ఖాతాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం ఎంట్రీరా బాబు..’, ‘పాపం.. దెబ్బలేం తగల్లేవు కదా..’, ‘ ఇవేం.. ట్రెండీ ఆలోచనలు.. ’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement