Thrilling Wedding: Bride And Groom Celebrate Wedding By Skydiving Off High Cliff, Video Viral - Sakshi
Sakshi News home page

Bride And Groom Skydiving Wedding: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్‌ చేస్తూ పెళ్లి..

Jul 29 2023 3:53 PM | Updated on Jul 29 2023 4:19 PM

Viral Video: Bride And Groom Celebrate Wedding By Skydiving  - Sakshi

చాలామంది తమ వివాహాన్ని చాలా డిఫెరెంట్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టేందుకు వెనకడుగు వేయడం లేదు. పైగా ఆ పిచ్చితో ఎంతటి సాహాసానికైనా రెడీ అవుతున్నారు కూడా. అలానే ఇక్కడొ కొత్త జంట తమ వివాహ వేడుకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు. అందుకోసం వారి చేసిన సాహసం వింటే వామ్మో! అనకుండ ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇక అంతే సంగతులు.

ఇంతకీ వారేం చేశారంటే..
ప్రిసిల్లా యాంట్‌, ఫిలిప్పో లెక్వెర్స్‌ అనే జంట తమ వివాహ వేడుకను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లి రోజు ఎప్పటికీ తమకు గుర్తుండిపోయేలా స్వీట్‌ మెమరీలా ఉండాలని ఓ భయానక సాహాసానికి ఒడిగట్టారు. పెళ్లి అయిన తదనంతరమే ఈ సాహాసానికి దిగారు. వివాహ వేడుకకు విచ్చేసిన బంధువుల సమక్షంలోనే ఈ సాహసానికి సన్నద్ధమయ్యారు.

ఈ మేరకు ఆ ఇద్దరూ స్కైడైవింగ్‌ చేస్తూ.. ఆనందంగా తమ వివాహ రోజుని జరుపుకోవాలని డిసైడ్‌ అ‍య్యారు. అనుకున్న ప్రకారమే ఆ జంట నిపుణుల పర్యవేక్షణలో కొండ అంచున నిలబడి దిగ్విజయంగా స్కైడైవింగ్‌ చేసేందుఉ రెడీ అ‍య్యారు. గుండెల పగిలే ఉత్కంఠ మధ్య ఆ దంపతులు గాల్లో చక్కర్లు కొడుతూ తమ వివాహాన్ని చాలా ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ జంట 'అతి' చేస్తున్నారని విమర్శించగా మరికొందరూ మాత్రం నేను నా పెళ్లి టైంలో ఇలాగే చేస్తా.. అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. 

(చదవండి: 'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్‌లోనే తిందాం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement