skydiving
-
సెంచరీ వయసులో స్కైడైవింగ్ చేసిన బామ్మ! ఏకంగా..!
సెంచరీ వయసులో సైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. అది కూడా ఓ స్వచ్ఛంద సంస్థ కోనం నిధులు సమకూర్చేందుకు చేయడం విశేషం. ఆ బామ్మ ఎవరంటే..?సఫోల్క్‌కు చెందిన మానెట్ బైల్లీ అనే బామ్మ 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఆమె ఉమెన్స్ రాయల్ నావెల్ సర్వీస్‌కు మాజీ సభ్యురాలు. తన పుట్టిన రోజును స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరించే పనితో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బైల్లీ ఒక ఛారిటీ ఈవెంట్లో భాగంగా యూకే పారాచూటింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌తో కలిసి ఈ సాహసం చేసింది. ఆమె బెన్హాల్ విలేజ్ హాల్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్ అనే మూడు ఛారిటీ సంస్థల కోసం ఈ నిధులను సేకరిస్తోంది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర రూ. 11 లక్షలు సేకరించింది. అయితే రూ. 33 లక్షల వరకు నిధులు సేకరించాలనేది ఆ బామ్మ లక్ష్యం. ఈ బామ్మ ఈస్ట్ ఆంగ్లియాలోని బెక్లెస్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఏకంగా ఏడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసింది. ఈ మేరకు స్థానికి మీడియాతో మాట్లాడుతూ.."నాకు చేసేటప్పుడూ కొంచెం భయంగా అనిపించింది. గట్టిగా కళ్లు మూసుకున్నానని ఒపుకోవాల్సిందే. ఆ తర్వత ధైర్యంగానే ఉన్నట్లు తెలిపింది. అంతేగాదు తన ఆరోగ్యకరమైన వృధాప్యం గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది లేదా తొమ్మిది పదుల వయసులో దేన్ని వదులుకోకూడదు. ఈ వయసులో కూడా తాను ఫిట్‌గా ఉండటం అనేది అదృష్టం అనే చెప్పాలి. తన వయసులోనే ఉన్న ఇతర వ్యక్తులు ఆర్థరైటిస్‌తో వికలాంగులుగా మారారు. అయితే తాను అలా ఉండేందుకు ఇష్టపడనని అంటోంది." ఈ బామ్మ. కాగా, ఆమె ఇలాంటి సాహసాలు చేయడం మొదటిసారి కాదు. తన వందో పుట్టిన రోజు సందర్భంగా కూడా ఇలాంటి సాహస కృత్యమే చేసింది. సిల్వర్‌స్టోన్ చుట్టూ 130 మీటర్ పర్ అవర్ వేగంతో ఫెరారీ కారుని నడిపి మరో రికార్డుని నెలకొల్పింది. తన స్నేహితుడి తండ్రి 85 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయడం చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. బామ్మ బైల్లీ ధైర్యం, సమాజం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషి బ్రిటన్ రాజ కుంటుంబాన్ని ఆకర్షించింది. అంతేగాదు ప్రిన్స్ విలియం ఆ వయసులో ఆ బామ్మ చలాకీగా చేస్తున్న సాహసాలను మెచ్చుకున్నారు. వందవ పుట్టిన రోజునే ఫెరారీ రేసింగ్‌తో చరిత్ర సృష్టించిన మీరు ఈ స్కైడైవింగ్ని అవలీలగా చేయగలరు. ఆశ్చర్యపోనవసరం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ బామ్మ ఆరోగ్య రహస్యం..ఎప్పుడూస్నేహితులు, ప్రజల మధ్య ఉంటుంది. బిజీగా ఉంటుంది. ప్రతిదానిపై ఆసక్తిని కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రేమగా మెలుగుతుందట. అవే ఆమె దీర్ఘాయువుకి కారణం అని ఆనందంగా చెబుతోంది బైల్లీ.The incredible Manette Baillie skydiving this morning at Beccles airfield for her 102nd birthday sponsored by Goldster!! #manettebaillie #102yearoldskydiver pic.twitter.com/q1FOZtqzyU— Goldster (@GoldsterClub) August 25, 2024 (చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!) -
'స్కై డైవింగ్ స్టంట్'తో రామభక్తి చాటుకున్న 22 ఏళ్ల మహిళ!
అయోధ్యలో నూతన రామాలయం జనవరి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అదికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ అనే మహిళ అద్భుతమైన స్టంట్‌ని ప్రదర్శించింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలోనే అనామిక బ్యాకాంక్‌లో ఈ స్కై డైవింగ్ స్టంట్తో తన రామభక్తిని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు అనామిక శర్మ బ్యాంకాక్‌లో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో 'జైశ్రీరామ్' అనే జెండాతో ఈ స్కై డైవింగ్ స్టంట్ చేసింది. తాను తన భక్తిని ఈ స్కై డైవింగ్‌తో ముందు తీసుకువెళ్లాలనుకుంటున్నా అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా,జనవరి 22న జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సుమారు 4 వేలకు పైగా సాధువులు, పలువురు ఇతర ప్రముఖులు హాజరకానున్నారు. కాగా, అయోధ్యలో ఈ రామ మందిర ప్రతిష్టాపన వేడుకను సందర్శకులు అపూర్వమైన మరుపురాని అనుభవంగా ఉండేలా అభివృద్ధిక కార్యక్రమాలతో అందంగా తీర్చిదిత్తున్నారు సీఎం యోగి. ఈ నూతన రామాలయం రాష్ట్ర దేశవాలయంగా భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామజికి చిహ్నంగా అలారారుతుందని ఆదిత్యనాధ్లో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అయోధ్యలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశాలే అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు యోగి. VIDEO | 22-year-old Anamika Sharma of Prayagraj showed her devotion for Ram Temple in Ayodhya by skydiving with a ‘Jai Shri Ram’ flag from 13,000 feet in Bangkok. pic.twitter.com/Y6S8qOS9yf — Press Trust of India (@PTI_News) January 3, 2024 (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్..!
పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్‌కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ -
ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..
చాలామంది తమ వివాహాన్ని చాలా డిఫెరెంట్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టేందుకు వెనకడుగు వేయడం లేదు. పైగా ఆ పిచ్చితో ఎంతటి సాహాసానికైనా రెడీ అవుతున్నారు కూడా. అలానే ఇక్కడొ కొత్త జంట తమ వివాహ వేడుకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు. అందుకోసం వారి చేసిన సాహసం వింటే వామ్మో! అనకుండ ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇక అంతే సంగతులు. ఇంతకీ వారేం చేశారంటే.. ప్రిసిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లి రోజు ఎప్పటికీ తమకు గుర్తుండిపోయేలా స్వీట్ మెమరీలా ఉండాలని ఓ భయానక సాహాసానికి ఒడిగట్టారు. పెళ్లి అయిన తదనంతరమే ఈ సాహాసానికి దిగారు. వివాహ వేడుకకు విచ్చేసిన బంధువుల సమక్షంలోనే ఈ సాహసానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆ ఇద్దరూ స్కైడైవింగ్ చేస్తూ.. ఆనందంగా తమ వివాహ రోజుని జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమే ఆ జంట నిపుణుల పర్యవేక్షణలో కొండ అంచున నిలబడి దిగ్విజయంగా స్కైడైవింగ్ చేసేందుఉ రెడీ అయ్యారు. గుండెల పగిలే ఉత్కంఠ మధ్య ఆ దంపతులు గాల్లో చక్కర్లు కొడుతూ తమ వివాహాన్ని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ జంట 'అతి' చేస్తున్నారని విమర్శించగా మరికొందరూ మాత్రం నేను నా పెళ్లి టైంలో ఇలాగే చేస్తా.. అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) (చదవండి: 'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!) -
80 ఏళ్లు దాటాక గిన్నిస్ రికార్డు.. విమానం ఎక్కి, అక్కడ్నుంచి దూకేసి..
80 ఏళ్లు దాటాక మీరేం చేస్తుంటారు? ఓపికుంటే.. వాకింగ్‌కు వెళ్తారు లేదా మనుమలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు..అంతేగా..అదే వయసులో ఉన్న వీళ్లేం చేశారో తెలుసా? విమానం ఎక్కేసి.. అక్కడ్నుంచి దూకేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించేశారు. జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీకి చెందిన ఈ 8 మంది అమెరికాలోని ఒర్లాండోలో స్కైడైవ్చేసి.. ఇలా సర్క్యులర్ ఫార్మేషన్ ఫీట్‌ను చేశారు. 80 ఏళ్లు దాటినవారిలో ఇంతమంది కలిసి ఒక స్కైడైవ్ ఫార్మేషన్ చేయడం ఇదే మొదటిసారట. ఇప్పటివరకూ ఆరుగురు కలిసి చేసినదే రికార్డుగా ఉంది. -
ఇండోర్ స్కైడైవింగ్.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో
వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ వీడియో కనిపిస్తే.. మనం కూడా కళ్లప్పగించి చూస్తాం. అంత ప్రమాదకరమైన అడ్వెంచర్ మనకి అవసరమా అనుకుంటాం. అయితే ఇప్పుడు ఏ ప్రమాదం లేకుండా ఆ అడ్వెంచర్ చేసే అవకాశం హైదరాబాదీలకు దక్కనుంది. హైదరాబాద్ నగరానికి మరో ఆకర్షణ జత కానుంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు నగరం రెడీ అవుతోంది. ఆకాశ వీధిలో విహరించే అనుభూతి కల్పించేందుకు గ్రావిటీజిప్ అనే స్టార్టప్ రంగం సిద్ధం చేసింది. నగరానికి చెందిన మేడ రామ్, మేడ సుశీల్‌లు గండిపేట సమీపంలో ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేశారు. అడ్వెంచర్‌కు మారు పేరైన స్కైడైవింగ్‌కి యూరప్ కంట్రీస్‌లో స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన దగ్గరి నుంచి కూడా చాలా మంది యూరప్‌కి వెళ్లి స్కై డైవింగ్ చేసి వస్తుంటారు. ఈ అడ్వెంచర్ చేయాలంటే నెలల తరబడి శిక్షణ అవసరం, అదే విధంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి ఝంజాటం ఏమీ లేకుండా ఇలా వెళ్లి అలా ఇండోర్‌లో స్కైడెవింగ్ చేసి రావొచ్చు. తక్కువ ఖర్చుతో, అన్ని రకాల జాగ్రత్తలతో ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించనుంది గ్రావిటీజిప్. గండిపేట సమీపంలో ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. 2022 మార్చి, ఏప్రిల్‌లలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు యూరప్‌లో శిక్షణ పొందిన సిబ్బందిని ఇక్కడి నియమించారు. ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. స్కైడైవింగ్‌కి మూడు వేల రూపాయల వరకు టికెట్ ఛార్జ్ ఉండవచ్చని అంచనా. చదవండి: బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్.. స్టార్టప్‌లకు మంచి రోజులు -
Skydiver: అతి పిన్న వయస్కురాలిగా రికార్డు.. ఎవరీ అనామిక శర్మ?
ఇండియాలో స్కై–డైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది 21 ఏళ్ల అనామిక శర్మ. ఇంజినీరింగ్ చదువుతున్న అనామిక ఈ యేడాది దుబాయ్ డ్రాప్ జోన్ నుండి ‘ఎ’ కేటగిరీ ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది. తొలిసారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు కేవలం 11 ఏళ్లు. ఆ తర్వాత 42 జంప్‌లు సాధించిన ఘనత ఆమెది. పది రకాల పారాచూట్లు, ఆరు వేర్వేరు ఎయిర్క్రాఫ్ట్స్ను సమర్ధవంతంగా నడపగలిగింది. ఈ యువ సాధకురాలు మాట్లాడుతూ – ‘గాలిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉన్న అనుభూతి, నేలను తాకగానే ఆనందం, ఉల్లాసం కలుగుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం’ అని వివరిస్తుంది. ఏకైక తండ్రీకూతుళ్లు అనామిక తండ్రి కూడా ప్రొఫెషనల్ స్కై–డైవర్. దీంతో దేశంలోనే వృత్తిరీత్యా స్కై డైవర్స్‌గా నిలిచిన ఏకైక తండ్రీకూతుళ్లుగా వీరిద్దరూ వార్తలో నిలిచారు. శిక్షణ కోసం అనామిక 2021లో మాస్కోకు, ఈ యేడాది జనవరిలో దుబాయ్‌కి వెళ్లింది. అతి పిన్న వయస్కురాలు.. ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళా స్కై–డైవర్ లైసెన్స్‌ను పొందారు. బెంగళూరులో బీటెక్ చదువుతున్న అనామిక దేశంలో ఐదవ మహిళా ప్రొఫెషనల్ స్కై–డైవర్ లైసెన్స్ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం త్వరలో జాతీయ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని తీసుకురానుందనే విషయాన్ని చెబుతూ, సవాలుతో కూడిన ఈ రంగంలోకి అమ్మాయిలు రావడానికి ప్రేరణనూ, విదేశీయులకు గట్టి పోటీనీ ఇస్తోంది అనామిక. చదవండి: ఎంత మంచి మనసమ్మా నీది.. తమ్ముడికి పెళ్లి చేసి.. తల్లి కోసం తను మాత్రం.. -
వెరైటీ లవ్ ప్రపోజల్ : వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో తమ ప్రేమ చాలా ప్రత్యేకం అని ప్రతీ ప్రేమికుడు భావిస్తాడు. అంతేకాదు తమ ప్రేమను ప్రకటించేందుకు నానా తంటాలు పడతారు. లవ్ ప్రపోజల్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా వెరైటీగా ఉండేలా లవర్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. రకరకాల ఫీట్లతో విభిన్నంగా ప్రయత్నిస్తారు . తాజాగా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనే మాటలను అక్షరాలా ఆచరించి చూపించాడో లవర్. ఏకంగా స్కైడైవింగ్ సమయంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను వింగ్ మ్యాన్స్కైడైవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. "స్కైడైవ్ వివాహ ప్రతిపాదన" అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఈ వీడియో నెటిజనులను, ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రే అనే ప్రేమికుడు, తన గర్ల్‌ఫ్రెండ్ కేటీతో కలిసి స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు "ఐ లవ్ యూ" అంటూ తన ప్రేమను ప్రకటించాడు. ఈ హఠాత్పరిణామానికి కేటీ సర్ప్రైజ్ అవుతూ థ్యాంక్స్ చెప్పింది. ఇంతలో తన నోటిలో దాచుకున్న ఉంగరాన్ని తీసి మరీ తన ప్రేమను వ్యక్తంచేశాడు. ‘రోజు రోజుకు నీ ప్రేమలో మరింత మునిగిపోతున్నాను. నన్నుపెళ్లి చేసుకుంటావా’ అంటూ మెరిసిపోతున్న మబ్బుల నడుమ రే ముద్దుగా అడిగాడు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన ఆమె కూడా ఓకే చెప్పేసింది. ఇక ఏ ప్రేమికుడు ఎగిరి గంతేయకుండా ఉంటాడు. రే ఆల్రడీ గాల్లోనే ఉన్నాడుగా..అందుకే మరింత ఉత్సాహంగా కేకలు వేశాడు. దీనిపై సోషల్ మీడియా యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదకర ఫీట్‌పై కొంతమంది నెటిజన్లు కోపాన్ని ప్రదర్శించడం విశేషం. View this post on Instagram A post shared by Wingman (@wingmanskydive) -
వినూత్నంగా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు
జోహాన్స్‌బర్గ్: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సౌతాఫిక్రాలో ఓ అభిమాని జననేతపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు. గురజాల మాజీ శాసన సభ్యుడు కొత్త వెంకటేశ్వర్లు మనమడు కొత్త రామకృష్ణ సౌతాఫ్రికాలో ఉంటున్నారు. వైఎస్ జగన్‌పై ఎప్పుడు తన అభిమానాన్ని చాటుకునే రామకృష్ణ ఈ సారి జననేతకు తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని భావించారు. అందుకోసం స్కై డైవ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ ఫొటోతో 11 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి.. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. -
'స్కై డైవ్ చేసి చెట్టుకు ఢీకొని..'
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ స్పోర్ట్స్ స్టార్ ఎరిక్ రోనర్(39) అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఉత్తర కాలిఫోర్నియాలోని స్క్వా వ్యాలీలో నిర్వహిస్తున్న ఓ గోల్ఫ్ ఈవెంట్ ప్రారంభానికి ముందు నిర్వహించిన స్కై డైవింగ్ కార్యక్రమంలో పాల్గొని డైవ్ చేసి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఓ చెట్టుపై పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈవిషయాన్ని షెరిఫ్ రాష్ట్ర కెప్టెన్ డెన్నిస్ వాష్ తెలిపారు. గోల్ఫ్ టోర్నమెంటు జరగడానికి ముందు స్కై డైవింగ్ నిర్వహించడం అక్కడ అనవాయితీకిగా కొనసాగుతుంటుంది. అందులో భాగంగానే సోమవారం జరిగిన స్కై డైవింగ్ కార్యక్రమంలో పలువురు పాల్గొనగా అందులో రోనర్ కూడా ఒకరు. అందరితోపాటు తాను కూడా స్కై డైవ్ చేశారు. అయితే, మిగితా వారు సురక్షితంగా నేలపై దిగగా.. ఒక్క రోనర్ మాత్రం చెట్టుకు ఢీకొని అక్కడే చిక్కుకుపోయారు. మృతదేహాన్ని చెట్టు కిందికి దించే అవకాశం కూడా అధికారులకు లేకుండాపోయింది. -
వినువీధిలో మనువాడినవేళ...!
జర్మనీలోని ఫ్రీబర్గ్ ప్రాంతం.. ఉదయం 10 గంటల సమయం.. జెస్సీ చిడ్ (32), ఇంగో మౌల్లర్ (46)లు మరికొన్ని క్షణాల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అక్కడి విమానాశ్రయంలో వారి కోసం ఓ ప్రైవేటు విమానం సన్నద్ధంగా ఉంది. వధూవరులిద్దరితోపాటు పాస్టర్, మరికొందరు ఎక్కగానే విమానం టేకాఫ్ అయింది. 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక పాస్టర్ సమక్షంలో జెస్సీ, ఇంగోలు ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం ఇద్దరూ విమానంలో నుంచి కిందకు దూకారు. పాస్టర్ కూడా వారిని అనుసరించారు. అలా గాలిలో తేలియాడుతూ వధూవరులిద్దరూ ముద్దు పెట్టుకోవడంతో వారి వివాహ తతంగం పరిపూర్ణమైంది. జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి అనే ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుని.. వారు ఇంతటి సాహసానికి పూనుకున్నారు. అందరిలా కాకుండా కాస్త వెరైటీగా గగనపు వీధిలో వినూత్నంగా ఒక్కటవ్వాలని ప్లాన్ వేసుకున్నారు. ఇంగోకు స్కైడైవింగ్‌లో మంచి నైపుణ్యం ఉంది. దీంతో అతడు మామూలుగానే కిందకు దూకాడు. కానీ జెస్సీ, పాస్టర్లకు ఇవన్నీ కొత్త. అందుకే వారిద్దర్నీ ఇద్దరు శిక్షకులు తమకు కట్టుకుని కిందకు దూకారు. అలా గాలిలో అంతా ఒక్కచోట చేరిన తర్వాత జెస్సీ, ఇంగోలు ముద్దుపెట్టుకున్నారు. తర్వాత పారాచూట్ల సహాయంతో కిందకు దిగారు. ఇలా వినువీధిలో వివాహం చేసుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందని జెస్సీ పేర్కొంది. తాము కోరుకున్న విధంగా ఇలా పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ఏడాదిపైనే పట్టిందని వివరించింది. ‘‘అన్నింటికన్నా ముఖ్యంగా మాతోపాటు కిందకు దూకే ధైర్యమున్న పాస్టర్‌ను పట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాం. ఎంతమందిని అడిగినా ఎవరూ అందుకు ముందుకు రాలేదు. అలాగే కొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది’’ అని వెల్లడించింది. -
ఎడారిలో సరదా సరదాగా..!
అబుదాబి: ఐపీఎల్-7ను యూఏఈలో నిర్వహించడమే అనూహ్యం. వేదిక ఎంపికపై చివరి వరకు తాత్సారం చేసిన గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీల ఒత్తిడి పెరిగిపోవడంతో హడావిడిగా నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల పరంగా చూస్తే పూర్తిగా తటస్థ వేదికపై క్రికెట్ ఆడనుండటం కొత్తగా అనిపించింది. ముఖ్యంగా అభిమానుల ఆదరణపై సందేహాలు ఉండేవి. అయితే ఒక్కసారి టోర్నీ ఆరంభమయ్యాక అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. మ్యాచ్‌లకు మంచి ఆదరణ లభించగా...క్రికెటర్లు కూడా పూర్తిగా ఖుష్ అయ్యారు. పైగా భారత్ తరహాలో ప్రతీ చోటా మీడియా దృష్టి ఉండని ప్రాంతం కావడంతో వారు కూడా అన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు. నిర్వాహకులు కూడా టోర్నీ ఆరంభంలోనే గోల్ఫ్ డే జరపగా... ఫలితాలు, ప్రదర్శనతో సంబంధం లేకుండా ఆటగాళ్లు యూఏఈలో సరదాగా గడిపారు. క్రికెటర్ల వ్యాఖ్యలు, ట్వీట్స్ చూస్తే వాటి నిండా దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, పామ్ జువేరా కబుర్లే... మాస్టర్ ‘స్టూడెంట్’! క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఇప్పుడు ముంబై జట్టు మెంటర్‌గా సచిన్ టెండూల్కర్ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. తన జట్టు ప్రదర్శన తీసికట్టుగా ఉన్నా... యూఈఏ లెగ్ ఐపీఎల్‌ను తన కోచింగ్ కోసం ఉపయోగించుకున్నాడు. అయితే అతను శిక్షణ పొందుతోంది గోల్ఫ్‌లో కావడం విశేషం. గతంలో చాలా మంది ఆటగాళ్ళలాగే అతనూ సరదాగా గోల్ఫ్‌లో ఒక చేయి వేసినా....ప్రొఫెషనల్ తరహాలో ఎప్పుడూ ఆసక్తి కనబర్చలేదు. అయితే ఈ సారి మాత్రం దుబాయ్‌లోని ఎల్స్ క్లబ్లో అతను పక్కాగా ఆటపై దృష్టి పెట్టాడు. ప్రఖ్యాత కోచ్ జస్టిన్ పార్సన్ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్లు కూడా గోల్ఫ్‌లో సచిన్‌ను అనుసరిస్తూ...ఎక్కువ సమయం ఇక్కడే గడిపారు. స్టెయిన్ స్కై డైవింగ్ సన్‌రైజర్స్ సూపర్ పేసర్ డేల్ స్టెయిన్ అయితే తన జీవితంలో ఎన్నాళ్లుగానో ఉండిపోయిన కోరికను దుబాయ్‌లో తీర్చుకున్నాడు. సోమవారం అతను భూమికి దాదాపు 850 మీటర్ల ఎత్తునుంచి పామ్ జువేరా బీచ్ మీదుగా స్కై డైవింగ్ చేశాడు. ‘మహాద్భుతం...జీవితంలో తొలిసారి స్కై డైవింగ్ అనుభవం గొప్పగా ఉంది’ అని ట్వీట్ చేశాడు. నేను క్రికెటర్నా, మోడల్నా అని నిర్వేదం కనబర్చినా... ఫొటో షూట్లలో కూడా ఉత్సాహంగానే పాల్గొన్నాడు. వార్నర్‌కు వేడి..! బ్యాటింగ్‌లో అంతంత మాత్రం ప్రదర్శనే ఉన్న డేవిడ్ వార్నర్ కూడా తన నెచ్చెలి క్యాండిస్ ఫాల్జన్తో కలిసి యూఏఈ వచ్చాడు. బీచ్‌లలో ఎంజాయ్ చేస్తున్న అతను దుబాయ్ ఎడారుల్లో కూడా డ్రైవింగ్‌తో తన సరదా తీర్చుకున్నాడు. అయితే మధ్యలో రోడ్డుపై కారు చెడిపోవడంతో స్థానికుల సహకారం తీసుకున్నాడు. ‘45 డిగ్రీల ఎండ చంపేస్తోంది...అయినా ఇదో కొత్త అనుభవం’ అంటూ అతను ట్వీట్ చేశాడు. చెన్నై చమక్కులు చెన్నై క్రికెటర్ డు ప్లెసిస్ ప్రఖ్యాత యాస్ వాటర్ వరల్డ్‌లో తన భార్య ఇమారీతో కలిసి షికారు చేసొచ్చాడు. రైనా తదితర సహచరులతో కలిసి వరల్డ్‌లో ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ ఫార్ములా రోసాలో ఎంజాయ్ చేశాడు. కలిస్ సరదాలు కోల్‌కతా ఆటగాడు జాక్ కలిస్ కూడా యూఏఈ ట్రిప్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. సహచరులతో కలిసి డిజర్ట్ సఫారీకి వెళ్లిన అతను తన గర్ల్‌ఫ్రెండ్, 2011 మిస్ సౌతాఫ్రికా కిమ్ రివలాండ్తో కలిసి షికారు చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లూ తక్కువేమీ కాదు. ఎడారిలో వారి సవారి జోరుగా సాగింది. వాట్సన్, స్టీవెన్ స్మిత్ తమ భాగస్వాములతో కలిసి ఎడారిలో షికారు కొట్టారు.