80 ఏళ్లు దాటాక మీరేం చేస్తుంటారు? ఓపికుంటే.. వాకింగ్‌కు వెళ్తారు లేదా మనుమలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు..అంతేగా..అదే వయసులో ఉన్న వీళ్లేం చేశారో తెలుసా? విమానం ఎక్కేసి.. అక్కడ్నుంచి దూకేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించేశారు. జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీకి చెందిన ఈ 8 మంది అమెరికాలోని ఒర్లాండోలో స్కైడైవ్‌చేసి.. ఇలా సర్క్యులర్ ఫార్మేషన్ ఫీట్‌ను చేశారు. 80 ఏళ్లు దాటినవారిలో ఇంతమంది కలిసి ఒక స్కైడైవ్ ఫార్మేషన్ చేయడం ఇదే మొదటిసారట. ఇప్పటివరకూ ఆరుగురు కలిసి చేసినదే రికార్డుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment