Sky Diving
-
స్కై డైవింగ్ చేసిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్
ఢిల్లీ: 56 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అరుదైన సాహసం చేశారు. వరల్డ్ స్కై డైవింగ్ రోజున.. ఆయన కూడా ఆ ఫీట్ చేసి ఆకట్టకున్నారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారాయన.‘‘భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఈ రోజు అతిముఖ్యమైనది. హరియాణాలోని నార్నౌల్‌లో ఈ కేంద్రం ఏర్పాటైంది. దేశ పర్యటక శాఖ మంత్రిగా ప్రజలకు ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉంచడం నా బాధ్యత’’ అని మీడియాతో మాట్లాడారు.అలాగే తాను స్కై డైవింగ్ చేసిన చిత్రాలను, వీడియోలను ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ‘‘ఆ థ్రిల్‌ను నేనూ ఎంజాయ్ చేశాను. భారత పర్యటక రంగం అంతర్జాతీయ వసతులను పొందుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ పోస్టు పెట్టారు. दिन विशेष: स्काई डाइविंग का रोमांच। pic.twitter.com/iGoaQLDeyL— Gajendra Singh Shekhawat (@gssjodhpur) July 13, 2024 -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
గబ్బిలాలుగా మారి ఆకాశంలో ఎగురుతున్న మనుషులు! వీడియో వైరల్
-
80 ఏళ్లు దాటాక గిన్నిస్ రికార్డు.. విమానం ఎక్కి, అక్కడ్నుంచి దూకేసి..
80 ఏళ్లు దాటాక మీరేం చేస్తుంటారు? ఓపికుంటే.. వాకింగ్‌కు వెళ్తారు లేదా మనుమలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు..అంతేగా..అదే వయసులో ఉన్న వీళ్లేం చేశారో తెలుసా? విమానం ఎక్కేసి.. అక్కడ్నుంచి దూకేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించేశారు. జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీకి చెందిన ఈ 8 మంది అమెరికాలోని ఒర్లాండోలో స్కైడైవ్చేసి.. ఇలా సర్క్యులర్ ఫార్మేషన్ ఫీట్‌ను చేశారు. 80 ఏళ్లు దాటినవారిలో ఇంతమంది కలిసి ఒక స్కైడైవ్ ఫార్మేషన్ చేయడం ఇదే మొదటిసారట. ఇప్పటివరకూ ఆరుగురు కలిసి చేసినదే రికార్డుగా ఉంది. -
నీరజ్ చోప్రా స్కై డైవింగ్.. వీడియో వైరల్
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గతవారం డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. గత గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. ఇక డైమండ్ లీగ్ మీట్ ముగించుకొని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న నీరజ్ చోప్రా వెకేషన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్‌లో స్కై డైవింగ్ చేసి..ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన నీరజ్ చోప్రా..'' స్కై ఈజ్ నాట్ ది లిమిట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సినిమా ''జిందగీ నా మిలేగీ దుబారా'' మ్యూజిక్‌ను ప్లే చేస్తూ.. ఆ సినిమా తరహాలోనే స్కైడైవింగ్ చేయడం విశేషం. ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. నీరజ్ చోప్రా స్కై డైవింగ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు. View this post on Instagram A post shared by MySwitzerlandIn (@myswitzerlandin) చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత -
ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని
స్కై డైవింగ్ అంటేనే సాహసం. కొద్దిసేపు ఊపిరి ఆడనట్టు అనిపించినా.. ఆ తరువాత ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే వచ్చే థ్రిల్ అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ హెలికాప్టర్ స్పిన్స్ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు యూఎస్‌కు చెందిన ఓ స్కై సర్ఫర్. నేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్‌లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్ తిరిగిన కీత్ కెబె రికార్డు బ్రేక్ చేశాడు. వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి స్పిన్స్ చేస్తున్న కెబె వీడియోను గిన్నిస్ ఇటీవల విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 4న ఈ ఫీట్ చేసిన కెబె.. 2021 ఈజిప్ట్‌లోని గిజాలోనూ ఇలాంటి స్పిన్సే చేశాడు. కాకపోతే అప్పుడు సింగిల్ జంప్‌లో 165 స్పిన్స్ చేశాడు. ఇప్పుడు మరో పది యాడ్ చేసి.. సింగిల్ జంప్‌లో 175 సార్లు తిరిగి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడన్నమాట. -
ఆకాశం నుంచి కిందకు జంప్ చేస్తే ఆ కిక్కె వేరప్పా..!
దూకు... దూకేయ్... ఎక్కణ్ణుంచి. నింగి నుంచి నేలకు.మధ్యలో నువ్వో పక్షివవుతావు. నీ భుజాలు రెక్కలవుతాయి. దేహం దూదిపింజలా గిరికీలు కొడుతుంది. ఒక్కటే జీవితం.అద్భుతమైన అనుభవాలను ఎన్ని వీలైతే అన్ని మూట గట్టుకో. భారతదేశంలో లైసెన్స్డ్ ఉమెన్ స్కైడైవర్లు ఇప్పటి వరకు కేవలం ముగ్గురే ఉన్నారు. తాజాగా గుజరాత్ నుంచి ఏకైక మహిళగా శ్వేతా పర్మార్ నింగి గాలిని శ్వాసించింది. అయితే అందుకు ఆమె పట్టిన పంతం మాత్రం బుగ్గన వేలు ఆన్చి చదవదగ్గది. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలో స్కైడైవింగ్ సైన్యంలో ఉన్నవారికీ సైన్య శిక్షణ పొందగలిగిన వారికి మాత్రమే వస్తుంది. సాధారణ పౌరులు భారతదేశంలో ఎక్కడా స్కైడైవింగ్ నేర్చుకోలేరు. విదేశాలకు వెళ్లాల్సిందే. సాధారణంగా 7 వేల అడుగుల నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి స్కైడైవ్ చేస్తారు. కొన్నిక్షణాల ఫ్రీఫాల్ ఉంటుంది ఇందులో. ఆ తర్వాత పారాచూట్ ఓపెన్ చేసుకుని నేలకు దిగుతారు. స్కైడైవింగ్ అంటే ప్రాణాలతో చెలగాటం. అంతా సవ్యంగా గడిచి నేలకు దిగే సమయంలో ఆ వేగం అదుపులో లేకపోయినా నేలకు ఢీకొని మరణించే సందర్భాలు ఉంటాయి. అందుకని మన దేశంలో సాధారణపౌరులు ఈ క్రీడలో దిగడం తక్కువ. స్త్రీలు ఆ సాహసానికి పూనుకోవడం ఇంకా తక్కువ. గతంలో స్కైడైవింగ్ నేర్చుకున్న భారతీయ వనితలు (సాధారణ పౌరులు) ముగ్గురు ఉన్నారు. రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దానా. ఇప్పుడు నాలుగో వనిత వారి సరసన చేరింది. గుజరాత్ వడోదరాకు చెందిన 28 ఏళ్ల శ్వేతా పర్మార్. ఖరీదైన కల కల కనడమే తెలిసినవారికి దాని సాధ్యాసాధ్యాలు తెలియవు. సాధించాలనుకునేవారికి అడ్డుకట్టలు పడలేవు. శ్వేతా పర్మార్‌కు స్కైడైవింగ్ చేయాలని కోరిక. ఆకాశంలో మనం కూడా పక్షిలాగా ఎగిరితే ఎలా ఉంటుంది. ఆ అదృష్టం ఎలా సాధ్యం అవుతుంది... ఇవే ఆలోచనలు. కాని ఆ కలను నెరవేర్చుకునేంత వీలు ఉన్న కుటుంబం కాదు ఆమెది. 18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయారు. ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్లు కొంత డబ్బు కడితే, స్కాలర్షిప్లు వస్తే బరోడా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేసింది. ఆ తర్వాత తమ్ముడితో కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. కొద్దిగా డబ్బులు రాగానే 2016లో శ్వేత చేసిన మొదటి పని గుజరాత్‌లోని మెహసనా పట్టణంలో ఫ్లయింగ్ క్లబ్ ఉంటే అక్కడ ‘టాండమ్ జంప్’ చేయడం. అంటే పైలెట్ ఇన్స్ట్రక్టర్ మనల్ని తనతో పాటు కట్టుకుని స్కైడైవ్ చేస్తాడు. ఇందుకు ఆమెకు 35 వేల రూపాయలు ఖర్చయ్యింది. కాని ఆ టాండమ్ జంప్కే ఆమెకు స్కైడైవింగ్ మీద చాలా ఆకర్షణ ఏర్పడింది. నేనొక్కదాన్నే ఎగరాలి అనుకుందామె. స్పెయిన్‌కు వెళ్లి మొదలెట్టిన బిజినెస్‌ని తమ్ముడికి అప్పజెప్పేసి పూర్తిస్థాయి శిక్షణ కోసం 2018లో స్పెయిన్‌కు వెళ్లింది శ్వేతా పర్మార్. ‘అక్కడ ప్రతి జంప్‌కు నాకు 20 వేల రూపాయలు ఖర్చయ్యేది. అది కాకుండా ఉండటానికి, తిండికి. శిక్షణ కూడా చాలా శ్రమతో ఉంటుంది. గాలిలో నుంచి నేలకు దూకే వేగాన్ని తట్టుకోవడానికి కండరాలు తర్ఫీదు అవడం కోసం చాలా శిక్షణ ఇస్తారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్యారాచూట్ నేలకు తాకే సమయంలో వేగం అటూ ఇటూ అయితే ఎముకలు విరుగుతాయి. ఒకసారి అలాగే నాకు మైనర్ ఫ్రాక్చర్ అయ్యింది. అయినా విజయవంతంగా నేను శిక్షణ పూర్తి చేసుకున్నాను’ అంది శ్వేతా. సర్టిఫికేట్ పొందాలి స్కైడైవింగ్‌కు సర్టిఫికెట్ కావాలి. యునైటెట్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ (యు.ఎస్.పి.ఏ) రాత పరీక్షలో పాసై, తగినన్ని సార్లు స్కైడైవింగ్ అనుభవాన్ని నమోదు చేసి ఈ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. శ్వేత ఇందుకోసం 8 అంచెల కోర్సును, 29సార్లు స్కైడైవింగ్ను చేసి, రాత పరీక్ష రాసి సర్టిఫికెట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ నాలుగో మహిళ శ్వేత. ఆమెకు ఇది వరకే ఈ సర్టిఫికెట్ అందాల్సి ఉన్నా కోవిడ్ వల్ల ఆలస్యమై ఇటీవల ఆమె చేతికి వచ్చింది. స్పెయిన్ తర్వాత శ్వేత రష్యాలో, దుబాయ్‌లో స్కైడైవ్ చేసింది. ‘ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడైనా స్కైడైవింగ్ చేయవచ్చు’ అని సంతోషంగా అంది శ్వేతా. ‘నేను ఇప్పుడు యువతకు స్ఫూర్తినిస్తున్నాను. నన్ను చూసి స్కైడైవింగ్‌పై ఆసక్తి కనిపిస్తున్నారు చాలామంది. గుజరాత్ నర్మదా నదిలో (సర్దార్ పటేల్ విగ్రహం వద్ద) రివర్ రాఫ్టింగ్ లాంటి సాహస క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. కాని స్కైడైవింగ్ను ప్రోత్సహిస్తే టూరిజం అట్రాక్షన్ ఉంటుంది. ఆకాశం నుంచి కిందకు జంప్ చేయడంలో ఉంటే గొప్ప అనుభూతి మరే క్రీడలోనూ ఉండదు. జీవితం ఒక్కటే. ఆ అనుభూతీ ఒక్కటే’ అంది శ్వేతా పర్మార్. కొందరలా ఉంటారు... సాహసం శ్వాసగా సాగిపోతూ. -
దేశంలోనే తొలిసారి పాలమూరులో అబ్బురం
సాక్షి, మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో బుధవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఏరో స్పోర్ట్స్, పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడుతున్న ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్ అడ్వెంచర్స్, ఎయిర్ స్పోర్ట్స్ ఎయిర్ షో ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్, పారా మోటార్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. గతేడాది గాలిపటాల ఉత్సవాలను నిర్వహించగా ఈసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్ జిల్లాకు రాబోతుందని ప్రకటించారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఆకాశ వీధిలో.. బామ్మ
-
ఆకాశ వీధిలో.. బామ్మ ఫిట్నెస్ మంత్ర
ఐదంతస్తుల భవనం మీద నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి చాలా మందికి. కానీ, 90 ఏళ్ల ప్యాట్రిసియా బేకర్ మాత్రం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి 15,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేసింది. అలా వచ్చిన డబ్బును తన మనవడు నిర్మించే ‘స్పెషల్ నీడ్ పిల్లల’ స్కూల్‌కి, మరోటి అనాథలు ఉండే హోమ్‌కి విరాళంగా ఇవ్వడానికి కేటాయించింది. 90 ఏళ్ల వయసులో చేసిన ఈ సాహసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ బామ్మ చెబుతున్న ఫిట్నెస్ వివరాలు ఈ తరం తప్పక పాటించేవిగా ఉన్నాయి. తన ఫిట్నెస్ మంత్ర ప్రతి రోజూ ఉదయం 50 సిట్అప్స్ చేయడంతో ప్రారంభం అవడమే అంటోంది. స్కైడైవింగ్ అంటే యువత కూడా భయభ్రాంతులకు లోనవుతారు. అలాంటిది ఇగ్లండ్‌లో ఉండే ప్యాట్రిసియా బేకర్ 90 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ వృద్ధ మహిళకు 10 మంది మనవరాళ్ళు ఉన్నారు. ప్యాట్రిసియా స్కైడైవింగ్ తన అనుభవాన్ని వివరిస్తుంది’ ఇది అద్భుతమైనది. మొదటిసారి విమానంలో కూర్చున్నప్పుడు భయపడ్డాను కానీ ఇలా గాలిలో ఎగరడం మాత్రం సరదాగా ఉండేది. అయితే, ల్యాండింగ్ తరువాత, పారాచూట్ ఆగిపోయినప్పుడు కొంత భయపడ్డాను. దానికి గతంలో అయిన గాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఇన్నాళ్లకు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగినందుకు సంతోషంగా ఉంది. నా భర్త నాలుగేళ్ల క్రితం నాకు దూరమయ్యాడు. అతను ఎప్పుడూ స్కైడైవింగ్ ఉత్తేజకరమైనదిగా భావించేవాడు. నా పుట్టినరోజు వేడుక ఈ ఆటతో జరుపుకోవడం ఇష్టపడేవాడు’ అని వివరించింది. ప్యాట్రిసియా కొన్నేళ్ల క్రితం హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ కూడా చేసింది. కానీ 90వ పుట్టినరోజుకు మొదటిసారి స్కైడైవింగ్ చేసింది. బేకర్ వ్యక్తిగత వైద్యుడు వయస్సు ప్రకారం ఈ సాహసం చేయవద్దని సలహా ఇచ్చాడు. కానీ బేకర్ వినలేదు. డైవ్ సెంటర్లోనే తన వైద్యపరీక్షలన్నీ చేయించుకొని మరీ ఈ సాహసానికి పూనుకుంది. -
స్కై డైనింగ్ రెస్టారెంట్ ఫోటోలు మీ కోసం...
-
ఆకాశవీధిలో ఆరగిద్దాం
గాలిలో తేలుతూ ఆకాశ అందాలను తిలకిస్తూ విందు ఆరగిస్తే ఎంత బాగుంటుందో కదా! భూమికి 160 అడుగుల ఎత్తులో రుచుల ఘుమఘుమలు ఆస్వాదిస్తే భలేగా ఉంటుంది కదా! ఈ వినూత్న అనుభవం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన స్కై డైనింగ్ రెస్టారెంట్ ద్వారా నగరవాసులకు అందుబాటులోకి రానుంది. సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే రెండో స్కై డైనింగ్ రెస్టారెంట్ నగరంలో కొలువుదీరింది. గాల్లో తేలుతూ చవులూరించే రుచులను ఆస్వాదించే వినూత్న అనుభవం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెస్టారెంట్ రూపకర్తలు, క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్స్ డైరెక్టర్లు దేవిదత్ కొలి, తరుణ్ కొలి ఈ స్కై డైనింగ్ వివరాలు తెలిపారు. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా రెస్టారెంట్ నెలకొల్పామని, క్రేన్ల సహాయంతో అతిథులను 160 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి విందు ఆస్వాదించే ఏర్పాటు దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ రెస్టారెంట్‌ను శనివారం ప్రారంభించనున్నట్లు చెప్పారు. నోయిడాలో తొలి రెస్టారెంట్ నెలకొల్పా మన్నారు. ఇందులోకి 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం లేదు. ఈ రెస్టారెంట్లోకి వెళ్లాలంటే ఒక్కొక్కరికీ రూ.4,999. -
డైవ్ హార్డ్ ఫ్యాన్స్
గాల్లో తేలినట్టుందే,గుండె పేలినట్టుందే...అని పాడుకున్నంత వీజీ కాదు గాల్లో విన్యాసాలు చేయడం అంటే. అయితే సాహసమే నా పథం అంటోన్న సిటీ దేనికైనా సై అంటోంది. అడ్వంచర్ వైపు దూసుకుపోతోంది.కాలేజీ యువత కావచ్చు కార్పొరేట్ ఉద్యోగులు కావచ్చు కరోడ్పతులైన వ్యాపారులు కావచ్చు కారెవరూ సాహస యాత్రలకు అతీతం అన్నట్టుగా సిటీ అడ్వంచరిజమ్ జూమ్అవుతోంది. సాక్షి, సిటీబ్యూరో: సినీ, పొలిటికల్ సెలబ్రిటీల కారణంగా బంగీ జంపింగ్, స్కై డైవింగ్ వంటివి ఇప్పుడు బాగా పాప్యులర్ అయ్యాయి. ‘నేల మీద ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు. అయితే గాల్లో చేసే సాహసాలు అద్భుతమైన అనుభవాలు’ అని చెప్పారు నగరానికి చెందిన ‘రియల్’ సంస్థ సుచిర్ ఇండియా సీఈఓ వై.కిరణ్‌కుమార్. బిజినెస్‌తో పాటు గత కొంతకాలంగా ఆయన సాహసయాత్రల్లో సైతం బిజీగా ఉన్నారు. అడ్వంచర్ ట్రిప్స్ అంటే అమిత ఇష్టం అని చెబుతున్న కిరణ్ బంగీ జంపింగ్ దగ్గర్నుంచి స్కై డైవింగ్ దాకా ఎన్నో అనుభవాలను చవి చూశారు. ఆయన చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. దూకడం (వి)మానం... ‘ఒక్కసారి స్కై డైవింగ్ అలవాటైతే మానడం కష్టం. దాదాపు పదేళ్ల క్రితం న్యూజిల్యాండ్‌లో మొదలుపెట్టి ఇప్పటికి 70కిపైగానే డైవ్స్ చేశా. తాజాగా హవాయి ఐల్యాండ్స్‌లో 20 వేల అడుగుల ఎత్తు నుంచి దూకా. తొలిసారి డైవ్ చేసినప్పుడు కళ్లు తిరగడం వంటివి సహజమే. దాదాపు 10 వేల అడుగులకన్నా పైన ఎత్తులో ఎగిరే విమానం నుంచి దూకడం అంటే సాధారణ విషయం కాదు. స్కై డైవ్ చేసే సాహసికుడు, మరో నిపుణుడు కలిసి ఫ్లైట్‌లో గాల్లోకి వెళతారు. నిర్ణీత ఎత్తుకు చేరగానే...డైవ్‌కి సిద్ధమవుతారు. తగిన జాగ్రత్తలవీ చెప్పాక... ఒన్ టూ త్రీ అంటూ.. కాస్త బలంగానే వెనుక నుంచి నెట్టేస్తారు. కాళ్లు వెనుక పెట్టి జంప్ చేయాలి. కింద అగాధంలా కనపడి భయమనిపించినా కిందకు చూసేటప్పుడు కళ్లు మూసి ఉంచకూడదని ముందుగానే హెచ్చరిస్తారు. ఇరువురూ దూకిన కాసేపటికి పారాచ్యూట్ విచ్చుకుంటుంది. గాల్లో 4 నుంచి 5 నిమిషాలు పైనే ఉంటారు. ఇక కిందకి దిగేటప్పుడు కాళ్లు ఫోల్డ్ చేయకూడదు. కాళ్లు భూమికి తగలగానే ఆగకూడదు. దిగీ దిగగానే కాస్తంత దూరం పరుగు తీశాక మాత్రమే ఆగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వస్త్రధారణ, అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. స్కైకి చలో... డైవ్ కరో... నగరం నుంచి సాహసికులు ఇప్పుడు బంగీ జంపింగ్స్, స్కై డైవింగ్ కోసం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అవసరమైతే విదేశాలకు కూడా పయనమవుతున్నారు. మహారాష్ట్రలోని అంబీ వ్యాలీ, కర్ణాటకలోని మైసూర్, మధ్య ప్రదేశ్‌లోని థనా, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ తదితర ప్రాంతాలు దేశంలో స్కై డైవింగ్‌కు పేరొందాయి. దేశంలో స్కై డైవింగ్‌కు అత్యల్పంగా 3 వేల అడుగుల నుంచి అత్యధికంగా 10 వేల అడుగుల వరకూ అందుబాటులో ఉంటే... మరింత ఎత్తు నుంచి డైవ్ చేయాలనుకుంటే మాత్రం విదేశాలకు వెళ్లాల్సిందే. ధరలు కూడా మన దేశంలో అత్యధికంగా రూ.40 వేల వరకు.. విదేశాల్లో మరింత అధికంగా ఉన్నాయి. స్కై డైవింగ్స్ కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా వంటివి బాగా వెళతారు. డైవర్స్...పారా హుషార్ ఈ గాల్లో విన్యాసాలు ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టు చేయలేరు. వయసు 55 దాటిన వాళ్లు చేయడానికి అనుమతించరు. హెవీగా తిన్న తర్వాత జంప్స్ ఒప్పుకోరు. హృద్రోగాలు, హైబీపీ, అవయవాల సమస్యలు ఉండకూడదు. స్కై డైవ్స్కి బరువు 90 కిలోలకు మించకూడదు. వీటి కోసం కొన్ని వారాల ముందే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. మనకు ఇచ్చిన సమయానికి రెండు గంటల ముందే రిపోర్ట్ చేయాలి. ఏ సాహసమైనా ఒకటి రెండుసార్లు మాత్రమే భయం అనిపిస్తుంది. అలవాటైతే ఆడుకోవడమే. ఇలాంటి సాహసాలు కొత్త రకం అనుభూతినివ్వడమే కాక అద్భుతమైన రీతిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ఇతరత్రా సమస్యలను ఎదుర్కోవడంలో కూడా మనకు ఉపకరిస్తాయనేది నిజం. -
87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..
వృద్ధాప్యం అనేది వయస్సుకు గానీ మనస్సుకు కాదని చెప్పడం గురించి మనకు తెలుసు. అలా చెప్పడమే కాదు, అందుకు రుజువు తమ జీవన విధానమేనని నిరూపిస్తున్న వాళ్లు ఇప్పుడు ఎందరో ఉన్నారు. 82వ ఏట ప్రేమించి పెళ్లి చేసుకోవడం, 85వ ఏటా ప్రతి రోజు మధ్యతరహా సముద్రంలో కొన్ని కిలోమీటర్లు ఈతకొట్టడం, 87వ ఏటా రోజు రెండు, గంటల పాటు టెన్నిస్ ఆడుతున్న వద్ధుల గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, ఈర్ష్య కూడా కలుగుతుంది. తాము గతంలో కన్నా ఈ వయస్సులోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నామని చెబుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. కెనడాలోని అంటారియోకు చెందిన 87 ఏళ్ల మఫ్వీ గ్రీవ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి రోజు టెన్నీస్ ఆడుతారు. ఆమె గత 70 ఏళ్లుగా టెన్సీస్ ఆడుతూనే ఉన్నారు. ‘‘కెరీర్లో అన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకున్నామన్నది ముఖ్యం కాదు. మానవ జీవితం అన్నాక ఒడిదుడుకులు, సమస్యలు తప్పవు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదే ముఖ్యం. అందుకు జీవితం పట్ల సానుకూల దక్పథం అవసరం. ఈ విషయంలో ప్రముఖ రచయిత, తత్వవేత్త బెర్టాండ్ రస్సెల్ నాకు ఆదర్శం. సమస్యలు వస్తే కుంగిపోవద్దని, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని, పరిష్కారం లభించదనుకుంటే ఆ సమస్యలను పక్కన పడేసి ముందుకు పోవాలని ఆయన చెప్పారు. నేను నా జీవితంలో అలాగే చేశాను. నా వయస్సు గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు 30 ఏళ్లా, 60 ఏళ్లా అని ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు 62 ఏళ్ల వయస్సులో మెదడులో ట్యూమర్ వచ్చింది. కంగిపోలేదు. పోరాడాను. ఓసారి బిజినెస్ ట్రిప్పులో బయటకు వెళ్లినప్పుడు కారు దిగి నడవలేక పోయాను. మేజర్ ఆపరేషన్ జరిగింది. మనోధైర్యంతో కోలుకున్నాను. టెన్నీస్, గోల్ఫ్ ఆడడం వల్లనే నేను ఇప్పటికీ ఫిట్నెస్తో ఉన్నాను. ఆ ఆటలు ఇప్పటికీ ఆడడమేకాదు, ఎక్కడికైనా నడిచే వెళతాను. అదే నా ఆరోగ్య రహస్యం’’ అని ఆమె వివరించారు. ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ (87), అలీసియా మూర్హెడ్ (72) వద్ధ దంపతులు ఇప్పటికీ దృడంగా ఉంటారు. స్కై డైవింగ్‌లో వారికి వారే సాటే. పాట్ ఇప్పటికీ పదివేల స్కై డైవింగ్‌లు చేశారు. 80వ ఏటా ఒక్క రోజులో ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించానని పాట్ తెలిపారు. వయస్సు మీరాక ఎవరైనా స్కై డైవింగ్లకు స్వస్తి చెబుతారని, అయితే అలా తాను చేయదల్చుకోలేదని అన్నారు. తాను లిఫ్టులేని ఇంటి మేడపైకి మెట్లెక్కే పోతానని, ఆ ఆలోచన వల్లనే ఇంటికి లిఫ్టు కూడా పెట్టించలేదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నప్పుతే తాను జిమ్నాస్టని, ఆ తర్వాత 30వ ఏటా స్కై డైవింగ్ నేర్చుకున్నానని పాట్ భార్య అలీసియా తెలిపారు. అందుకనే స్కై డైవింగ్ పట్ల ఆసక్తి కలిగిన పాట్ చేసుకొని ఇప్పటికీ డైవింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాలి నడకతోనే ఎక్కువ సంచరిస్తా ఛానల్ ఐలాండ్స్‌లోని ఆల్డెర్నీకి చెందిన రీటా గిల్మోర్కు 87 ఏళ్లు. ఆమె భర్త మోరిస్ 74వ ఏట మరణించారు. అప్పటి వరకు ఆయన చూసుకున్న అతిపెద్ద రెస్టారెంట్‌ను ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. తాగుడు, స్మోకింగ్ అలవాటు లేని తాను, కార్లలో కంటే కాలి నడకనే ఎక్కువ సంచరిస్తానని, అదే తన ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఇలాంటి వాళ్లందరి గురించి ‘లైఫ్ లెస్సన్స్ ఫర్ పీపుల్ ఓల్డర్ అండ్ వైజర్ ద్యాన్ యూ’ పేరిట హార్డీగ్రాంట్ ప్రచురించిన పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు -
కులు మనాలిలో తెలుగు వ్యక్తి మృతి
సాక్షి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులుమనాలీకి విహార యాత్రకు వెళ్లిన నాగోలుకు చెందిన చంద్రశేఖర్ అనే వైద్యుడు శనివారం ప్రమాదవశాత్తు చనిపోయాడు. యశోద ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ స్కై డైవింగ్ చేస్తుండగా, ప్యారాచూట్ తెగిపడడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. -
భయాన్ని గాల్లో విసిరేశా!
‘మనకు ఉన్న భయాలు పోవాలంటే దేనికి భయపడుతున్నామో దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ భయాన్ని పోగొట్టుకోవడమే’ అని రకుల్‌ప్రీత్ సింగ్ అంటున్నారు. రకుల్‌కు బాసోఫోబియా ఉండేదట. అంటే.. ఎత్తు నుంచి కిందపడిపోతానేమోనని భయం. ఆ భయాన్ని పోగట్టదలుచుకున్నారు. వెంటనే స్కై డైవింగ్ చేశారు. స్కై డైవ్ చేసిన తర్వాత ఆ అనుభవాన్ని రకుల్ పంచుకుంటూ – ‘‘జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలన్నది నా పాలసీ. జీవితంలో భయానికి చోటు ఉండకూడదు. జరిగేది జరగక మానదు. మన భయాల్ని అధిగమించడాన్ని మించిన ఆనందం మరోటి ఉండదు. గాల్లోకి జంప్ చేయడానికి ఏరోప్లేన్ తలుపులు తెరిచినప్పుడు విపరీతంగా భయమేసింది. కానీ గాల్లో తేలిన ఆ 50 సెకన్లు నా జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆ క్షణం నేనో పక్షిలా అయిపోయా. ఏదో సాధించాను అనే భావన. డైవింగ్‌లో మరో క్రేజీ విషయమేటంటే.. మీరు భయపడితే మేం రికార్డ్ చేసే వీడియో సరిగ్గా ఉండదు అని చెప్పడంతో నాలో ఉన్న నటిని బయటకు రప్పించి గాల్లో ఉన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు. -
దూకింది ఎవరు?
ఎల్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అలాంటిది విమానం నుంచి అమాంతం దూకమంటే... ‘బతికుంటే బలిసాకైనా తిని బతకొచ్చు’ అని పారిపోతారు. అదే గోపీచంద్‌లాంటి డేర్ అండ్ డ్యాషింగ్ వ్యక్తులైతే ఆలోచించకుండా ‘ఓకే’ అనేస్తారు. దర్శకుడు సంపత్ నంది ఈ ‘స్కై డైవింగ్’ గురించి చెప్పగానే గోపీచంద్ ‘సై’ అన్నారు. ప్రస్తుతం గోపీ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘గౌతమ్ నంద’ చిత్రం కోసమే ఈ స్కై డైవ్ సీన్స్ చిత్రీకరించారు. ‘‘సౌతిండియన్ మూవీస్‌లో పూర్తి స్థాయి ‘స్కై డైవ్’ ఎపిసోడ్ ఉన్న మొదటి సినిమా మాదే. గోపీచంద్‌గారి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. ఆయన అభిమానులకు కచ్చితంగా పండగే’’ అని సంపత్ నంది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫస్ట్ లుక్ పోస్టర్లో సై్టలిష్ లుక్స్‌తో ఇప్పటికే గోపీచంద్ ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన ‘గౌతమ్ ఘట్టమనేని’, ‘నందకిషోర్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇంతకీ స్కై డైవ్ చేసింది గౌతమా? లేక నందకిషోరా?... ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పం అంటోంది ‘గౌతమ్ నంద’ యూనిట్. శ్రీ బాలజీ సినీమీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ కథానాయికలు. -
గగన ఘనుడు మనోడే..
అమెరికాలో తెలంగాణ యువకుడి సాహసం * 14,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ * విమానంలోంచి దూకిన విలాస్‌రెడ్డి * రైతులకు మద్దతుగా జాతీయ పతాకం ఎగురవేత ఇబ్రహీంపట్నం రూరల్: వంద అడుగుల ఎత్తులోంచి దూకాలంటేనే వందసార్లు ఆలోచిస్తాం. అమ్మో.. ఏం జరుగుతుందో.. ప్రాణాలు పోతారుు మనకెందుకులే అనుకుంటాం. కానీ, 14,500 అడుగుల ఎత్తు నుంచి.. అదీ విమానంలోంచి దూకడం అంటే కత్తిమీద సాము కంటే ఎక్కువే. అంతటి సాహసోపేతమైన క్రీడ (స్కై డైవింగ్) చేపట్టాడు. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన విలాస్‌రెడ్డి. జంబుల రామచంద్రారెడ్డి, అమ్మాయమ్మ దంపతుల కుమారుడు విలాస్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏడేళ్లుగా అక్కడే స్థిరపడ్డాడు. విలాస్‌రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీలో గత ఆదివారం ఈ సాహస కార్యాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో విలాస్రెడ్డితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ కూడా పాల్గొన్నాడు. ఇద్దరూ కలసి ఈ విన్యాసం చేసి ఆకట్టుకున్నారు. 14,500 అడుగుల నుంచి.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి వచ్చిన సందర్భంతోపాటు స్వాతంత్య్రదిన వేడుకలకు స్వాగతం పలుకుతూ .. తెలంగాణ రైతులకు మద్దతుగా మోదీ టీ షర్టు ధరించి ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీలో విలాస్‌రెడ్డి విమానం ఎక్కాడు. విమానంలోంచి విలాస్రెడ్డితో పాటు మరో వ్యక్తి 14,500 అడుగుల మీద నుంచి కిందకు దూకారు. ఈ సందర్భంగా వారు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు, వందేమాతరం, జై తెలంగాణ అంటూ గొంతెత్తి చాటారు. కొత్త రాష్ర్టం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భారతదేశం-అమెరికాల మధ్య మరింత సత్సంబంధాలు ఉండేలా గాడ్‌బ్లెస్ అమెరికా అంటూ నినాదాలు చేశారు. -
గాల్లో తేలిన రాశీఖన్నా!
గాల్లో తేలే ఆటలు ఆడటమంటే గుండె ధైర్యం కావాలి. స్కై డైవింగ్ ద్వారా ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన హీరోలు చాలామందే ఉన్నారు. హీరోయిన్లలో కూడా సరదాగా గాల్లో తేలినవాళ్లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రాశీఖన్నా చేరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ఎప్పట్నుంచో స్కై డైవ్ చేయాలనుకుంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారామె. 14000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేశారు. అంత ఎత్తు నుంచి దూకడం ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించిందని రాశి పేర్కొన్నారు. గాల్లో తేలుతున్నప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనని కూడా అన్నారామె. ఇంతకీ రాశీఖన్నా ఎక్కడ స్కై డైవ్ చేశారనే విషయంలోకి వస్తే.. తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన ‘ఆటా’ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె అక్కడికెళ్లారు. అమెరికాలో స్కె డైవ్ చేశారు. గాల్లో తేలుతున్న ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అది చూసినవాళ్లు.. ‘పైకి సుకుమారంగా కనిపించే రాశి ధైర్యవంతురాలే’ అని కితాబులిచ్చారు. -
'ఊపిరి' కోసం నాగ్, కార్తీల సాహసం
కుర్ర హీరోలకు పోటి ఇచ్చేందుకు సీనియర్ హీరో నాగార్జున అన్ని రకాలుగా కష్టపడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక పాత్రలతో కూడా సత్తా చాటుతున్నాడు. అంతేకాదు ఈ ఏజ్‌లో కూడా సినిమా కోసం రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడు. తాజాగా ఊపిరి సినిమా కోసం కార్తీతో కలిసి ఇలాంటి సాహసమే చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా కోసం వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు నాగార్జున, కార్తీ. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ సీన్ కోసం ఇంత రిస్క్ చేశారు ఈ స్టార్స్. కేవలం 2 రోజులు ట్రైనింగ్ మాత్రమే తీసుకోని ఈ రిస్కీ సీన్‌ను పూర్తి చేశారు. 'ఫ్రెంచ్ మూవీ ది ఇన్‌టచబుల్స్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, కార్తీలతో పాటు అనుష్క, తమన్నాలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి మన నేటివిటికి తగ్గ మార్పులతో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. -
13వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఎంపీ
మైసూరు: కర్ణాటకలో తొలిసారి ప్రతాప్ సింహా అనే ఎంపీ రికార్డు సృష్టించాడు. ఏకంగా 13,000 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి అబ్బుర పరిచారు. ఆయన ఈ సాహసం చేసే సమయంలో తోడుగా ఓ అమెరికన్ మెంటర్ కూడా ఉన్నారు. సోమవారం ఈ ఎడ్వంచర్ ఫీట్‌కు ఆయన తెర తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అధికారికంగా స్కై డైవింగ్ చేసే కార్యక్రమాన్ని మైసూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే. మైసూరు, కొడగు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ఆయన ఈ పనిచేశారు. ప్రతాప్ సింహా(38) మైసూరు కొడగు జిల్లాల నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. స్కై డైవ్ చేసిన తర్వాత సురక్షితంగా మైసూరు విమానాశ్రయంలో దిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ' నాలుగు సీట్లు మాత్రమే ఉండే సెస్నా విమానంలో కూర్చున్న నేను నా మనసులో నిర్ణయించుకున్నట్లుగా 13,000 అడుగుల ఎత్తుకు వెళ్లాను. జంప్ చేయడానికి కొద్ది సమయం ముందు కొంత భయం వేసింది. కానీ చివరికి జంప్ చేశాను. దాంతో ఈ సాహసం నా జీవితంలోనే ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోయింది. డైవింగ్ చేస్తున్న సమయంలో నేను ఎంత థ్రిల్‌గా ఫీలయ్యానో వర్ణించలేను. మైసూరులో స్కై డైవింగ్ కార్యక్రమాన్ని సుకాకిని అనే ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. దేశంలో ఇలాంటి సాహస కృత్యాలు అతి కొద్ది మంది నాయకులు మాత్రమే చేశారు. -
స్వర్గానికి దగ్గరగా...
‘కాంచన’ సినిమాలో కవ్వించిన రాయ్ లక్ష్మీ, రాఘవ లారెన్స్ తదుపరి చిత్రం ‘కరప్పు దురై’ కి సంబంధించి ముంబైలో కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లేలోపు సరదాగా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారామె. తన ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన రాయ్ లక్ష్మీ అక్కడ, కొన్ని సాహసాలు చేశారు. స్కై డైవ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు వాటర్ స్పోర్ట్స్‌తో సందడి చేశారు. ఈ విషయం గురించి రాయ్ లక్ష్మీ చెబుతూ -‘‘13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేయడానికి పూనుకున్నాను. దాంతో కొంచెం టెన్షన్‌గా అనిపించింది. గాల్లోకి ఎగిరేకొద్దీ స్వర్గానికి దగ్గరగా వెళుతున్నట్లనిపించింది. ఈ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది’’ అని అన్నారు.