స్వర్గానికి దగ్గరగా...
‘కాంచన’ సినిమాలో కవ్వించిన రాయ్ లక్ష్మీ, రాఘవ లారెన్స్ తదుపరి చిత్రం ‘కరప్పు దురై’ కి సంబంధించి ముంబైలో కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లేలోపు సరదాగా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారామె. తన ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన రాయ్ లక్ష్మీ అక్కడ, కొన్ని సాహసాలు చేశారు. స్కై డైవ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు వాటర్ స్పోర్ట్స్‌తో సందడి చేశారు. ఈ విషయం గురించి రాయ్ లక్ష్మీ చెబుతూ -‘‘13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేయడానికి పూనుకున్నాను. దాంతో కొంచెం టెన్షన్‌గా అనిపించింది. గాల్లోకి ఎగిరేకొద్దీ స్వర్గానికి దగ్గరగా వెళుతున్నట్లనిపించింది. ఈ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది’’ అని అన్నారు.