గగన ఘనుడు మనోడే..
అమెరికాలో తెలంగాణ యువకుడి సాహసం
* 14,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్
* విమానంలోంచి దూకిన విలాస్‌రెడ్డి
* రైతులకు మద్దతుగా జాతీయ పతాకం ఎగురవేత
ఇబ్రహీంపట్నం రూరల్: వంద అడుగుల ఎత్తులోంచి దూకాలంటేనే వందసార్లు ఆలోచిస్తాం. అమ్మో.. ఏం జరుగుతుందో.. ప్రాణాలు పోతారుు మనకెందుకులే అనుకుంటాం. కానీ, 14,500 అడుగుల ఎత్తు నుంచి.. అదీ విమానంలోంచి దూకడం అంటే కత్తిమీద సాము కంటే ఎక్కువే. అంతటి సాహసోపేతమైన క్రీడ (స్కై డైవింగ్) చేపట్టాడు.
రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన విలాస్‌రెడ్డి. జంబుల రామచంద్రారెడ్డి, అమ్మాయమ్మ దంపతుల కుమారుడు విలాస్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏడేళ్లుగా అక్కడే స్థిరపడ్డాడు. విలాస్‌రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీలో గత ఆదివారం ఈ సాహస కార్యాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో విలాస్‌రెడ్డితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ కూడా పాల్గొన్నాడు. ఇద్దరూ కలసి ఈ విన్యాసం చేసి ఆకట్టుకున్నారు.
14,500 అడుగుల నుంచి..
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి వచ్చిన సందర్భంతోపాటు స్వాతంత్య్రదిన వేడుకలకు స్వాగతం పలుకుతూ .. తెలంగాణ రైతులకు మద్దతుగా మోదీ టీ షర్టు ధరించి ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీలో విలాస్‌రెడ్డి విమానం ఎక్కాడు. విమానంలోంచి విలాస్‌రెడ్డితో పాటు మరో వ్యక్తి 14,500 అడుగుల మీద నుంచి కిందకు దూకారు. ఈ సందర్భంగా వారు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు, వందేమాతరం, జై తెలంగాణ అంటూ గొంతెత్తి చాటారు. కొత్త రాష్ర్టం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భారతదేశం-అమెరికాల మధ్య మరింత సత్సంబంధాలు ఉండేలా గాడ్‌బ్లెస్ అమెరికా అంటూ నినాదాలు చేశారు.