వృద్ధాప్యం అనేది వయస్సుకు గానీ మనస్సుకు కాదని చెప్పడం గురించి మనకు తెలుసు. అలా చెప్పడమే కాదు, అందుకు రుజువు తమ జీవన విధానమేనని నిరూపిస్తున్న వాళ్లు ఇప్పుడు ఎందరో ఉన్నారు. 82వ ఏట ప్రేమించి పెళ్లి చేసుకోవడం, 85వ ఏటా ప్రతి రోజు మధ్యతరహా సముద్రంలో కొన్ని కిలోమీటర్లు ఈతకొట్టడం, 87వ ఏటా రోజు రెండు, గంటల పాటు టెన్నిస్ ఆడుతున్న వద్ధుల గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, ఈర్ష్య కూడా కలుగుతుంది. తాము గతంలో కన్నా ఈ వయస్సులోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నామని చెబుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి.
కెనడాలోని అంటారియోకు చెందిన 87 ఏళ్ల మఫ్వీ గ్రీవ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి రోజు టెన్నీస్ ఆడుతారు. ఆమె గత 70 ఏళ్లుగా టెన్సీస్ ఆడుతూనే ఉన్నారు. ‘‘కెరీర్‌లో అన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకున్నామన్నది ముఖ్యం కాదు. మానవ జీవితం అన్నాక ఒడిదుడుకులు, సమస్యలు తప్పవు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదే ముఖ్యం. అందుకు జీవితం పట్ల సానుకూల దక్పథం అవసరం. ఈ విషయంలో ప్రముఖ రచయిత, తత్వవేత్త బెర్టాండ్ రస్సెల్ నాకు ఆదర్శం. సమస్యలు వస్తే కుంగిపోవద్దని, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని, పరిష్కారం లభించదనుకుంటే ఆ సమస్యలను పక్కన పడేసి ముందుకు పోవాలని ఆయన చెప్పారు. నేను నా జీవితంలో అలాగే చేశాను. నా వయస్సు గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు 30 ఏళ్లా, 60 ఏళ్లా అని ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు 62 ఏళ్ల వయస్సులో మెదడులో ట్యూమర్ వచ్చింది. కంగిపోలేదు. పోరాడాను. ఓసారి బిజినెస్ ట్రిప్పులో బయటకు వెళ్లినప్పుడు కారు దిగి నడవలేక పోయాను. మేజర్ ఆపరేషన్ జరిగింది. మనోధైర్యంతో కోలుకున్నాను. టెన్నీస్, గోల్ఫ్ ఆడడం వల్లనే నేను ఇప్పటికీ ఫిట్‌నెస్‌తో ఉన్నాను. ఆ ఆటలు ఇప్పటికీ ఆడడమేకాదు, ఎక్కడికైనా నడిచే వెళతాను. అదే నా ఆరోగ్య రహస్యం’’ అని ఆమె వివరించారు.
ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు
ఆస్ట్రేలియాకు చెందిన పాట్ (87), అలీసియా మూర్‌హెడ్ (72) వద్ధ దంపతులు ఇప్పటికీ దృడంగా ఉంటారు. స్కై డైవింగ్‌లో వారికి వారే సాటే. పాట్ ఇప్పటికీ పదివేల స్కై డైవింగ్‌లు చేశారు. 80వ ఏటా ఒక్క రోజులో ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించానని పాట్ తెలిపారు. వయస్సు మీరాక ఎవరైనా స్కై డైవింగ్‌లకు స్వస్తి చెబుతారని, అయితే అలా తాను చేయదల్చుకోలేదని అన్నారు. తాను లిఫ్టులేని ఇంటి మేడపైకి మెట్లెక్కే పోతానని, ఆ ఆలోచన వల్లనే ఇంటికి లిఫ్టు కూడా పెట్టించలేదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నప్పుతే తాను జిమ్నాస్టని, ఆ తర్వాత 30వ ఏటా స్కై డైవింగ్ నేర్చుకున్నానని పాట్ భార్య అలీసియా తెలిపారు. అందుకనే స్కై డైవింగ్ పట్ల ఆసక్తి కలిగిన పాట్ చేసుకొని ఇప్పటికీ డైవింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
కాలి నడకతోనే ఎక్కువ సంచరిస్తా
ఛానల్ ఐలాండ్స్‌లోని ఆల్డెర్నీకి చెందిన రీటా గిల్‌మోర్‌కు 87 ఏళ్లు. ఆమె భర్త మోరిస్ 74వ ఏట మరణించారు. అప్పటి వరకు ఆయన చూసుకున్న అతిపెద్ద రెస్టారెంట్‌ను ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. తాగుడు, స్మోకింగ్ అలవాటు లేని తాను, కార్లలో కంటే కాలి నడకనే ఎక్కువ సంచరిస్తానని, అదే తన ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఇలాంటి వాళ్లందరి గురించి ‘లైఫ్ లెస్సన్స్ ఫర్ పీపుల్ ఓల్డర్ అండ్ వైజర్ ద్యాన్ యూ’ పేరిట హార్డీగ్రాంట్ ప్రచురించిన పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment