Canada based woman
-
గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!
మహిళకు తల్లి కావడం ఓ పెద్ద వరం అంటారు. ప్రెగ్నెన్సీతో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ తల్లి అయిన ప్రతి స్త్రీ తన గర్భధారణను ఆనందిస్తుంది. కానీ అందరు స్త్రీలు అదృష్టవంతులు కాదు. ప్రపంచంలోని చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక తాజాగా ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు. సదరు మహిళ కాలేయంలో ఎక్టోపిక్ గర్భం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫెలోపియన్ ట్యూబ్లలో గుడ్డు తప్పు దిశలో ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. దీని కారణంగా గర్భం సరిగ్గా జరగదు. ఇది కడుపులో చాలాసార్లు కనిపిస్తుంది, కానీ మొదటిసారిగా ఇది కాలేయంలో కనిపించింది. అది గమనించిన వైద్యులు వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేయగా తన ప్రాణం రక్షించబడింది. కానీ పిండం మాత్రం అప్పటికే కాలేయంలో చనిపోయింది. అటువంటి పరిస్థితిలో వైద్యులు కాలేయం నుండి చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు. కెనడియన్ శిశు వైద్యుడు డాక్టర్ మైఖేల్ తన టిక్‌టాక్ ఖాతాలో వీడియో ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. ఇక ఇలాంటి సంఘటనే 2012లో ఓ మహిళ కాలేయంలో 18 వారాల పిండం కనిపించింది. దీంతో తనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స సమయంలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. -
87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..
వృద్ధాప్యం అనేది వయస్సుకు గానీ మనస్సుకు కాదని చెప్పడం గురించి మనకు తెలుసు. అలా చెప్పడమే కాదు, అందుకు రుజువు తమ జీవన విధానమేనని నిరూపిస్తున్న వాళ్లు ఇప్పుడు ఎందరో ఉన్నారు. 82వ ఏట ప్రేమించి పెళ్లి చేసుకోవడం, 85వ ఏటా ప్రతి రోజు మధ్యతరహా సముద్రంలో కొన్ని కిలోమీటర్లు ఈతకొట్టడం, 87వ ఏటా రోజు రెండు, గంటల పాటు టెన్నిస్ ఆడుతున్న వద్ధుల గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, ఈర్ష్య కూడా కలుగుతుంది. తాము గతంలో కన్నా ఈ వయస్సులోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నామని చెబుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. కెనడాలోని అంటారియోకు చెందిన 87 ఏళ్ల మఫ్వీ గ్రీవ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి రోజు టెన్నీస్ ఆడుతారు. ఆమె గత 70 ఏళ్లుగా టెన్సీస్ ఆడుతూనే ఉన్నారు. ‘‘కెరీర్లో అన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకున్నామన్నది ముఖ్యం కాదు. మానవ జీవితం అన్నాక ఒడిదుడుకులు, సమస్యలు తప్పవు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదే ముఖ్యం. అందుకు జీవితం పట్ల సానుకూల దక్పథం అవసరం. ఈ విషయంలో ప్రముఖ రచయిత, తత్వవేత్త బెర్టాండ్ రస్సెల్ నాకు ఆదర్శం. సమస్యలు వస్తే కుంగిపోవద్దని, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని, పరిష్కారం లభించదనుకుంటే ఆ సమస్యలను పక్కన పడేసి ముందుకు పోవాలని ఆయన చెప్పారు. నేను నా జీవితంలో అలాగే చేశాను. నా వయస్సు గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు 30 ఏళ్లా, 60 ఏళ్లా అని ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు 62 ఏళ్ల వయస్సులో మెదడులో ట్యూమర్ వచ్చింది. కంగిపోలేదు. పోరాడాను. ఓసారి బిజినెస్ ట్రిప్పులో బయటకు వెళ్లినప్పుడు కారు దిగి నడవలేక పోయాను. మేజర్ ఆపరేషన్ జరిగింది. మనోధైర్యంతో కోలుకున్నాను. టెన్నీస్, గోల్ఫ్ ఆడడం వల్లనే నేను ఇప్పటికీ ఫిట్నెస్తో ఉన్నాను. ఆ ఆటలు ఇప్పటికీ ఆడడమేకాదు, ఎక్కడికైనా నడిచే వెళతాను. అదే నా ఆరోగ్య రహస్యం’’ అని ఆమె వివరించారు. ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ (87), అలీసియా మూర్హెడ్ (72) వద్ధ దంపతులు ఇప్పటికీ దృడంగా ఉంటారు. స్కై డైవింగ్‌లో వారికి వారే సాటే. పాట్ ఇప్పటికీ పదివేల స్కై డైవింగ్‌లు చేశారు. 80వ ఏటా ఒక్క రోజులో ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించానని పాట్ తెలిపారు. వయస్సు మీరాక ఎవరైనా స్కై డైవింగ్లకు స్వస్తి చెబుతారని, అయితే అలా తాను చేయదల్చుకోలేదని అన్నారు. తాను లిఫ్టులేని ఇంటి మేడపైకి మెట్లెక్కే పోతానని, ఆ ఆలోచన వల్లనే ఇంటికి లిఫ్టు కూడా పెట్టించలేదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నప్పుతే తాను జిమ్నాస్టని, ఆ తర్వాత 30వ ఏటా స్కై డైవింగ్ నేర్చుకున్నానని పాట్ భార్య అలీసియా తెలిపారు. అందుకనే స్కై డైవింగ్ పట్ల ఆసక్తి కలిగిన పాట్ చేసుకొని ఇప్పటికీ డైవింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాలి నడకతోనే ఎక్కువ సంచరిస్తా ఛానల్ ఐలాండ్స్‌లోని ఆల్డెర్నీకి చెందిన రీటా గిల్మోర్కు 87 ఏళ్లు. ఆమె భర్త మోరిస్ 74వ ఏట మరణించారు. అప్పటి వరకు ఆయన చూసుకున్న అతిపెద్ద రెస్టారెంట్‌ను ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. తాగుడు, స్మోకింగ్ అలవాటు లేని తాను, కార్లలో కంటే కాలి నడకనే ఎక్కువ సంచరిస్తానని, అదే తన ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఇలాంటి వాళ్లందరి గురించి ‘లైఫ్ లెస్సన్స్ ఫర్ పీపుల్ ఓల్డర్ అండ్ వైజర్ ద్యాన్ యూ’ పేరిట హార్డీగ్రాంట్ ప్రచురించిన పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు -
'కలిసి పనిచేద్దామని అసభ్యంగా తాకాడు'
చండీగఢ్: మరో ఆప్ నేత చిక్కుల్లో పడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. ఓ పని పేరిట తన వద్దకు వచ్చిన సమయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, అసభ్యంగా తాకాడని చెప్పింది. తాను చివరికి ఎలాంటి హానీ జరగకుండా తప్పించుకొని బయటపడ్డాక కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించాడని, ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని, మరోసారి కలిసి పనిచేద్దామని పలుమార్లు బ్రతిమాలినట్లు ఆరోపిచింది. పంజాబ్‌లోని దేవ్ మన్ అనే ఆప్ కు చెందిన వ్యక్తి అక్కడ ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనను 2017 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దించుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ఈ లోగానే ఆయనపై వేధింపుల ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై దేవ్ ను ప్రశ్నించగా ఇదంతా శిరోమణి అకాలీదల్ వాళ్లు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగానే జీర్ణించుకోలేని ఆ పార్టీ తనపై మరో ఇద్దరు భారత సంతతికి చెందిన కెనడీయన్ మహిళలతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎస్సీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్నానని, ఇప్పుడు వారంతా తనవైపు తిరగడంతో తన విజయం ఖాయం అని భయపడి ఇలా లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. తాను 2000 నుంచి కెనడా వెళుతున్నానని, 2006లో వర్క్ పర్మిట్ కూడా తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్ లో కూడా తనపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని అయినా తనకు ఏం కాదని ధీమా వ్యక్తం చేశారు.