ప్రతీకాత్మక చిత్రం
మహిళకు తల్లి కావడం ఓ పెద్ద వరం అంటారు. ప్రెగ్నెన్సీతో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ తల్లి అయిన ప్రతి స్త్రీ తన గర్భధారణను ఆనందిస్తుంది. కానీ అందరు స్త్రీలు అదృష్టవంతులు కాదు. ప్రపంచంలోని చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇక తాజాగా ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు.
సదరు మహిళ కాలేయంలో ఎక్టోపిక్ గర్భం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫెలోపియన్ ట్యూబ్‌లలో గుడ్డు తప్పు దిశలో ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. దీని కారణంగా గర్భం సరిగ్గా జరగదు. ఇది కడుపులో చాలాసార్లు కనిపిస్తుంది, కానీ మొదటిసారిగా ఇది కాలేయంలో కనిపించింది.
అది గమనించిన వైద్యులు వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేయగా తన ప్రాణం రక్షించబడింది. కానీ పిండం మాత్రం అప్పటికే కాలేయంలో చనిపోయింది. అటువంటి పరిస్థితిలో వైద్యులు కాలేయం నుండి చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు. కెనడియన్ శిశు వైద్యుడు డాక్టర్ మైఖేల్ తన టిక్‌టాక్ ఖాతాలో వీడియో ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు.
ఇక ఇలాంటి సంఘటనే 2012లో ఓ మహిళ కాలేయంలో 18 వారాల పిండం కనిపించింది. దీంతో తనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స సమయంలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment