pediatrician
-
ఎలాన్ మస్క్ ఔదార్యం
టొరంటో: కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ఎక్స్(ట్విట్టర్) వ్యవస్థాపకుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. ఆమె చెల్లించాల్సిన 3 లక్షల డాలర్లు(రూ.2.50 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ కెనడానలోని గ్రేటర్ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. పిడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యూనాలజీలో పోస్ట్రుగాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. స్పెషలిస్టు డాక్టర్‌గా గుర్తింపు పొందారు. పేద ప్రజలకు, వలసదారులకు తన సేవలు అందిస్తుంటారు. 2020లో కెనడాలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌ను కుల్విందర్ కౌర్ గిల్ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు. లాక్డౌన్, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్(ఇప్పుడు ఎక్స్) ధైర్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ అంటారియో విచారణ ప్రారంభించింది. క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై కుల్విందర్ కౌర్ గిల్ న్యాయ పోరాటానికి దిగారు. కానీ, దురదృష్టం వెక్కిరించింది. 1.2 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్‌లో కోర్డు ఆమెను ఆదేశించింది. పలు విన్నపాల తర్వాత జరిమానాను 3 లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ గత నెలలో తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడానికి గడువు కూడా ఎక్కువగా లేదు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్ కౌర్ ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దాదాపు సగం నిధులు సేకరించింది. జరిమానా చెల్లించడానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతలో ఈ విషయంలో తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. మొత్తం 3 లక్షల డాలర్ల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఆయనకు కుల్విందర్ కౌర్ గిల్ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. కుల్విందర్ కౌర్ గిల్ ఎలాన్ మస్క్ -
ఫస్ట్ ఎయిడ్‌తో వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు
ఫస్ట్ ఎయిడ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నా వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్ శివరంజని. హైదరాబాద్‌కు చెందిన ఈ పిడియాట్రీషియన్ పసిపిల్లల్లో, పెద్దల్లో వచ్చే హటాత్ అపస్మారకం, ఉక్కిరిబిక్కిరి, ఫిట్స్ సమయాల్లో ఎలా వ్యవహరిస్తే ప్రాణాలు నిలుస్తాయో గత దశాబ్దకాలంగా ఉచిత వర్క్‌షాపుల ద్వారా చైతన్యపరుస్తున్నారు. తన జీవితంలోని ఒక సంఘటన వల్లే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నానని అంటున్నారామె. రాధిక (పేరు మార్చాం) హాల్లో టీవీ చూస్తోంటే బాత్రూమ్లోనుంచి ధబ్మని శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్లి చూస్తే భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతనికి హార్ట్ఎటాక్ వచ్చినట్టు ఆమెకు అర్థమైంది. అదృష్టవశాత్తు నెల క్రితం ఆమె డాక్టర్ శివరంజని నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో సి.పి.ఆర్. ఎలా చేయాలో తెలుసుకుంది. వెంటనే ఛాతీ మీద నియమానుసారం నొక్కుతూ భర్తకు నోటితో ఊపిరి అందించింది. భర్తలో చలనం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అతనికి వచ్చిన హార్ట్ఎటాక్ ప్రాణాంతకం కాకుండా కాపాడటంలో ఆమె చేసిన సి.పి.ఆర్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్లు తెలిపారు. ‘ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇలాగే ఎన్నోప్రాణాలు నిలుస్తాయి. ఆమె సాధారణ గృహిణి. సి.పి.ఆర్. ఎలా చేయాలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆమెకే కాదు.. ఆమెలాంటి గృహిణులకు స్త్రీలకు అందరికీ ఎవరో ఒకరు తెలపాలి. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా తెలుపుతున్నాను’ అంటారు శివరంజని. పిల్లల డాక్టర్ డాక్టర్ శివరంజని పిల్లల డాక్టర్. ‘మా నాన్నగారు, తాతగారు కూడా డాక్టర్లే. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు పిల్లలంటే ఇష్టం కనుక వారికి వైద్యం చేయడంలో ఆనందం ఉందనిపించింది. జిప్మర్ (పాండిచ్చేరి)లో పిల్లల వైద్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను’ అన్నారు శివరంజని. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే కేవలం తన వృత్తిని పనిగా మాత్రమే చూడదలుచుకోలేదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని సామాన్యులకు కొద్దిగానైనా అందుబాటులో తేవాలని అనుకున్నారు. ‘మన దగ్గర ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియపోవడం వల్ల జరుగుతోంది. గుండెపోటు, మూర్ఛ, అపస్మారకం, ఊపిరాడకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ శాస్త్రీయమైన శిక్షణ ఉంటే చాలా ప్రాణాలు కాపావచ్చు. అందుకే గత పదేళ్లుగా నేను ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు’ అన్నారామె. మలుపు తిప్పిన ఘటన ‘నేను పాండిచ్చేరిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఉసిరి కాయలు తింటుంటే హటాత్తుగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నా పక్కనే సహ విద్యార్థిని ఉంది. ఆమెకు ఇలాంటి స్థితిలో చేయాల్సిన హైమ్లక్ మనూవా (ఉక్కిరిబిక్కిరి సమయంలో పొత్తికడుపు మీద నొక్కుతూ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్) తెలుసు. వెంటనే చేసింది. ఆమె లేకున్నా, ఆ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా ఇవాళ మిగిలేదాన్ని కాదు. అప్పుడే నాకు ఫస్ట్ ఎయిడ్ విలువ ఏంటో తెలిసింది. కా6ఋ దురదృష్టం మన దేశంలో ఇందుకై సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వరు. అవగాహన కల్పించరు. కొద్దిమందికే ఈ అవగాహన ఉంటుంది. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన కలిగిస్తున్నాను’ అన్నారు శివరంజని. పసిపిల్లలకు ‘చంటిపిల్లలు ఒక్కోసారి ఊపిరిపీల్చని స్థితికి వెళతారు. సి.పి.ఆర్ చేయడం తెలిసుంటే పిల్లల్ని కాపాడుకోగలుగుతారు తల్లులు. అలాగే వారు గొంతుకు అడ్డం పడేలా ఏదైనా మింగినప్పుడు కూడా ఏం చేయాలో తల్లులకు తెలియాలి. ఇవన్నీ నా వర్క్‌షాప్స్‌లో చూపిస్తాను. ఇందుకు బొమ్మలను ఉపయోగిస్తాను’ అన్నారు శివరంజని. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్లైన్లో సెషన్స్ నిర్వహిస్తారు. ‘కాని చాలామంది తల్లులు సెషన్స్‌కు రారు. ఆ ఏముందిలే అనుకుంటారు. వారిని ఒప్పించి తేవడం కష్టం. అయినా నేను పట్టువిడవక ప్రయత్నిస్తాను. ఫోన్లు చేసి పిలుస్తాను. వాట్సప్ గ్రూప్ పెట్టి వెంటపడతాను’ అంటారు శివరంజని. డాక్టర్ శివరంజని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగుళూరులలో గత పదేళ్లలో 12 వేల మంది తల్లులకు, సాధారణ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్పించారు. అంతేకాదు... సీజనల్‌గా అవసరమైన హెల్త్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి కృషి విలువైనది. ఇతర డాక్టర్లు అనుసరించాల్సినది. -
గొంతులో ఏదైనా ఇరుక్కుపోయిందా? పొరబోయిందా?
పలకాబలపాలతో బడికి పోయే వయసులోనూ, అంతకంటే చిన్నప్పుడు ఆడుకునే ఈడులో తెలిసీతెలియక చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు... కొందరు చిన్నారులు ముక్కులో బలపం/చిన్నచాక్పీస్/చిన్న పెన్సిల్ వంటివి పెట్టుకుని, అది లోనికి వెళ్లేలా పీల్చడం లాంటి పనులు చేస్తుంటారు. మరికొందరు నాణేలను నోట్లో పెట్టుకుని మింగడం వల్ల అవి గొంతులో ఇరుక్కుని బాధపడుతుంటారు. గొంతులో ఇరుక్కునే చిన్నవస్తువులు ఇంకా ఎన్నో! ఆహారం అలా ఇరుక్కుంటే పొరబోయిందంటూ మన ఇళ్లలోని పెద్దలు అంటుంటారు. అలా జరిగినప్పుడు కాసేపు బాధగా ఉండి... అది బయటకు తన్నేసినట్లుగా ఒక్కోసారి ముక్కులోంచి కూడా వస్తుంటుంది. ఇలా గొంతులో బయటి వస్తువులు ఇరుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ప్రథమచికిత్సలను తెలుసుకుందాం. ముక్కు... నోరు... ఈ రెండింటికీ కొంత దూరం. కానీ గొంతులో రెండిటి మార్గం కాసేపు ఒకటే. ఆ తర్వాత గాలి... విండ్‌పైప్ ద్వారా ఊపిరితిత్తుల్లోకీ, ఆహారం ఫుడ్‌పైప్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. గొంతులో గ్లాటిస్ అనే చోట ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన విండ్‌పైప్, ఆహారం తీసుకెళ్లే ఈసోఫేగస్ ఈ రెండూ మార్గాలూ ఒకేచోట ఉంటాయి. అయితే... ఇక్కడే ఎపిగ్లాటిస్ అనే పొర ఉండి... మనం గాలిని పీల్చుకుంటున్న సమయంలో విండ్‌పైప్ మాత్రమే తెరచి ఉండేలా చూసి... ఆహారనాళాన్ని మూసి ఉంచుతుంది. అలాగే ఆహారాన్ని మింగుతున్నప్పుడు ఆహారనాళమే తెరచి ఉండేలా చూసి, విండ్‌పైప్‌ను మూసేస్తుంది. (చదవండి: బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం...) అయితే ఒక్కోసారి మనం ప్రధానంగా నీళ్లూ లేదా ద్రవాహారాలు (కొన్నిసార్లు అన్నం వంటి ఘనాహారాలు కూడా) తీసుకునే సమయంలో అవి పొరబాటున విండ్వైప్లోకి వెళ్లిపోతాయి. దాంతో ఓ రక్షణాత్మకమైన చర్యలా... ఊపిరితిత్తుల్లోంచి గాలి ఫోర్స్‌గా బయటకు చిమ్ముకొచ్చినట్లుగా వస్తూ... ఆ పదార్థాలను బలంగా బయటికి నెట్టేస్తుంది. అలాగే చిన్నపిల్లలు తమ గొంతులో ఉండే పైప్ కంటే పెద్ద సైజులో ఉండే వస్తువులను తీసుకున్నప్పుడు అవి గొంతులోకి ఇరుక్కుపోతాయి. అప్పుడూ బలంగా దగ్గు, గాలి వచ్చినా... ఆ ఘన పదార్థలు గట్టిగా ఉండటంతో బయటకు నెట్టలేకపోతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... గొంతులో ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► నాలుగేళ్ల లోపు పిల్లలకు పెద్ద క్యారట్ ముక్కలు, పెద్దగా ఉండే నట్స్, బాగా గట్టిగా ఉండే చాక్లెట్లు, పెద్ద గింజలుండే పండ్లను పెట్టకూడదు. ఒకవేళ తినిపిస్తే... వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాక మాత్రమే ఇవ్వాలి లేదా క్యారట్ వంటి వాటిని తురిమి ఇవ్వాలి. వాటిని మెత్తగా నమిలి తినమని పిల్లలకు చెప్పాలి. ► చిన్నపిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని పిల్లలు విరగొట్టడం చాలా సాధారణం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి. అంటే వాటి విడిభాగాలు నోట్లోకి దూరనంత పెద్దగా ఉండాలన్నమాట. చిన్న చిన్న పూసల్లాంటి విడిభాగాలతో ఉండే బొమ్మలను పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు తప్పకుండా పక్కనే ఉండాలి. (గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!) ► పిల్లల ఉయ్యాలపై వేలాడదీసే రంగులరాట్నం వంటి బొమ్మలు వాళ్ల చేతికి అందనంత ఎత్తులో అమర్చాలి. ► పిల్లలు బెలూన్ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► చిన్నారులు తమ మెడలోని చైన్లను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున... బాగా సన్నటి చైన్లను, నెక్లేస్లను పిల్లల మెడలో వేయకూడదు. ► చిన్న పిల్లలు ఆడుకోడానికి నాణేలు, కాసులు ఇవ్వడం సరికాదు. గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి.. ► ఏదైనా వస్తువు మింగిన చిన్నారి బాగా గట్టిగా దగ్గుతున్నా / గట్టిగా ఏడుస్తున్నా / మాట్లాడగలుగుతున్నా వారికి అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్లనే మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ► పిల్లలు చాలా బలహీనంగా దగ్గుతున్నా / ఊపిరితీస్తున్నప్పుడు సన్నటి శబ్దం వస్తున్నా / ఏడుపుగాని, మాటగాని, గొంతులోంచి వచ్చే శబ్దంగాని చాలా బలహీనంగా ఉన్నా... వారు మింగిన వస్తువు గొంతులో బలంగా ఇరుక్కుపోయిందని తెలుసుకోవాలి. వస్తువు మింగిన చిన్నారి వయసు ఏడాదికి పైబడి ఉన్నప్పుడు వారికి ‘హీమ్లిచ్ మెనోవర్’ అనే ప్రథమ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఏడాది లోపు పిల్లలకు... ► మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టిప్పుడు చిన్నారి తల కిందివైపునకు ఉండేలా చూడాలి. చేతులతో వీపుపై అకస్మాత్తుగా, బలంగా ఒత్తిడి కలిగించాలి. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను నడుము భాగం నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలించాలి. మన కాళ్ల ఒత్తిడికీ, చేతుల ఒత్తిడికీ పిల్లల పొట్ట ముడుచుకుపోవడం వల్ల... ఇరుక్కున్న వస్తువు పైకి ఎగబాకి, బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మనం కలిగించే ఒత్తిడి పిల్లలను గాయపరచనంత మృదువుగా మాత్రమే ఉండాలి. ► చిన్నారులు ఏదైనా వస్తువు మింగినప్పుడు వాళ్ల పొట్టపై రుద్దకూడదు. దానివల్ల పొట్టలోపల గాయాలయ్యే అవకాశం ఉంది. ► ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► మింగిన వస్తువు పిల్లల నోటి నుంచి బయటకు వచ్చే వరకు తినడానికి గాని, తాగడానికి గాని ఏమీ ఇవ్వవద్దు. తలపై తట్టకండి... ► గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికి వీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులోకి రాగానే ఊసేయమని చెప్పాలి. అంతే తప్ప తలపై తట్టకూడదు. ► గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని అనుమానించినప్పుడు పిల్లలు తమ నాలుకను బాగా చాపేలా ప్రోత్సహించి, వేళ్లను గొంతులోకి పోనిచ్చి మన స్పర్శకు ఏవైనా తగులుతున్నాయేమో చూడాలి. వేళ్లకు ఏదైనా తగులుతుంటే మునివేళ్లతో వాటిని బయటకు తీసేయాలి. ఎలా తీస్తారు? ► పిల్లలు సహకరిస్తే... డాక్టర్లు లారింగోస్కోప్తో గొంతులో ఇరుక్కున్న పదార్థాన్ని తీసివేస్తారు. ఒకవేళ సహకరించకపోతే వారికి అనస్థటిక్ డాక్టర్ సహకారంతో కొద్దిగా మత్తు ఇచ్చి తొలగివంచవచ్చు. ► లారింగోస్కోప్ చేసి బల్బ్ ఉన్న ఎండోట్రాకియల్ ట్యూబ్ అనే దాని సహాయంతోగానీ లేదా బ్రాంకోస్కోప్ అనే పరికరం సహాయంతగానీ ఇరుక్కున్నదాన్ని తీసివేయవచ్చు. హీమ్లిచ్ మెనోవర్ ఎలా? ► గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు చిన్నారి వెనకవైపున మనం నిల్చోవాలి. మన రెండు చేతులను పిల్లల పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా ఠక్కున కదిలించాలి. క్రమంగా ఆ పట్టును... పొట్టపై కింది భాగం నుంచి పై వైపునకు కదల్చాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది క్రమంగా పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్నే హీమ్లిచ్ మెనోవర్ అంటారు. - డాక్టర్ జి. గంగాధర్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, విజయవాడ. -
గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!
మహిళకు తల్లి కావడం ఓ పెద్ద వరం అంటారు. ప్రెగ్నెన్సీతో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ తల్లి అయిన ప్రతి స్త్రీ తన గర్భధారణను ఆనందిస్తుంది. కానీ అందరు స్త్రీలు అదృష్టవంతులు కాదు. ప్రపంచంలోని చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక తాజాగా ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు. సదరు మహిళ కాలేయంలో ఎక్టోపిక్ గర్భం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫెలోపియన్ ట్యూబ్లలో గుడ్డు తప్పు దిశలో ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. దీని కారణంగా గర్భం సరిగ్గా జరగదు. ఇది కడుపులో చాలాసార్లు కనిపిస్తుంది, కానీ మొదటిసారిగా ఇది కాలేయంలో కనిపించింది. అది గమనించిన వైద్యులు వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేయగా తన ప్రాణం రక్షించబడింది. కానీ పిండం మాత్రం అప్పటికే కాలేయంలో చనిపోయింది. అటువంటి పరిస్థితిలో వైద్యులు కాలేయం నుండి చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు. కెనడియన్ శిశు వైద్యుడు డాక్టర్ మైఖేల్ తన టిక్‌టాక్ ఖాతాలో వీడియో ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. ఇక ఇలాంటి సంఘటనే 2012లో ఓ మహిళ కాలేయంలో 18 వారాల పిండం కనిపించింది. దీంతో తనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స సమయంలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. -
పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా?
మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటి నుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి? – డి. రమాసుందరి, విజయనగరం మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావాయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్ థెరపీతో వాటిని తొలగించవచ్చు. రంగులతో ఉండే ఆహారాలు తీసుకోవచ్చా? మా బాబు బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. వాటినే ఇప్పించమని అడుగుతుంటాడు. అవి మంచిదేనా? – ఎమ్. శ్రీవాణి, మేదరమెట ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణులు (హైపర్ యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. - డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, హైదరాబాద్ -
చదువుకి వైద్యం
డాక్టర్ అవబోయి టీచర్ అవలేదు అనూరాధ. డాక్టర్ అయ్యాక.. టీచర్ అవ్వాలనుకుని చాక్‌పీస్‌తో చదువుకు వైద్యం చేయడానికి బయల్దేరారు. డాక్టర్ అనూరాధ కిశోర్, ఢిల్లీలో మంచి పేరున్న పీడియాట్రీషియన్. పిల్లల డాక్టర్‌గా పదిహేడేళ్ల అనుభవం ఆమెది. అలాంటి డాక్టరమ్మ ఓ రోజు టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు! ఆ మాట విన్న తోటి డాక్టర్లే కాదు, ఆమె అప్లికేషన్‌ను పరిశీలించి, ఆమోదించిన అధికారులు కూడా విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఈవిడకిదేం పిచ్చి అని ముఖాన అనలేదన్నమాటే కానీ దాదాపుగా కొంచెం అటూఇటుగా వారందరి అభిప్రాయం ఇదే! చదువే అనారోగ్యమా? ఇంతకీ అనూరాధ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం... పిల్లలు తరచూ అనారోగ్యం పాలు కావడమే. పిల్లలంటే ఆమె పిల్లలు కాదు. ఆమె దగ్గరకు తల్లిదండ్రులు తెస్తున్న పిల్లలు. ఎన్ని పరీక్షలు చేసినా పిల్లల్లో ఫిజికల్‌గా అనారోగ్యం కనిపించేది కాదు. అయితే ఒత్తిడికి లోనవుతున్న లక్షణాలు కనిపించేవి. మానసికంగానే వారిని ఏదో పీడిస్తున్నట్లుండేది. ఈ వయసులో వాళ్లకు ఇంకేం బరువు బాధ్యతలుంటాయని పీడించటానికి? బహుశా వారిని భయపెడుతున్న భూతం చదువే కావచ్చు, వారు భయపడుతున్న బూచి స్కూలే కావచ్చు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక నొప్పిని వాళ్లే వెతుక్కుంటూ ఉండవచ్చు. ఇవన్నీ తన ఊహాజనితమైన అనుమానాలేనా లేక పూర్తిగా నిజాలా? ఇది తెలియాలంటే స్కూలు ఎలాగుందో తెలుసుకోవాలి? పిల్లల మీద పాఠాల ఒత్తిడి ఎలా ఉంటోందో తెలుసుకోవాలి అనుకున్నారు డాక్టర్ అనూరాధ. ఆమె టీచర్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి వెనుక ఇంత కథ ఉంది. పిల్లలవన్నీ సిక్ లీవులే! కోర్సు అయ్యాక, ఢిల్లీ సమీపంలోని గుర్‌గ్రామ్‌లోని ప్రోగ్రెసివ్ స్కూల్లో కిండర్‌గార్డెన్ టీచర్‌గా చేరారు అనూరాధ. క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టిన తరువాత ఆమెకి ఒక్కో సందేహానికీ సమాధానం దొరికింది. క్లాస్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వాళ్ల అటెండెన్స్ హిస్టరీని, హెల్త్హిస్టరీని పరిశీలించారామె. ఏ క్లాస్‌లో అయినా చదువులో చురుకైన పిల్లలతోపాటు, రమారమిగా చదివేవాళ్లు, ఒక మోస్తరుగా చదువుతూ బొటాబొటి మార్కులతో గట్టెక్కేవాళ్లు, పాస్‌మార్కులు తెచ్చుకోవడమూ కష్టమే అనిపించే పిల్లలూ ఉంటారు. చురుగ్గా ఉండే పిల్లలు, యావరేజ్‌గా చదివేవాళ్లలోనూ అభద్రత కనిపించడం లేదు కానీ అంతకంటే తక్కువ గ్రహింపు శక్తితో ఉన్న పిల్లల్లోనే అటెండెన్స్ తగ్గడం గమనించారామె. స్కూలుకి ఆబ్సెంట్ అయిన కారణాలు ‘అనారోగ్యాలే’ అయి ఉంటున్నాయి! తెలిసింది అడిగితే ఆత్మవిశ్వాసం యావరేజ్ పిల్లల్ని చురుకైన పిల్లలతో కలిపి పాఠాలు చెప్పి వదిలేస్తే కుదరదనుకున్నారామె. అలా చెప్పడం వల్ల చురుకైన పిల్లలు త్వరగా నేర్చుకుంటూ, టీచర్ అడిగిన ప్రశ్నకు టక్కున బదులిస్తూ, తోటి పిల్లల వైపు విజయగర్వంతో చూస్తుంటారు. టీచర్ యావరేజ్ స్టూడెంట్‌ని ప్రశ్న అడిగినప్పుడు ఆ పిల్లవాడు తనకు సమాధానం తెలియదనే భయంతో బిగుసుకుపోతుంటాడు. తరచూ ఇలా జరుగుతుంటే పిల్లల్లో న్యూనత పెరిగిపోతుంది, ముడుచుకుపోతారు. స్కూలంటేనే భయపడుతూ, మానేయడానికి దారులు వెతుక్కుంటారు. మరే కారణం చెప్పినా అమ్మానాన్నలు ఒప్పుకోరు కాబట్టి పొట్టలో నొప్పి, కాలు నొప్పి వంటి కారణాలు చెప్తారు. మరికొందరిలో పాఠాల ఒత్తిడి, స్కూలు భయంతో జ్వరం వస్తుంటుంది కూడా. అందుకే అలాంటి పిల్లలను ఎక్కువ సేపు ఆటపాటల్లో ఉంచుతున్నారు అనూరాధ. అంతకంటే ఎక్కువగా ఆమె ఒక విషయాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. డల్ స్టూడెంట్స్‌లో ఎవరు ఏ పాఠాన్ని బాగా నేర్చుకున్నారో గమనించారు. క్లాస్‌లో వాళ్లను ఆ పాఠాల్లోని ప్రశ్నలే అడిగేవారు. దాంతో ఆ పిల్లల్లో టీచర్ ప్రశ్నలకు తాము కూడా సమాధానం చెప్పగలమని ఆత్మవిశ్వాసం కలిగింది. క్రమంగా స్కూలంటే భయం తగ్గడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కూడా క్లాస్‌లోనే అనూరాధ క్లాస్‌లో పిల్లలంతా ఐదేళ్లలోపు వాళ్లే. ఆ వయసు పిల్లలు ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకోకుండా ఉండరు. పిల్లల గాయాలకు అనూరాధ స్వయంగా మందురాసి కట్టు కట్టడాన్ని చూసిన తోటి టీచర్లు... ‘టీచరైనా మీలో డాక్టర్ ఎక్కడికీ పోలేద’ని చమత్కరిస్తుంటారు. అప్పుడామె ‘‘డాక్టర్ వైద్యాన్ని వదిలేయవచ్చేమో కానీ వైద్యం డాక్టర్ని వదిలి వెళ్లదు. స్టెతస్కోపు పక్కన పెట్టి బ్లాక్‌బోర్డు పక్కన నిలబడగలిగాను, కానీ గాయాన్ని చూసినప్పుడు డాక్టర్ బయటకు వస్తుంది’’ అంటారు. అనూరాధ టీచర్ చేస్తున్న ప్రాక్టీస్ మంచి ఫలితాలనే సాధిస్తోంది. పిల్లలకు చదువు చెప్పడం రాకపోతే పిల్లలు పేషెంట్లవుతారు. చదువు చెప్పే విధానానికే వైద్యం చేస్తే పిల్లలు హాస్పిటల్ ముఖం చూడకుండా పెరుగుతారు. అనూరాధ అధ్యయనంలో తెలిసిన సంగతి ఏమిటంటే... పిల్లలు స్కూలంటే ముఖం చాటేస్తున్నారంటే, లోపం ఉన్నది పిల్లల్లో కాదు. ఆడుతూ పాడుతూ, ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా పాఠాన్ని చెప్పడం తెలియని విద్యావిధానానిదే లోపం. ఆ విధానంలో చదువు చెప్తున్న స్కూళ్లదే అసలైన లోపం. ఆ లోపాన్ని సరిదిద్దడానికి టీచర్లే పూనుకోవాలి. ఐక్యూ వేరైనా ఒకేలా చూడాలి పిల్లలతో గడపడం నాకిష్టం, అందుకే పీడియాట్రీషియన్ కోర్సు చదివాను. ఇన్నేళ్ల పాటు నా దగ్గరకు వచ్చిన పిల్లలు పేషెంట్లు. ఇప్పుడు నాకు రోజూ ఉదయాన్నే పిల్లలు పువ్వుల్లా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. చదువంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, క్లాస్ రూమ్‌లో పిల్లలందరినీ సమానం చేయగలగడం. నేనదే చేస్తున్నాను. నేను ఈ ఏడాది ఏప్రిల్‌లో టీచర్‌గా చేరాను. అప్పటి వరకు తరచూ స్కూలుకి ఆబ్సెంట్ అయిన పిల్లలెవరూ ఇప్పుడలా లేరు. స్కూల్‌ని ఇష్టపడుతున్నారు. – అనూరాధ – మంజీర -
'అనవసర ఔషధాలకు చెక్ పెట్టండి'
సాక్షి, హైదరాబాద్: పిల్లల ఆరోగ్యానికి చేటు తెచ్చే అనవసర మందులకు అడ్డుకట్ట వేయాలని పెడికాన్-2016 పిలుపునిచ్చింది. పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు హైటెక్స్‌లో ఆదివారం ముగిసింది. ఈ వివరాలను నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అనవసర మందులకు అడ్డుకట్ట వేయడానికి పాలకులు చేయూతనివ్వాలని సదస్సు విజ్ఞప్తి చేసింది. శిశుమరణాలు అంతకంతకూ పెరిగిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. పిల్లలకు జరిగే హానికర చికిత్స ప్రపంచానికి చేటు అని పేర్కొంది. పిల్లల వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోకపోతే.. భావి పౌరులైన బాలలు అభివృద్ధికి ఆటంకంగా మారగలరని పేర్కొంది. దీన్ని సామాజిక కోణంలో పరిగణించి పాలకులు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకొని పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందని సదస్సు అభిప్రాయపడింది. కేవలం పిల్లల వైద్యులతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్లను తప్పనిసరిగా తీసుకోవాలని సదస్సు కోరింది. ఆలస్యంగానైనా వాటిని తీసుకోవడం మరువొద్దని సూచించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ అంశాల మీద 700 మంది వైద్యులు తమ అనుభవాలను వెల్లడించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకావడంతో చర్చ ఫలప్రదమైందని సదస్సు స్పష్టంచేసింది. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. పిల్లల వైద్య సంరక్షణ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జుల్కిఫ్లీ ఇస్మాయిల్, ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) అధ్యక్షుడు ప్రమోద్ జోగ్, పెడికాన్ నిర్వాహకులు డాక్టర్ రంగయ్య, డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ నిర్మల, డాక్టర్ హిమబిందు సింగ్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవికుమార్, జగదీశ్చంద్ర, డాక్టర్ రమేష్ ధంపూరి తదితరులు పాల్గొన్నారు. -
కొరికేస్తున్న ‘చలి’
జిల్లాలో చలి పులి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనీస ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక ఇప్పటివరకు సుమారు నలుగురు మృతిచెందారు. కాగా, చిన్నారులు ‘ఆస్తమా’తో అవస్థలు పడుతున్నారు. అయితే చలి నుంచి రక్షణ పొందేందుకు కొద్ది పాటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ⇒జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు ⇒గజగజలాడుతున్న ప్రజలు ⇒మృత్యువాత పడుతున్న వృద్ధులు ⇒ఆస్తమా బారిన చిన్నారులు ⇒జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ఎంజీఎం : జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చలితీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకు కూడా చలి ప్రభావం ఉంటుండడంతో ప్రజలు బయటికి వచ్చేందు కు గజగజలాడుతున్నారు. వాతావారణంలో మార్పులు చోటుచేసుకుంటుండడంతో పెద్దలు, పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, చర్మ సంబంధిత వ్యాధులతో వారు సతమతమవుతున్నారు. ఆస్తమా బారిన చిన్నారులు... చలితీవ్రతో చిన్నారులు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చలితో జిల్లాలోని ఆస్పత్రులకు రోజుకు ఇద్ద రు చొప్పున చిన్నారులు అస్తమాతో బాధపడుతూ వస్తున్న ట్లు డాక్టర్లు చెబుతున్నారు. జన సాంద్రత, మస్కిటో కాయిల్స్ వినియోగంతో పట్టణాల్లో నివసించే పిల్లల్లో ఎక్కువ మంది అస్తమా బారిన పడుతున్నారంటున్నారు. దీంతోపాటు దు మ్ము, ధూళి, ఘాటైన వాసనలు, ఐస్‌క్రీమ్ వంటి చల్లని పదార్థాల్లో ఉంటున్న వైరల్ ఇన్ఫెక్షన్తో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలు 15 శాతం, పట్ణణాల్లో 20 శాతం మంది అస్తమాతో బాధపడుతున్నారు. అస్తమా బారిన పడిన చిన్నారు ల్లో శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం(తెమడ) వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఫలితం గా న్యూమోనియా బారిన పడే అవకాశముంది. ఆస్తమాను గుర్తించడం ఇలా... తరుచూ దగ్గు, జలుబు, అయాసం, దగ్గుతో కఫం(తెమడ) కక్కడం, పిల్లికూతలు, చంటి పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడే లక్షణాలు ఆస్తమాలో ఉంటాయి. ఏడాది వయసులోపు ఉన్న పిల్లల్లో దగ్గు, కఫం, ఆయాసం, వైరల్ ఇన్ఫెక్షన్తో బ్రాంకోలైటిస్ రావచ్చు. రాత్రివేళ ఎక్కువగా దగ్గు రావడం, ఎక్కువ సేపు ఆటలు ఆడినా, పరిగెత్తినా దగ్గు, ఆయాసం రావడం వంటివి ఆస్తమా లక్షణాలే. ఆహార పదార్థాలతో కూడా ఆస్తమా.. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్ ్సతో కూడా అస్తమా వచ్చే అవకాశం ఉంది. బత్తాయి పండ్లు, ప్యాకింగ్ ఫుడ్స్, కృతిమ రం గులు, ఫ్రిజర్వెటివ్స్ ఉన్న ఆహార పదార్థాలు అస్తమా వచ్చేందుకు కారణాలు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ⇒తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. తల్లులు మొదటి ఆరు నెలల వయస్సు వరకు బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి. ⇒పిల్లలు ఉండే పరిసరాలను శుభ్రంగా, దుమ్ము, ధూళి లేకుండా చూడాలి. ⇒ఇంటిలో నేలను చీపురుతో కాకుండా తడిగుడ్డతో శుభ్రం చేస్తే మంచిది. ⇒కట్టెల పొయ్యి, దోమల నివారణకు వాడే కాయిల్స్, సాంబ్రాణి ధూపం ఆస్తమా ఉన్న వారికి దూరంగా ఉంచాలి. ⇒పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచకూడదు. నూలు కలిగి ఉన్న బొమ్మలను దూరంగా ఉంచాలి. ⇒పిల్లలకు వాడే దుప్పట్లు, దిండు కవర్లు ఎప్పటికప్పుడు మార్చాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి... ఆస్తమా.. పెద్దగా భయపడాల్సిన జబ్బు కాదు. దాని ని సకాలంలో గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. ఆస్తమా తీవ్రంగా ఉంటే.. నెబ్యులైజేషన్ చికిత్సతో పా టు అవసరమైన సమయంలో ఇం జక్షన్లు తీసుకోవాలి. పెంపుడు జంతువులకు, దుమ్ము, ధూళికి పిల్లలను దూరంగా ఉంచాలి. -శేషుమాధవ్, పిడియాట్రీషన్ చలితో వచ్చే చర్మ వ్యాధులు... శీతాకాలంలో వచ్చే మార్పులతో చర్మం పొడిబారినట్లు అవుతుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి దురద, మంట ఎక్కువగా ఉండి బాధిస్తుంటాయి. జలుబు.. ఈ సీజన్లో చాలా మంది జలుబుతో బాధపడుతుంటా రు. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు సుమారు ఆరుగజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుం టుంది. జలుబు ప్రధానంగా దుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు పడకపోవడంతో వస్తుంది. గొంతునొప్పి... చలికాలంలో చాలా మంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడడంతో నొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీ యాలు, తేమగాలి పడకపోవడంతో టాన్సిలైటీస్, ఎడినాయిడ్స్, లెరింజైటీస్, పైరింజైటీస్ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.. జలుబు, గొంతునొప్పితో బాధపడేవారు ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస పండ్లు, ఖర్జూరాను ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఉదయం చలితీవ్రత తగ్గిన తర్వాత వాకింగ్ చేస్తే బాగుంటుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాల పై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి. అలాగే పొడిచర్మాన్ని మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్‌తో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. మిటమిన్ సీ ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇస్తే చర్మం పొడి ఆరిపోకుండా రక్షణ పొందుతుంది. - పావుశెట్టి శ్రీధర్, హోమియో ఫిజీషియన్