కొరికేస్తున్న ‘చలి’ | Cold wave conditions sweep Telangana | Sakshi
Sakshi News home page

కొరికేస్తున్న ‘చలి’

Published Fri, Dec 26 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

కొరికేస్తున్న ‘చలి’

కొరికేస్తున్న ‘చలి’

జిల్లాలో చలి పులి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనీస ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక ఇప్పటివరకు సుమారు నలుగురు మృతిచెందారు. కాగా, చిన్నారులు ‘ఆస్తమా’తో అవస్థలు పడుతున్నారు. అయితే చలి నుంచి రక్షణ పొందేందుకు కొద్ది పాటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
గజగజలాడుతున్న ప్రజలు
మృత్యువాత పడుతున్న వృద్ధులు
ఆస్తమా బారిన చిన్నారులు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

ఎంజీఎం : జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చలితీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకు కూడా చలి ప్రభావం ఉంటుండడంతో ప్రజలు బయటికి వచ్చేందు కు గజగజలాడుతున్నారు. వాతావారణంలో మార్పులు చోటుచేసుకుంటుండడంతో పెద్దలు, పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, చర్మ సంబంధిత వ్యాధులతో వారు సతమతమవుతున్నారు.
 
ఆస్తమా బారిన చిన్నారులు...
చలితీవ్రతో చిన్నారులు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చలితో జిల్లాలోని ఆస్పత్రులకు రోజుకు ఇద్ద రు చొప్పున చిన్నారులు అస్తమాతో బాధపడుతూ వస్తున్న ట్లు డాక్టర్లు చెబుతున్నారు. జన సాంద్రత, మస్కిటో కాయిల్స్ వినియోగంతో పట్టణాల్లో నివసించే పిల్లల్లో ఎక్కువ మంది అస్తమా బారిన పడుతున్నారంటున్నారు. దీంతోపాటు దు మ్ము, ధూళి, ఘాటైన వాసనలు, ఐస్‌క్రీమ్ వంటి చల్లని పదార్థాల్లో ఉంటున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలు 15 శాతం, పట్ణణాల్లో 20 శాతం మంది అస్తమాతో బాధపడుతున్నారు. అస్తమా బారిన పడిన చిన్నారు ల్లో శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం(తెమడ) వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఫలితం గా న్యూమోనియా బారిన పడే అవకాశముంది.
 
ఆస్తమాను గుర్తించడం ఇలా...

తరుచూ దగ్గు, జలుబు, అయాసం, దగ్గుతో కఫం(తెమడ) కక్కడం, పిల్లికూతలు, చంటి పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడే లక్షణాలు ఆస్తమాలో ఉంటాయి. ఏడాది వయసులోపు ఉన్న పిల్లల్లో దగ్గు, కఫం, ఆయాసం, వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బ్రాంకోలైటిస్ రావచ్చు. రాత్రివేళ ఎక్కువగా దగ్గు రావడం, ఎక్కువ సేపు ఆటలు ఆడినా, పరిగెత్తినా దగ్గు, ఆయాసం రావడం వంటివి ఆస్తమా లక్షణాలే.
 
ఆహార పదార్థాలతో కూడా ఆస్తమా..
ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్ ్సతో కూడా అస్తమా వచ్చే అవకాశం ఉంది. బత్తాయి పండ్లు, ప్యాకింగ్ ఫుడ్స్, కృతిమ రం గులు, ఫ్రిజర్‌వెటివ్స్ ఉన్న ఆహార పదార్థాలు అస్తమా వచ్చేందుకు కారణాలు.
 
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. తల్లులు మొదటి ఆరు నెలల వయస్సు వరకు బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి.
పిల్లలు ఉండే పరిసరాలను శుభ్రంగా, దుమ్ము, ధూళి లేకుండా చూడాలి.
ఇంటిలో నేలను చీపురుతో కాకుండా తడిగుడ్డతో శుభ్రం చేస్తే మంచిది.
కట్టెల పొయ్యి, దోమల నివారణకు వాడే కాయిల్స్, సాంబ్రాణి ధూపం ఆస్తమా ఉన్న వారికి దూరంగా ఉంచాలి.
పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచకూడదు. నూలు కలిగి ఉన్న బొమ్మలను దూరంగా ఉంచాలి.
పిల్లలకు వాడే దుప్పట్లు, దిండు కవర్లు ఎప్పటికప్పుడు మార్చాలి.
 
వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి...
ఆస్తమా.. పెద్దగా భయపడాల్సిన జబ్బు కాదు. దాని ని సకాలంలో గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. ఆస్తమా తీవ్రంగా ఉంటే.. నెబ్యులైజేషన్ చికిత్సతో పా టు అవసరమైన సమయంలో ఇం జక్షన్లు తీసుకోవాలి. పెంపుడు జంతువులకు, దుమ్ము, ధూళికి పిల్లలను దూరంగా ఉంచాలి.
                 -శేషుమాధవ్, పిడియాట్రీషన్
 
చలితో వచ్చే చర్మ వ్యాధులు...
శీతాకాలంలో వచ్చే మార్పులతో చర్మం పొడిబారినట్లు అవుతుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి  దురద, మంట ఎక్కువగా ఉండి బాధిస్తుంటాయి.

జలుబు..
ఈ సీజన్‌లో చాలా మంది జలుబుతో బాధపడుతుంటా రు. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు సుమారు ఆరుగజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుం టుంది. జలుబు ప్రధానంగా దుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు పడకపోవడంతో వస్తుంది.
 
గొంతునొప్పి...
చలికాలంలో చాలా మంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడడంతో నొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీ యాలు, తేమగాలి పడకపోవడంతో టాన్సిలైటీస్, ఎడినాయిడ్స్, లెరింజైటీస్, పైరింజైటీస్ వ్యాధులు వస్తాయి.
 
జాగ్రత్తలు తీసుకోవాలి..
జలుబు, గొంతునొప్పితో బాధపడేవారు ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస పండ్లు, ఖర్జూరాను ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఉదయం చలితీవ్రత తగ్గిన తర్వాత వాకింగ్ చేస్తే బాగుంటుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాల పై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి. అలాగే పొడిచర్మాన్ని మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్‌తో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. మిటమిన్ సీ ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇస్తే చర్మం పొడి ఆరిపోకుండా రక్షణ పొందుతుంది.    - పావుశెట్టి శ్రీధర్,  హోమియో ఫిజీషియన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement