Asthma disease
-
ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..!
'ఇప్పుడున్న చలి వాతావరణం కొందరు పిల్లల్లో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. చిన్నవయసులోనే నివారిస్తే, పెద్దయ్యాక ఆస్తమా బారినపడే అవకాశం తగ్గుతుంది. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..' జాగ్రత్తలు.. పిల్లలకు ఇచ్చే ఆహారంలో వరి అన్నంతో పాటు పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి వెజిటబుల్స్‌తో వండిన కూరలూ.. అలాగే మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో ఉన్న చిరుధాన్యాలతో చేసిన తిరుతిండ్లు తప్పక తినిపించాలి. వంటలో వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్ వంటివి వాడాలి. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు, అల్లం, మిరియాల పొడి వంటి సహజ మసాలా దినుసుల్లో ఆస్తమానూ, దాని తీవ్రతను తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి వాటిని తగినంతగా వాడుతుండాలి. కిస్మిస్, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తుండాలి. పండ్లలో బెర్రీ పండ్లు, బొ΄్పాయి, ఆపిల్ వంటివి ఇస్తుండాలి. తీసుకోకూడని వాటి విషయానికి వస్తే.. ఆహారంలోని కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, బ్రెడ్స్, కూల్‌డ్రింక్స్‌లలో వాడే పలు పదార్థాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మేలు. ఇవి చదవండి: మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి! -
ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే..
'చలికాలంలో చర్మసమస్యలు, జుట్టు రాలిపోవడం వంటివి ఎంత సాధారణమో, ఆస్త్మారోగులకు ఆయాసం ఎక్కువ కావడం, ఆర్థరైటిస్ అంటే కీళ్ల జబ్బులు ఉన్నవారికి కీళ్లనొప్పులు పెరగడం అంతే సహజం. గతవారం మనం కీళ్లజబ్బులకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కాబట్టి ఈవారం ఆస్త్మా రోగులు ఏం చేయాలి, ఏం చేయకూడదు.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.' దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా మొదలైనవన్నీ శ్వాసవాళాలకి, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులే. ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధి. దీనికి వయసుతో నిమిత్తంలేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. సరిపడని తత్వం అంటే ఎలర్జీ, దుమ్ము, ధూళి, పొగ, ధూమపానం, ఘాటైన వాసనలు, కాలుష్య వ్యర్థాలు, చలి వాతావరణం సరిపడకపోవటం వంటివి. ముందుగా శీతాకాలంలో ఆస్త్మా రోగులు ఎలా ఉండాలో చూద్దాం! శరీర తత్వాన్ని అనుసరించి ఏ పదార్థం తీసుకుంటే ఉబ్బసం వస్తుందో, ఆ పదార్థం లేదా పదార్థాలను పూర్తిగా మానివేయాలి. నిల్వ ఉన్న పదార్థాలకు ఉబ్బసం వ్యాధిగ్రస్థులు దూరంగా ఉండాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. ఉబ్బసం ప్రకోపించినప్పుడు, మరింతగా ఎక్కువ నీరు తాగాలి. రోగ నిరోధకశక్తిని పెంచేది విటమిన్–సి. అందువలన విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరలు అవసరం. ఆ క్రమంలో ప్రతిరోజు కనీసం ఒక సిట్రస్ పండు అయినా తప్పనిసరిగా తినాలి. మాంసాహారులయితే ఒమేగా–3 ఫాటీ యాసిడ్స్‌తో కూడిన చేపలను, కోడిమాంసాన్ని తీసుకోవచ్చు. శ్వాసనాళాలలోని జిగురు పొర పల్చబడకుండా ఉండటానికి కోడి మాంసం దోహదం చేస్తుంది. ఉబ్బసానికి వాడే అల్లోపతి మందులు చాలావరకు స్టెరాయిడ్ మందులు. వీటి వలన మంచితోబాటు కీడు కూడా జరుగుతుంది. ఉదయం పూట వేప నూనె ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఆవాల నూనె ఛాతీ మీద, గొంతుకు రాయాలి. ఆస్తమాతో బాధపడుతున్న వారు చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నట్టే.. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం కూడా అవసరం అవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా స్పందించినప్పుడు అది ఆహారపరమైన అలర్జీలకు దారితీస్తుంది. ఇది కొంతమందిలో ఆస్తమాకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ 'డి' ఆస్తమా నుంచి రక్షణనిచ్చే వాటిలో విటమిన్ డి ది కీలక పాత్ర. ముఖ్యంగా 6 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు డి విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు రూపంలో విటమిన్ డి అందుతుంది. పాలు, గుడ్లు కొందరిలో అలర్జీకి కారణమవుతాయి. పడని వారు వీటిని తీసుకోకూడదు. విటమిన్ 'ఎ' శరీరంలో విటమిన్ ఎ తగినంత ఉన్న పిల్లలకు ఆస్తమా సమస్య తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు గుర్తించాయి. పిల్లలలో విటమిన్ ఎ అధికంగా ఉంటే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందట. క్యారట్, బ్రకోలీ, ఆలుగడ్డ, పాలకూర తదితర వాటిల్లో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. పండ్లు రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా నివారణకు ఉపయోగపడతాయి. మెగ్నీషియం మెగ్నీషియం తక్కువగా ఉంటే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. కనుక గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, పాలకూర తదితర మెగ్నీషియం తగినంత లభించే వాటిని తీసుకోవాలి. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులకు ఉపశమనం. వీటిని దూరం పెట్టాలి.. పులిసిన పదార్థాలు, పొగతాగటం, మత్తుపానీయాలను సేవించటం, మసాలా దినుసులు, తీపి పదార్థాలు. కడుపునిండా తినడం కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమాకు కారణం కాకపోయినా, ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండడం అవసరం. సల్ఫైట్స్ అనే ప్రిజర్వేటివ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. ప్యాకేజ్డ్ పచ్చళ్లు, ప్యాకేజ్డ్ లెమన్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పై సల్ఫైట్స్ ఉంటాయి. కాఫీ, టీ, కొన్ని రకాల సుగంధ, మసాల దినుసుల్లోని శాలిసిలేట్స్ కూడా ఉబ్బసాన్ని పెంచుతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వాడే ప్రిజర్వేటివ్‌లు, ఆర్టిఫీషియల్ కలర్స్, ఫ్లావర్స్ తోనూ సమస్య పెరుగుతుంది. ఇవి చదవండి: అర్ధరాత్రి 1-4గంటల మధ్యలో నిద్ర లేస్తున్నారా? ఆత్మలు కల్లోకి.. -
ఇవి తింటే.. ఆస్తమా అటాక్ అవ్వదు!
ఆస్తమా నివారణ ఇలా... ఆస్తమా ఊపిరాడనివ్వకుండా చేస్త... ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిన విషయమే. పైగా వర్షాలతో ఇప్పుడున్న వాతావరణం ఆస్తమాకు మరింత దోహదం చేస్తుంది. కొన్ని ఆహారాలతో ఆస్తమా అటాక్ రాకుండా నివారణ ఇలా... తమకు సరిపడని పదార్థాలతో ఆస్తమా ట్రిగర్ అవుతుంది. అందుకే ఆహారాల్లో తమకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి. భోజనంలో... ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి వంటి వాటివి... కాయగూరల్లో కాకర, గుమ్మడి, క్యారట్, బీట్రూట్, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యాలు తీసుకోవాలి. పండ్లలో పుల్లటి పండ్లయిన కమలాలు, నిమ్మ, బత్తాయి, అరటిపండు వంటి వాటిని మినహాయించి, మిగతావాటిని అంటే ఉదాహరణకు బెర్రీ, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవచ్చు. ఆహారాన్ని వండేందుకు ఉపయోగించే దినుసుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజ మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
నెల వయసులోనే గుర్తించొచ్చు!
లాస్ ఏంజిలెస్: నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో సూక్ష్మజీవులు ఉంటే బాల్యంలో ఆస్తమా, ఇతర అలర్జీలకు గురయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఫలితాలు కొత్త చికిత్స అభివృద్ధికి దోహదం చేస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సుసాన్ లించ్ తెలిపారు. ఆస్తమా వ్యాధి నిర్ధారణ పిల్లల్లో ఏడేళ్ల వయసులో జరుగుతుందని, దీనికి చికిత్సా విధానం లేకపోవడంతో మందులు తీసుకోవాల్సి ఉంటుందని ఒక నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులు రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తదుపరి మూడేళ్ల వయసులో అలర్జీలకు, నాలుగేళ్ల వయసులో ఆస్తమాకు దారి తీస్తాయని పరిశోధకులు వెల్లడించారు. -
కొరికేస్తున్న ‘చలి’
జిల్లాలో చలి పులి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనీస ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక ఇప్పటివరకు సుమారు నలుగురు మృతిచెందారు. కాగా, చిన్నారులు ‘ఆస్తమా’తో అవస్థలు పడుతున్నారు. అయితే చలి నుంచి రక్షణ పొందేందుకు కొద్ది పాటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ⇒జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు ⇒గజగజలాడుతున్న ప్రజలు ⇒మృత్యువాత పడుతున్న వృద్ధులు ⇒ఆస్తమా బారిన చిన్నారులు ⇒జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ఎంజీఎం : జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చలితీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకు కూడా చలి ప్రభావం ఉంటుండడంతో ప్రజలు బయటికి వచ్చేందు కు గజగజలాడుతున్నారు. వాతావారణంలో మార్పులు చోటుచేసుకుంటుండడంతో పెద్దలు, పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, చర్మ సంబంధిత వ్యాధులతో వారు సతమతమవుతున్నారు. ఆస్తమా బారిన చిన్నారులు... చలితీవ్రతో చిన్నారులు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చలితో జిల్లాలోని ఆస్పత్రులకు రోజుకు ఇద్ద రు చొప్పున చిన్నారులు అస్తమాతో బాధపడుతూ వస్తున్న ట్లు డాక్టర్లు చెబుతున్నారు. జన సాంద్రత, మస్కిటో కాయిల్స్ వినియోగంతో పట్టణాల్లో నివసించే పిల్లల్లో ఎక్కువ మంది అస్తమా బారిన పడుతున్నారంటున్నారు. దీంతోపాటు దు మ్ము, ధూళి, ఘాటైన వాసనలు, ఐస్‌క్రీమ్ వంటి చల్లని పదార్థాల్లో ఉంటున్న వైరల్ ఇన్ఫెక్షన్తో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలు 15 శాతం, పట్ణణాల్లో 20 శాతం మంది అస్తమాతో బాధపడుతున్నారు. అస్తమా బారిన పడిన చిన్నారు ల్లో శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం(తెమడ) వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఫలితం గా న్యూమోనియా బారిన పడే అవకాశముంది. ఆస్తమాను గుర్తించడం ఇలా... తరుచూ దగ్గు, జలుబు, అయాసం, దగ్గుతో కఫం(తెమడ) కక్కడం, పిల్లికూతలు, చంటి పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడే లక్షణాలు ఆస్తమాలో ఉంటాయి. ఏడాది వయసులోపు ఉన్న పిల్లల్లో దగ్గు, కఫం, ఆయాసం, వైరల్ ఇన్ఫెక్షన్తో బ్రాంకోలైటిస్ రావచ్చు. రాత్రివేళ ఎక్కువగా దగ్గు రావడం, ఎక్కువ సేపు ఆటలు ఆడినా, పరిగెత్తినా దగ్గు, ఆయాసం రావడం వంటివి ఆస్తమా లక్షణాలే. ఆహార పదార్థాలతో కూడా ఆస్తమా.. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్ ్సతో కూడా అస్తమా వచ్చే అవకాశం ఉంది. బత్తాయి పండ్లు, ప్యాకింగ్ ఫుడ్స్, కృతిమ రం గులు, ఫ్రిజర్వెటివ్స్ ఉన్న ఆహార పదార్థాలు అస్తమా వచ్చేందుకు కారణాలు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ⇒తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. తల్లులు మొదటి ఆరు నెలల వయస్సు వరకు బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి. ⇒పిల్లలు ఉండే పరిసరాలను శుభ్రంగా, దుమ్ము, ధూళి లేకుండా చూడాలి. ⇒ఇంటిలో నేలను చీపురుతో కాకుండా తడిగుడ్డతో శుభ్రం చేస్తే మంచిది. ⇒కట్టెల పొయ్యి, దోమల నివారణకు వాడే కాయిల్స్, సాంబ్రాణి ధూపం ఆస్తమా ఉన్న వారికి దూరంగా ఉంచాలి. ⇒పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచకూడదు. నూలు కలిగి ఉన్న బొమ్మలను దూరంగా ఉంచాలి. ⇒పిల్లలకు వాడే దుప్పట్లు, దిండు కవర్లు ఎప్పటికప్పుడు మార్చాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి... ఆస్తమా.. పెద్దగా భయపడాల్సిన జబ్బు కాదు. దాని ని సకాలంలో గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. ఆస్తమా తీవ్రంగా ఉంటే.. నెబ్యులైజేషన్ చికిత్సతో పా టు అవసరమైన సమయంలో ఇం జక్షన్లు తీసుకోవాలి. పెంపుడు జంతువులకు, దుమ్ము, ధూళికి పిల్లలను దూరంగా ఉంచాలి. -శేషుమాధవ్, పిడియాట్రీషన్ చలితో వచ్చే చర్మ వ్యాధులు... శీతాకాలంలో వచ్చే మార్పులతో చర్మం పొడిబారినట్లు అవుతుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి దురద, మంట ఎక్కువగా ఉండి బాధిస్తుంటాయి. జలుబు.. ఈ సీజన్లో చాలా మంది జలుబుతో బాధపడుతుంటా రు. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు సుమారు ఆరుగజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుం టుంది. జలుబు ప్రధానంగా దుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు పడకపోవడంతో వస్తుంది. గొంతునొప్పి... చలికాలంలో చాలా మంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడడంతో నొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీ యాలు, తేమగాలి పడకపోవడంతో టాన్సిలైటీస్, ఎడినాయిడ్స్, లెరింజైటీస్, పైరింజైటీస్ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.. జలుబు, గొంతునొప్పితో బాధపడేవారు ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస పండ్లు, ఖర్జూరాను ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఉదయం చలితీవ్రత తగ్గిన తర్వాత వాకింగ్ చేస్తే బాగుంటుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాల పై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి. అలాగే పొడిచర్మాన్ని మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్‌తో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. మిటమిన్ సీ ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇస్తే చర్మం పొడి ఆరిపోకుండా రక్షణ పొందుతుంది. - పావుశెట్టి శ్రీధర్, హోమియో ఫిజీషియన్