ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! | Do Children Have Asthma But Do This | Sakshi
Sakshi News home page

ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..!

Published Sun, Jan 7 2024 1:32 PM | Last Updated on Sun, Jan 7 2024 1:32 PM

Do Children Have Asthma But Do This - Sakshi

'ఇప్పుడున్న చలి వాతావరణం కొందరు పిల్లల్లో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. చిన్నవయసులోనే నివారిస్తే, పెద్దయ్యాక ఆస్తమా బారినపడే అవకాశం తగ్గుతుంది. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..'

జాగ్రత్తలు..

  • పిల్లలకు ఇచ్చే ఆహారంలో వరి అన్నంతో పాటు పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి వెజిటబుల్స్‌తో వండిన కూరలూ.. అలాగే మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో ఉన్న చిరుధాన్యాలతో చేసిన తిరుతిండ్లు తప్పక తినిపించాలి.
  • వంటలో వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్‌ ఆయిల్‌ వంటివి వాడాలి.
  • ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు, అల్లం,  మిరియాల పొడి వంటి సహజ మసాలా దినుసుల్లో ఆస్తమానూ, దాని తీవ్రతను తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి వాటిని తగినంతగా వాడుతుండాలి.
  • కిస్‌మిస్, బాదం, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ తినిపిస్తుండాలి.
  • పండ్లలో బెర్రీ పండ్లు, బొ΄్పాయి, ఆపిల్‌ వంటివి ఇస్తుండాలి.

తీసుకోకూడని వాటి విషయానికి వస్తే.. ఆహారంలోని కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, బ్రెడ్స్, కూల్‌డ్రింక్స్‌లలో వాడే పలు పదార్థాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మేలు.

ఇవి చదవండి: మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement