'ఊపిరి' కోసం నాగ్, కార్తీల సాహసం
కుర్ర హీరోలకు పోటి ఇచ్చేందుకు సీనియర్ హీరో నాగార్జున అన్ని రకాలుగా కష్టపడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక పాత్రలతో కూడా సత్తా చాటుతున్నాడు. అంతేకాదు ఈ ఏజ్లో కూడా సినిమా కోసం రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడు. తాజాగా ఊపిరి సినిమా కోసం కార్తీతో కలిసి ఇలాంటి సాహసమే చేశాడు.
త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా కోసం వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు నాగార్జున, కార్తీ. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ సీన్ కోసం ఇంత రిస్క్ చేశారు ఈ స్టార్స్. కేవలం 2 రోజులు ట్రైనింగ్ మాత్రమే తీసుకోని ఈ రిస్కీ సీన్ను పూర్తి చేశారు.
'ఫ్రెంచ్ మూవీ ది ఇన్టచబుల్స్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, కార్తీలతో పాటు అనుష్క, తమన్నాలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి మన నేటివిటికి తగ్గ మార్పులతో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.