ఊపిరి రీమేక్లో మెగాస్టార్..? | mega star amithab bacchan in Oopiris Bollywood remake | Sakshi
Sakshi News home page

ఊపిరి రీమేక్లో మెగాస్టార్..?

Published Fri, Apr 15 2016 10:06 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఊపిరి రీమేక్లో మెగాస్టార్..? - Sakshi

ఊపిరి రీమేక్లో మెగాస్టార్..?

సౌత్ ఇండస్ట్రీలో సంచలనాలు నమోదు చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ ఊపిరి. నాగార్జున, కార్తీ హీరోలుగా తెరకెక్కిన ఈ బైలింగ్యువల్ సినిమా, భారీ వసూళ్లను సాధించటంతో పాటు విశ్లేషకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ మొత్తానికి ఊపిరి రైట్స్ను సొంతం చేసుకున్నారు.
 
అయితే ఈ రీమేక్లో లీడ్ రోల్స్ నటించే నటీనటులపై చర్చ మొదలైంది. ముందుగా సల్మాన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్కనుందంటూ ప్రచారం జరిగినా చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో ఈ సినిమాను రీమేక్ చేయనున్నారన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తోంది. నాగార్జున నటించిన పాత్రలో అమితాబ్ నటిస్తే సినిమా స్థాయి పెరుగుతుందని భావిస్తున్నారు.
 
వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అమితాబ్, ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అయితే కార్తీ కనిపించిన పాత్రలో యంగ్ హీరో వరుణ్ ధావన్ అయితే పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారట. ఇప్పటి వరకు చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement